
ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 170

'అరణ్య' కోసం 30 కిలోల బరువు తగ్గిన రానా!
'రెడ్' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
'తలైవి' - జానకిగా 'మధుబాల', శశికళగా 'పూర్ణ'
పునర్జన్మల నేపథ్యంలో నాని ‘శ్యామ్ సింగరాయ్’

ఎన్టీఆర్ తో ఐదోసారి..?

భీష్మ 4 డేస్ సాలిడ్ కలెక్షన్స్
అంచనాలు పెంచుతున్న'HIT' స్నీక్ పీక్ వీడియో

చిరంజీవి ‘అల్లుడా మజాకా!’కి 25 ఏళ్ళు

`తలైవి`లో `రోజా` జోడీ

ఫ్లాష్ బ్యాక్ మోడ్ లో `నారప్ప`

భాగ్యనగరంలో `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్`

`శ్యామ్ సింగ రాయ్`కి జోడీగా సాయిపల్లవి?

గ్యాంగ్ లీడర్ డైరెక్టర్ తో రామ్ చరణ్..?

# NANI27 టైటిల్ రిలీజ్
నితిన్ కి డబుల్ కంగ్రాట్స్

స్నీక్ పీక్ ట్రెండ్ గురించి రాజమౌళి స్పందన

నానితో మరోసారి రష్మిక జోడీ?
నేచురల్ స్టార్ నాని... `శ్యామ్ సింగ రాయ్` పేరుతో ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. `టాక్సీవాలా` ఫేమ్ రాహుల్ సంకృత్యన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది.
'అరణ్య' కోసం 30 కిలోల బరువు తగ్గిన రానా!
ఎప్పుడూ విభిన్నమైన కథలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి చూస్తాడు రానా దగ్గుబాటి. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ స్టోరీ తో వస్తున్నాడు. ప్రభు సోలమన్ దర్శకత్వంలో రానా దగ్గుబాటి, జోయా హుస్సేన్ జంటగా "హాథీ మేరే సాథీ " అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో 'అరణ్య', తమిళ్‌లో కదన్ పేరుతో రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుండగా మరో పక్క ప్రమోషన్ కార్యక్రమాలను స్టార్ట్ చేసింది. ఇటీవలే ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.
'రెడ్' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ ప్రధాన పాత్రలో 'రెడ్' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తిచేసుకున్న `రెడ్` పాటల చిత్రీకరణలో వుంది. తమిళంలో సూపర్ హిట్ అయిన 'తడం' సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ నుఇటీవలే రిలీజ్ చేయగా.. రామ్ లుక్స్ ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. తాజాగా ఈ సినిమా టీజర్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. ఈ సినిమా టీజర్ ను ఫిబ్రవరి 28వ తేదీన సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేయనున్నారు.
'తలైవి' - జానకిగా 'మధుబాల', శశికళగా 'పూర్ణ'
ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో దివంగత తమిళనాడు ముఖ్య మంత్రి జయలలిత బయోపిక్ 'తలైవి' రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో జయలలిత పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగన రనౌత్ నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది.
పునర్జన్మల నేపథ్యంలో నాని ‘శ్యామ్ సింగరాయ్’
టాక్సీవాలా దర్శకుడు రాహుల్ సంకీర్త్యన్‌తో కలిసి నాని ఓ సినిమాను చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘శ్యామ్ సింగరాయ్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ పై నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాను ఈ ఏడాది చివరిలో క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు కూడా తెలిపారు.

ఎన్టీఆర్ తో ఐదోసారి..?
ఎన్టీఆర్-సమంత కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బృందావనం సినిమాతో మొదట స్క్రీన్ షేర్ చేసుకున్న వీరిద్దరూ.. ఇప్పుడు ఆ తర్వాత రభస, 'రామయ్య వస్తావయ్యా' ఆతర్వాత జనతా గ్యారేజ్ ఇలా వరుసగా నాలుగు సినిమాలు చేశారు. ఇప్పుడు ఐదోసారి జత కట్టనున్నట్టు తెలుస్తుంది. త్రివిక్రమ్ తోనే తన తర్వాత సినిమా ఉంబోతున్నట్టు ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వంలో... ఎన్టీఆర్ హీరోగా హారిక అండ్ హాసిని మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ పై రాధా కృష్ణ, కళ్యాణ్ రామ్ కలిసి సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తున్నారు.

