మొదటి సినిమా ‘చిత్రం’ తోనే సంచలన విజయం సాధించిన తేజ ఆ తర్వాత వరుసగా ‘నువ్వు నేను’, ‘జయం’ ఇలా సూపర్ హిట్లు కొట్టాడు. ఇక ఫుల్ ఫామ్ లో వున్న తేజ ఆ తరవాత తీసిన సినిమాల వల్ల కాస్త వెనుకపడ్డాడు. అయితే చాలా కాలం తర్వాత రానాతో ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా హిట్ తో కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఆ తర్వాత వచ్చిన ‘సీత’ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిందనుకోండి. ఈ మూవీ తరువాత మళ్ళీ కాజల్ తో మరో చిత్రం చేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. ఐతే ఆయన ఇంత వరకు ఎటువంటి చిత్రం ప్రకటించలేదు. ఇక ఇటీవల గోపీచంద్ తో కూడా సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి. ఇదిలా ఉండగా.. ఈ రోజు తేజ పుట్టిన రోజు సందర్భంగా రెండు టైటిల్స్ రిజిస్టర్ చేయించినట్టు తెలుస్తుంది. అందులో ఒక టైటిల్ ‘అలివేలుమంగ వెంకటరమణ’ కాగా మరోటి ‘రాక్షసరాజు రావణాసురుడు’. ఈ రెండు చిత్రాలలో ఒక చిత్రంలో రానా నటిస్తుండగా మరో చిత్రంలో గోపి చంద్ నటించనున్నాడు. ఈ సినిమాలకు సంబంధించిన మరిన్ని త్వరలో వెల్లడించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
మొత్తానికి మునుపటి కంటే తేజ కాస్త స్పీడ్ ను పెంచాడు. ఏడాదికి ఒక్క సినిమాను కాకుండా బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలను లైన్ లో పెట్టాడు. త్వరలోనే ఈ సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్టు తెలుస్తుంది. మరి ఈ రెండు సినిమాలు ఈ ఏడాదే రిలీజ్ అవుతాయా?లేదా? అన్నది చూడాలి..!
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: