‘పలాస 1978’ రిలీజ్ డేట్ ఫిక్స్

Palasa 1978 Movie Gets A Release Date

1978 ప్రాంతంలో పలాసలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ‘‘పలాస 1978’’. తమ్మారెడ్డి భరధ్వాజ సమర్పణలో సుధా మీడియా పతాకంపై ధ్యాన్ అట్లూరి నిర్మించిన ఈ చిత్రంలో రక్షిత్, నక్షత్ర జంటగా నటింస్తున్న ఈ సినిమా ద్వారా. కరుణ కుమార్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇక ఇటీవలే ఈ సినిమా టీజర్ ను రెలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు అందరిలో మరింతగా ఆసక్తి పెరిగిపోయింది.

[custom_ad]

తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేసుకుంది. వచ్చేనెల 6వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. కాగా రక్షిత్, నక్షత్ర హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీలో రఘు కుంచె, తిరువీర్, జనార్థన్, లక్ష్మణ్, శృతి, జగదీష్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. మరి వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here