భీష్మ 4 డేస్ సాలిడ్ కలెక్షన్స్
మొత్తానికి నితిన్ కూడా లేట్ గా వచ్చినా సూపర్ హిట్ కొట్టాడు. వెంకీ కుడుములు దర్శకత్వంలో నితిన్-రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా భీష్మ. మహా శివరాత్రి పండుగ రోజు రిలీజ్ అయిన ఈ సినిమా హిట్ టాక్ ను తెచ్చుకొని బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. మొదటి రోజు తెలుగు రాష్ట్రాలలో 6 కోట్లకు పైగా షేర్ సాధించిన 'భీష్మ' రెండో రోజు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర తన జోరు కొనసాగించింది. రెండవ రోజు దాదాపు నాలుగు కోట్ల షేర్ వసూలు చేసింది. ఇక మూడు రోజులకు 14.9 కోట్ల షేర్ ను రాబట్టింది. నాలుగు రోజుల్లో దాదాపు 17 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇదిలా ఉండగా ఈ వారం పెద్దగా చెప్పుకోవాల్సిన సినిమాలు ఏం లేవు…
అంచనాలు పెంచుతున్న'HIT' స్నీక్ పీక్ వీడియో
రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో రోజుకో అప్ డేట్ తో బజ్ క్రియేట్ చేస్తున్నారు 'హిట్' చిత్ర బృందం. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్, టీజర్,ట్రైలర్ ప్రేక్షకులకి మంచి థ్రిల్ కలిగించాయి. తాజాగా నాలుగున్నర నిమిషాల స్నీక్ పీక్ వీడియో విడుదల చేశారు. ఇక ఈ వీడియో ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచుతుంది. హత్య చేసి పొదల్లో పాతిపెట్టిన మహిళ మృత దేహాన్ని విశ్వక్ సేన్ చాలా చాకచక్యంగా కనిపెడతాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అయింది.ఈ చిత్రంలో ప్రీతీ అని ఒక మిస్సింగ్ అమ్మాయి చుట్టూ కథ తిరుగుతుందని తెలుస్తుంది.

చిరంజీవి ‘అల్లుడా మజాకా!’కి 25 ఏళ్ళు
మెగాస్టార్ చిరంజీవి, దేవీ ఫిలిం ప్రొడక్షన్స్ అధినేత దేవీవర ప్రసాద్‌ది విజయవంతమైన జోడి. ‘తిరుగులేని మనిషి’(1981)తో మొదలైన వీరి ప్రయాణం... ‘మృగరాజు’(2001) వరకు సాగింది. వీరి కలయికలో వచ్చిన పలు విజయవంతమైన చిత్రాల్లో ‘అల్లుడా మజాకా!’ ఒకటి. చిరంజీవి, రమ్యకృష్ణ, రంభ నాయకానాయికలుగా నటించిన ఈ సినిమాలో... లక్ష్మి, ఊహ, కోట శ్రీనివాసరావు, గిరిబాబు, బ్రహ్మానందం, మల్లికార్జునరావు, శ్రీహరి, ఎ.వి.యస్, మహేష్ ఆనంద్, అల్లు రామలింగయ్య, చలపతిరావు తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ‘ఘరానా మొగుడు’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత చిరు, నిర్మాత దేవీవర ప్రసాద్ కాంబినేషన్‌లో…

`తలైవి`లో `రోజా` జోడీ
లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం రూపొందించిన `రోజా` (1992) చిత్రం... అప్పట్లో ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మణిరత్నం దర్శకత్వ ప్రతిభ, ఎ.ఆర్. రెహమాన్ బాణీలు, అరవింద్ స్వామి - మధుబాల జోడీ అభినయం... ఆ సినిమాని క్లాసిక్ గా నిలిపాయి. అలాంటి `రోజా` చిత్రంలో జంటగా నటించిన అరవింద్ స్వామి, మధుబాల... చాన్నాళ్ళ తరువాత మరోమారు జట్టుకట్టనున్నారు.

ఫ్లాష్ బ్యాక్ మోడ్ లో `నారప్ప`
తమిళనాట సంచలనం సృష్టించిన `అసురన్`... తెలుగులో `నారప్ప` పేరిట పునర్నిర్మితమవుతున్న సంగతి తెలిసిందే. విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో అతనికి జోడీగా ప్రియమణి సందడి చేయనుంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో డి. సురేష్ బాబు, కలైపులి ఎస్. థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతమందిస్తున్నాడు.

భాగ్యనగరంలో `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్`
అక్కినేని అఖిల్ టైటిల్ రోల్ లో నటిస్తున్న చిత్రం `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్`. `బుట్టబొమ్మ` పూజా హెగ్డే నాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని `బొమ్మరిల్లు` భాస్కర్ రూపొందిస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్, వాసు వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సగానికిపైగా చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కి సంబంధించి తాజా షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఇందులో భాగంగా షాపింగ్ మాల్ నేపథ్యంలో సాగే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. కాగా, గోపీసుందర్ సంగీతమందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని వేసవి కానుకగా ఏప్రిల్ నెలలో విడుదల చేయనున్నారు.

`శ్యామ్ సింగ రాయ్`కి జోడీగా సాయిపల్లవి?
నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా `టాక్సీవాలా` ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో `శ్యామ్ సింగ రాయ్` పేరుతో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రం... త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది. అలాగే క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న థియేటర్లలో సందడి చేయనుంది.

