అనుష్క పెళ్లి మ్యాటర్ ఎప్పుడూ టాక్ ఆఫ్ ద టౌనే. ఎవరో ఒకరితో అనుష్క పెళ్లి అంటూ వార్తలు వస్తూనే ఉంటాయి. ముందు మన బాహుబలి ప్రభాస్ తో అన్నారు. ఈ వార్తలు ఒక మూడు నాలుగేళ్లే వచ్చాయి. తమ మధ్య ఫ్రెండ్‌షిప్పే కానీ ప్రేమ లేదని చాలా సార్లు ఇద్దరూ క్లారిటీ ఇచ్చారు. అయినా కూడా రూమర్లకు బ్రేక్ పడలేదు. గత ఏడాది అయితే వీరిద్దరూ పెళ్లి చేసుకుంటున్నారు అని కూడా అన్నారు. ఇక ఆ తర్వాత ఎవరో బిజినెస్ మ్యాన్ ను పెళ్లి చేసుకోబోతుంది అని అన్నారు. ఇక రీసెంట్ గా ఓ క్రికెటర్‌తో ప్రేమలో పడిందనే ప్రచారం జరుగుతోంది. ఆ క్రికెటర్ తోనే అనుష్క పెళ్లి అని బాగానే వార్తలు వచ్చాయి. దీనితో ఇక తనపై వస్తున్న వార్తలపై అనుష్క స్పందించి అసహనం వ్యక్తం చేసింది. తన పెళ్లి గురించే ఇలా ఎందుకు రూమర్స్ వస్తున్నాయో అర్థం కావడం లేదని.. తనపై లేనిపోని తప్పుడు ప్రచారం చేయడం బాధగా ఉందని అంది. అంతేకాదు తన పెళ్లి గురించి తన తల్లిదండ్రులే నిర్ణయం తీసుకుంటారని.. వాళ్లు ఎవరిని చూపించి పెళ్లి చేసుకోమంటారో అతడినే పెళ్లి చేసుకుంటాని క్లారిటీ ఇచ్చేసింది. మరి ఇప్పుడైనా అనుష్క పై ఈ రూమర్ల తగ్గుతాయేమో చూద్దాం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
కాగా హేమంత్ మధుకర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో ‘నిశ్శబ్దం’ మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. తెలుగు,తమిళ, ఇంగ్లీష్,మలయాళ, హిందీ భాషలలో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగులో ‘నిశ్శబ్దం’ టైటిల్ తోను, మిగతా భాషలలో సైలెన్స్ టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ఏప్రిల్ 2వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇంకా ఈ సినిమాలో మాధవన్, అంజలి, షాలిని పాండే, శ్రీనివాస్ అవసరాల, సుబ్బరాజు, మైఖేల్ మ్యాడ్సన్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల, కోన వెంకట్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాకు గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: