విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు యన్.టి.రామారావు, దిగ్గజ దర్శకనిర్మాత బి.యన్.రెడ్డిది అపూర్వ జోడి. వీరిద్దరి కలయికలో రూపొందిన తొలి, మలి చిత్రాలు ‘మల్లీశ్వరి’, ‘భాగ్యరేఖ’ మంచి విజయం సాధించగా… ముచ్చటగా మూడో సినిమాగా తెరకెక్కిన ‘రాజమకుటం’ కూడా అదే బాటలో నడవడం విశేషం. ఇందులో యన్టీఆర్ సరసన రాజసులోచన కథానాయికగా నటించగా… గుమ్మడి, రాజనాల, పద్మనాభం, కస్తూరి శివరావు, వంగర, కన్నాంబ తదితరులు ఇతర ముఖ్య భూమికలు పోషించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
ఈ చిత్రానికి బి.యన్.రెడ్డి దర్శకత్వం వహించడమే కాకుండా… వాహినీ ప్రొడక్షన్స్ పతాకంపై తనే నిర్మించడం మరో విశేషం. దేవులపల్లి కృష్ణశాస్త్రి, కొసరాజు గీతాలకు… మాస్టర్ వేణు స్వరకల్పన చేశారు. వాటిలో “సడిసేయకో గాలి” అనే పాట ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. 1960 ఫిబ్రవరి 24న విడుదలై ఘనవిజయం సాధించిన ‘రాజమకుటం’… నేటితో 60 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