గ్యాంగ్ లీడర్ డైరెక్టర్ తో రామ్ చరణ్..?
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా 'ఆర్ఆర్ఆర్' సినిమాలో నటిస్తూ ఎన్టీఆర్, రామ్ చరణ్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా తర్వాత అటు ఎన్టీఆర్ కానీ ఇటు రామ్ చరణ్ కానీ ఎవరి డైరెక్షన్ లో నటిస్తారా అని గతకొద్ది కాలంగా తెగ చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఎన్టీఆర్ విషయంలో మాత్రం క్లారిటీ వచ్చేసింది. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ త్రివిక్రమ్ తో అని ఇటీవలే ప్రకటించారు. ఇక ఇప్పుడు రామ్ చరణ్ సినిమా ఎవరితో ఉండబోతుందో అన్న చర్చలు నడుస్తున్నాయి.
ఫిబ్రవరి 28 వ తేదీ రిలీజ్ కానున్న 5 సినిమాలు
ప్రతీ శుక్రవారం కొత్త సినిమాలు రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 28 వ తేదీ శుక్రవారం కూడా 5 సినిమాలు రిలీజ్ అయ్యి అలరించనున్నాయి. వీటిలో 2 డబ్బింగ్ సినిమాలు కూడా ఉన్నాయి. ఈ 5 మూవీస్ గురించి తెలుసుకుందాం.

# NANI27 టైటిల్ రిలీజ్
టాలీవుడ్ యాక్టర్ నాని బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ బిజీ గా వున్నాడు. ఇప్పటికే నాని, సుధీర్‌బాబు కాంబినేషన్ లో ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో 'వి' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. నివేత థామస్, అదితి రావు హైదరి హీరోయిన్లు గా... శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శిరీష్, హర్షిత్ రెడ్డి రూపొందుతున్న ఈ సినిమా ఉగాది పండుగ రోజు అంటే మార్చి25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
'V' నుండి మొదటి పాట విడుదల
ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం లో నాని హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా 'V'. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. మరోపక్క ప్రమోషనా కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. ఇక రీసెంట్ గా ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ చిత్రంలో నాని పాత్రకు ధీటుగా ఉండే ఐపీయస్ ఆఫీసర్ పాత్రలో సుధీర్‌బాబు నటిస్తున్నట్టు తెలుస్తుంది. నాని, సుధీర్ బాబు మధ్య నువ్వా నేనా? అనేలా వచ్చే యాక్షన్ సన్నివేశాలు సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలిచేలా ఉన్నాయి. అంతేకాదు ఈ సినిమాలో మరో కొత్త నానిని చూసే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది.
నితిన్ కి డబుల్ కంగ్రాట్స్
''అ ఆ'' లాంటి సూపర్ హిట్ సినిమా తరువాత ‘లై’, ‘ఛల్ మోహన్ రంగ’, ‘శ్రీనివాస కళ్యాణం’తో వరుసగా హ్యాట్రిక్ ప్లాప్స్ అందుకున్నాడు నితిన్. దీంతో చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని 'భీష్మ' సినిమాతో వచ్చాడు. ఇక ఈ నెల 21వ తేదీన విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా కామెడీని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమాలో నితిన్-రష్మిక జోడి, డిఫరెంట్ కంటెంట్, కామెడీ ఇలా అన్నీ ఈ సినిమాకు కలిసిరావడంతో అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక కలెక్షన్స్ కూడా భారీగానే రాబడుతుంది. తెలుగు రాష్ట్రాలలోనే కాదు యూఎస్ లోను తన జోరు చూపుతోంది.
పిట్టకథ నుండి 'ఏదో.. ఏదో' ఫుల్ సాంగ్ రిలీజ్
విశ్వంత్, సంజయ్ రావు, నిత్యా శెట్టి, బ్రహ్మాజీ ప్రధాన పాత్రధారులుగా.. చెందు ముద్దు దర్శకుడిగా పరిచయం అవుతూ వస్తున్న సినిమా 'ఓ పిట్టకథ'. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటూనే..మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేశారు చిత్రయూనిట్. ఇప్పటీకే ఈ సినిమా నుండి ప్రీ-టీజర్, టీజర్, మొదటి పాటను రిలీజ్ చేయగా ఇప్పుడు ఈ సినిమా నుండి మరో పాటను రిలీజ్ చేశారు. 'ఏదో.. ఏదో' పాట ఫుల్ లిరికల్ వీడియో ను రిలీజ్ చేశారు.

స్నీక్ పీక్ ట్రెండ్ గురించి రాజమౌళి స్పందన
హీరో నాని స్వంత బ్యానర్ వాల్ పోస్టర్ సినిమా పై రూపొందిన"HIT" మూవీ 28వ తేదీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. "HIT" మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న (23 వ తేదీ ) జరిగింది. ఈ ఈవెంట్ లో ముఖ్య అతిథి గా పాల్గొన్న రాజమౌళి మాట్లాడుతూ .. "HIT" మూవీ టీజర్, ట్రైలర్ స్టైలిష్ గా ఉన్నాయని, ఈ మూవీ స్నీక్ పీక్ రిలీజ్ చేసినందుకు టీమ్ కు అభినందనలు తెలిపారు.