టాలీవుడ్ కి లక్కీ ఇయర్ గా ‘2020’ స్టార్ హీరోలందరూ ఈ ఏడాదే

2020 Turning Out As A Lucky Year For Telugu Film Industry, 2020 Turning Out As A Lucky Year For Telugu Films, 2020 Turning Out As A Lucky Year For Telugu Movies, 2020 Turning Out As A Lucky Year For TFI, 2020 Turning Out As A Lucky Year For Tollywood, Latest Telugu Movies News, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates

గత ఏడాది తెలుగు సినీపరిశ్రమకు కాస్త కలిసిరాలేదనే చెప్పాలి. ఏడాది ప్రారంభమే కాస్త నిరాశ పరిచింది. 2019 పొంగల్ కు పలు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీకి దిగినా… ఒక్క ఎఫ్2 మినహా ఏ సినిమాలు పెద్దగా ఆడలేదు. అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఇక ఆ తర్వాత సమ్మర్ లో.. ద్వితియార్థంలో, ఏడాది చివరిలో వచ్చిన సినిమాల్లో కూడా చాలా తక్కువ సినిమాలే హిట్ లను సొంతం చేసుకున్నాయి. కాకపోతే కొంతమంది హీరోలకు మాత్రం మంచి కమ్ బ్యాక్ ఇయర్ అయిందని చెప్పొచ్చు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే 2020 మాత్రం టాలీవుడ్ కి బాగానే కలిసొచ్చేలా కనిపిస్తుంది. ఆరంభం బావుంటే అంతిమం బావుంటుంది అన్నట్టు.. ఈ ఏడాది హిట్ సినిమాలతో ఆరంభమే మంచిగా కుదిరింది. ముందుగా వచ్చిన తమిళ డబ్బింగ్ సినిమా దర్బార్ హిట్ టాక్ తెచ్చుకొని… సంక్రాంతికి గుడ్ ఓపెనింగ్ ఇచ్చింది. ఇక ఆ తర్వాత వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’,’అల వైకుంఠపురములో’ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ సొంతం చేసుకున్నాయి. కోట్లలో కలెక్షన్స్ రాబడుతున్నాయి. ఇక ఆ తర్వాత వచ్చిన ‘ఎంత మంచివాడవురా’ సినిమా కూడా మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. నిన్న విడుదలైన రవితేజ సినిమా ‘డిస్కో రాజా’ కూడా హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.

[custom_ad]

అయితే గత ఏడాది కొంత మంది హీరోల సినిమాలు అసలు రానే లేదు. కానీ ఇక ఈ ఏడాది మాత్రం దాదాపు అందరి సినిమాలు… పెద్ద హీరోల సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ అవ్వనుంది. 2018 వచ్చిన ‘నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమా తర్వాత మరేం సినిమా చేయలేదు. చాలా గ్యాప్ తర్వాత ఈ ఏడాది ‘అలవైకుంఠపురములో’ సినిమా తో వచ్చాడు. దాదాపు రెండేళ్ళ తర్వాత మాస్ మహారాజ ‘రవితేజ’ డిస్కో రాజాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఈ ఏడాదే.. చరణ్, తారక్ ‘ఆర్ఆర్ఆర్’ తో వస్తున్నారు. రామ్ చరణ్ ‘రంగస్థలం’, ఎన్టీఆర్ ‘అరవింద సమేత’ సినిమాలు 2018 లోనే వచ్చాయి.

అన్నిటికన్నా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఈ ఏడాదే జరిగింది. ఒకటి రెండు రెండు సినిమాలతో పవన్ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఒకటి పింక్ రీమేక్ కాగా.. మరొకటి క్రిష్ సినిమా. పింక్ మూవీ ఈ సమ్మర్లోనే రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివల ప్రాజెక్ట్ ఈ సంవత్సరమే వస్తుంది. సుకుమార్, బన్నీల చిత్రం కూడా 2020 రెండవ సగంలో ప్రేక్షకుల్ని పలకరించవచ్చు. అలాగే మహేష్ బాబు, వంశీ పైడిపల్లిల చిత్రం కూడా 2020 లోనే రిలీజయ్యే అవకాశాలున్నాయి. వీరితో పాటు ప్రభాస్ ‘జాన్’ సినిమాకూడా ఈ సంవత్సరంలోనే విడుదలకానుంది. ఇక ‘నారప్ప’ చిత్రంతో వెంకటేష్, ‘వైల్డ్ డాగ్’ మూవీతో నాగర్జున, బోయపాటి చిత్రంతో బాలకృష్ణ కూడా ఈ సంవత్సరమే థియేటర్లలోకి దిగనున్నారు.

[custom_ad]

ఇంకా వీరితో పాటు యంగ్ హీరోలు నాని ‘v’ సినిమా, నితిన్ ‘భీష్మ’, నాగచైతన్య ‘లవ్ స్టోరీ’, నాగశౌర్య ‘అశ్వద్దామ’, వరుణ్ తేజ్ సినిమా, రానా ‘విరాట పర్వం’, విజయ్ దేవరకొండ ‘వరల్డ్ ఫేమస్ లవర్’, అఖిల్ సినిమా, అల్లరి నరేష్ ‘నాంది’ ఇంకా పలు సినిమాలు రానున్నాయి. ఇలా ఒక పక్క స్టార్ హీరోలతో పాటు.. మరోపక్క యంగ్ హీరో సినిమాలతో బాక్స్ ఆఫీస్ దద్దరిల్లనుంది. మొత్తానికి ఇలా అందరి స్టార్ హీరోల సినిమాలు ఒకే ఏడాది రావడం సినీప్రేక్షకులకు పండగే.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 2 =