నితిన్, నిత్యామీన‌న్ ల ‘ఇష్క్‌’కి 8 ఏళ్ళు

Nithiin,Nithya Menon,Ishq Comedy Entertainer, Ishq Completes 8 Years,Latest Telugu Movies News,Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,Ishq Movie Completes 8 Years,Nithiin Ishq Completes 8 Years,Nithiin Ishq Movie,Ishq Telugu Movie

యువ క‌థానాయ‌కుడు నితిన్… ప‌లు రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్స్ లో సంద‌డి చేశాడు. వాటిలో ‘ఇష్క్’ ఒక‌టి. నితిన్ క‌మ్ బ్యాక్ ఫిల్మ్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో నిత్యా మీన‌న్ హీరోయిన్‌గా న‌టించింది. అజ‌య్‌, నాగినీడు, అలీ, శ్రీ‌నివాస్ రెడ్డి, సుప్రీత్, ర‌విప్ర‌కాష్‌, మ‌ధునంద‌న్, సింధు తులాని, రోహిణి, సుధ తదిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌లు పోషించారు. నితిన్ హోమ్ బ్యాన‌ర్ శ్రేష్ఠ్ మూవీస్ నిర్మించిన ‘ఇష్క్‌’కి టాలెంటెడ్ డైరెక్ట‌ర్ విక్ర‌మ్ కె కుమ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

అనంత శ్రీ‌రామ్, కృష్ణ చైత‌న్య, నితిన్‌ గీత ర‌చన చేయ‌గా… అనూప్ రూబెన్స్‌, అర‌వింద్ శంక‌ర్ స్వ‌రాలు స‌మ‌కూర్చారు. “సూటిగా చూడ‌కు”, “ఏదో ఏదో”(అర‌వింద్‌), “ల‌చ్చ‌మ్మ‌”, “ఓ ప్రియ ప్రియా”, “చిన్న‌దాన నీకోసం”(అనూప్‌) గీతాలు శ్రోత‌ల‌ను విశేషంగా అల‌రించాయి. ఉత్త‌మ కుటుంబ క‌థా చిత్రం, ఉత్త‌మ స‌హాయ‌న‌టుడు (అజ‌య్) విభాగాల్లో రెండు `నంది` అవార్డుల‌ను అందుకున్న ఈ చిత్రాన్ని బెంగాలీలో ‘ఆషికీ’ పేరుతోనూ, ఒడియాలో ‘అఖిరే అఖిరే’గానూ, త‌మిళంలో ‘ఉయిరే ఉయిరే’ టైటిల్‌తోనూ రీమేక్ చేశారు. 2012 ఫిబ్ర‌వరి 24న విడుద‌లై మంచి విజ‌యం సాధించిన ‘ఇష్క్‌’… నేటితో 8 వ‌సంతాల‌ను పూర్తి చేసుకుంటోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × one =