మహిళలకు హైదరాబాద్ సేఫ్ సిటీ అంటుంది ఫిదా పిల్ల సాయి పల్లవి. అసలు సంగతేంటంటే.. హైదరాబాద్‌లోని హెచ్‌ఐఐసీలో సైబరాబాద్ పోలీసులు, సొసైటీ ఫర్ సెక్యూరిటీ కౌన్సిల్ సంయుక్త ఆధ్వర్యంలో మహిళా సాధికారత సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సాయి పల్లవి.. మహిళా ఉద్యోగుల భద్రత కోసం రూపొందించిన ‘షీ సేఫ్’ అనే ప్రత్యేక యాప్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళల భద్రత కోసం తెలంగాణ పోలీసులు ఎంతో కృషి చేస్తున్నారని, పోలీసుల భద్రతతో మహిళలు నిశ్చింతగా ఉంటున్నారన్నారని.. మహిళకు హైదరాబాద్ సేఫ్ సిటీ అని ఆమె తెలిపింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
కాగా ప్రస్తుతం శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ‘లవ్ స్టోరీ’ అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. శ్రీ వెంకటేశ్వరా సినీ క్రియేషన్స్ తో పాటు శేఖర్ కమ్ములహోమ్ ప్రొడక్షన్ అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎ.ఆర్.రెహమాన్ వద్ద సహాయకుడిగా పనిచేసిన పవన్ సంగీతం అందిస్తున్నాడు. సమ్మర్లో సినిమా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: