
ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 17

ఆనందం లో రాశీఖన్నా
బిచ్చగాడు స్పూఫ్ లో అదరగొట్టిన బ్రహ్మీ
ఎన్టీఆర్ తో నటించడం అద్భుతం - పూజాహెగ్డే
అల్లు అర్హకు బన్నీ సర్ప్రైజ్ గిఫ్ట్
బాలీవుడ్ లో హైదరాబాద్ అమ్మాయి

"నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా" రష్మిక
నాని 28 టైటిల్ రిలీజ్
రీక్యాప్ - ఈవారం టాలీవుడ్ అప్ డేట్స్
అన్నయ్యతో మల్టీ స్టారర్ అప్పుడు చూద్దాం
'బాబా' గా షకలక శంకర్ కామెడీ
సమంత వెయిట్ లిఫ్టింగ్
‘ఢీ’ సీక్వెల్ ఎగ్జైటింగ్ అప్ డేట్
శ్రీదేవి లా తనయ జాన్వీ కపూర్
అఖిల్ అక్కినేని కి జోడీగా రష్మిక ?
'ఇదే మా కథ' ఫస్ట్ లుక్స్ రిలీజ్

కియారా అద్వానీ "ఇందూ కి జవానీ " థియేటర్స్ లో రిలీజ్
బ్లాక్ బస్టర్ "భరత్ అనే నేను "మూవీ తో బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ తెలుగు ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. సెన్సేషనల్ హిట్ "అర్జున్ రెడ్డి "హిందీ రీమేక్ "కబీర్ సింగ్ "మూవీ లో అద్భుతం గా పెర్ఫార్మ్ చేసి కియారా ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. "కబీర్ సింగ్ "మూవీ ఘనవిజయం సాధించడంతో బాలీవుడ్ లో కియారా పలు మూవీ ఆఫర్స్ అందుకుంటూ బిజీగా మారారు. కియారా ప్రస్తుతం "షేర్ షా", "భూల్ బులయ్యా 2 ", "జగ్ జగ్ జియో" మూవీస్ లో నటిస్తున్నారు.
ఆనందం లో రాశీఖన్నా
తెలుగు , తమిళ భాషల సూపర్ హిట్ మూవీస్ లో రాశీఖన్నా తన అందం , అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.సోషల్ మీడియా లో మోడరన్ , ట్రెడిషినల్ డ్రెస్ లలో ఫోటో షూట్స్ లో పాల్గొన్న తన ఫొటో లను షేర్ చేస్తూ రాశీఖన్నా అభిమానులను అలరిస్తున్నారు. రాశీఖన్నా ప్రస్తుతం "తుగ్లక్ దర్బార్ ", "అరణ్మనై 3" తమిళ మూవీస్ లో నటిస్తున్నారు. చెన్నై లో జరుగుతున్న ఈ రెండు మూవీస్ షూటింగ్స్ లో గ్యాప్ లేకుండా పాల్గొంటున్నారు. ఒక వెబ్ సిరీస్ కు రాశీఖన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
బిచ్చగాడు స్పూఫ్ లో అదరగొట్టిన బ్రహ్మీ
బిచ్చగాడు సినిమా విజయ్ ఆంటోనీ సినీ కెరీర్ లోనే టర్నింగ్ పాయింట్ సినిమా అని చెప్పొచ్చు. ‘బిచ్చగాడు సినిమాతో ఈయన మరింత క్రేజ్ తెచ్చుకున్నాడు. తమిళంలో పిచ్చైకరన్ సినిమాను తెలుగులో బిచ్చగాడు పేరుతో రిలీజ్ చేశారు. 2016లో ప్రేక్షకుల ముందుకొచ్చిన బిచ్చగాడు సినిమా మంచి వసూళ్లను సాధించింది. అమ్మ సెంటిమెంట్ ఈ సినిమాకు మంచి హైలైట్ గా నిలిచింది. తెలుగు రాష్ట్రాలలో రూ.10 కోట్ల వరకూ వసూలు సాధించిం నిర్మాతకు లాభాలు తెచ్చి పెట్టింది. ఒక డబ్బింగ్ సినిమాకు ఈ రేంజ్ లో కలెక్షన్స్ రావడం అంటే మాములు విషయం కాదు.
ఎన్టీఆర్ తో నటించడం అద్భుతం - పూజాహెగ్డే
టాలీవుడ్ లో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో పూజాహెగ్డే ప్రేక్షకులను అలరిస్తున్నారు. బ్లాక్ బస్టర్ "అల .. వైకుంఠపురములో .. మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న పూజాహెగ్డే ప్రస్తుతం "రాధేశ్యామ్", "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ " మూవీస్ లో నటిస్తున్నారు. రెండు బాలీవుడ్ మూవీస్ లో పూజాహెగ్డే కథానాయికగా ఎంపిక అయ్యారు. సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ పూజాహెగ్డే అభిమానులను అలరిస్తున్నారు.
'సర్కారు వారి పాట' గ్రాండ్ లాంచ్
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. తన తండ్రి సూపర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా.. మహేష్ పుట్టినరోజు సందర్భంగా మోషన్ పోస్టర్ రిలీజ్ చేయగా వాటికీ సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన ఎప్పుడో వచ్చినా… అధికారికంగా మాత్రం పట్టాలెక్కలేదు. ఇక దానికితోడు తెలిసిందే కదా కరోనా వల్ల అన్ని సినిమాల షూటింగ్ లు ఆగిపోయాయని. అలాగే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలుపెట్టలేకపోయారు.
అల్లు అర్హకు బన్నీ సర్ప్రైజ్ గిఫ్ట్
అల్లు అర్జున్ తనయ అల్లు అర్హ క్యూట్ క్యూట్ మాటలు ఎలా వుంటాయో.. ఎంత యాక్టీవ్ గా ఉంటుందో..బన్నీ కూడా తన కూతురితో ముద్దు ముద్దు గా ఎలా మాట్లాడిస్తాడో సోషల్ మీడియాలో బన్నీ అప్ లోడ్ చేస్తున్న వీడియోలను బట్టి చెప్పొచ్చు. ఇప్పటికే అర్హకు సంబంధించి ఎన్నో వీడియోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఇప్పుడు అర్హ పుట్టిన రోజు పండుగ సందర్భంగా ఒక వీడియో తో పాటు స్పెషల్ సర్ ప్రయిజ్ ఇచ్చాడు. ఈ రోజు బన్నీ కూతురు అల్లు అర్హబర్త్డే. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ఆమెకు స్పెషల్ గిఫ్ట్‌ను అందించి సర్ప్రైజ్ ఇచ్చారు. చిన్న సర్ప్రైజ్ అంటూ అర్హకు ఓ గుర్రాన్ని బహుమతిగా ఇచ్చారు.
స్పెషల్ అట్రాక్షన్ గా జున్ను - ఆ విషయంలో లాస్య గ్రేటే
మొత్తానికి చూస్తుండగానే బిగ్ బాస్ రియాలిటీ షో 75 రోజులు పూర్తి చేసుకుంది. ప్రస్తుతానికైతే ఇంట్లో 8మంది కంటెస్టెంట్ లు ఉన్నారు. ఇక ఈ వారం మొత్తం ఎమోషన్స్ తో నిండిపోయింది బిగ్ బాస్ హౌస్. అందరు హౌస్ మేట్స్ పేరెంట్స్ రాగా అందరూ కొంచెం రిలీఫ్ ఫీల్ అయ్యారు. అయితే అందరి పరిస్థితి వేరు.. లాస్య పరిస్థితి వేరు. అందరి కోసం పేరెంట్స్ వస్తే.. లాస్య మాత్రం జున్ను కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి. ముఖ్యంగా ఈ వారం స్పెషల్ అట్రాక్షన్ మాత్రం లాస్య కొడుకు జున్నుదే అని చెప్పొచ్చు. జున్ను ఎంట్రీ కోసం ఒక్క లాస్య, హౌస్ మేట్స్ మాత్రమే కాదు బిగ్ బాస్ లవర్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూసారు. ఫైనల్లీ నిన్న జున్ను హౌస్ లోకి…
బాలీవుడ్ లో హైదరాబాద్ అమ్మాయి
రాయల్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ఎమ్ ఐ ఖురేషి మనవరాలు , నిర్మాత , దర్శకుడు సాజిద్ ఖురేషి తనయ అమ్రిన్ ఖురేషి రెండు బాలీవుడ్ మూవీస్ లో కథానాయికగా ఎంపిక అయ్యారు. శివ శివాని స్కూల్ లో చదువుకున్న హైదరాబాద్ అమ్మాయి అమ్రిన్ ఖురేషి బాలీవుడ్ లో కథానాయిక గా ఎంపిక కావడం హాట్ టాపిక్ గా మారింది. సూపర్ హిట్ "సినిమా చూపిస్త మావ ", "జులాయి "మూవీస్ బాలీవుడ్ లో రీమేక్ కానున్నాయి. ఈ రెండు రీమేక్ మూవీస్ లో అమ్రిన్ ఖురేషి కథానాయికగా నటిస్తున్నారు.

"నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా" రష్మిక
తెలుగు , కన్నడ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని రష్మిక సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్నారు. సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ రష్మిక అభిమానులను అలరిస్తున్నారు. హీరోయిన్ రష్మిక ప్రస్తుతం "పుష్ప " మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. "సుల్తాన్ " మూవీ తో రష్మిక కోలీవుడ్ లో అడుగుపెడుతున్నారు. హీరోలు శర్వానంద్ , అఖిల్ అక్కినేని మూవీస్ లో రష్మిక కథానాయికగా ఎంపిక అయినట్టు సమాచారం.
నాని 28 టైటిల్ రిలీజ్
బ్రోచేవారెవరురా ఫేం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్. అంతేకాదు ఈ రోజు ఈ సినిమా నుండి సర్ ప్రయిజింగ్ అప్ డేట్ ఇస్తామని చెప్పిన సంగతి కూడా విదితమే. ఇక చెప్పినట్టే ఈ సినిమా నుండి అప్డేట్ ఇచ్చారు చిత్రయూనిట్. ఈ సినిమాను నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ తమ ట్విట్టర్ ద్వారా ఈ సినిమా టైటిల్ ను అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకు 'అంటే సుందరానికి' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. రొమాంటిక్ ప్రేమ కథగా ఈ మూవీ తెరకెక్కనుందని తెలుస్తోంది.
బిగ్ బాస్ 4 - ఫైనల్లీ కెప్టెన్ అయిన హారిక
బిగ్ బాస్ 4 - ఇక అందరి పేరెంట్స్ రాగ ఫైనల్లీ రెండు రోజుల నుండి ఎదురుచూస్తున్న లాస్య కొడుకు జున్ను కూడా వచ్చేసాడు. కుమారుడిని చూడగానే లాస్య భోరున ఏడ్చింది. ‘బుజ్జీ... అంటూ గార్డెన్ ఏరియా నుంచి పరుగెత్తుకొచ్చింది. ఏడ్చుకుంటూనే భర్తతో మాట్లాడింది. ‘నువ్వు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నావు. నువ్వెంత స్ట్రాంగ్‌గా ఉన్నావో నీ కన్నా ఎక్కువ స్ట్రాంగ్‌గా ఉన్నాడు జున్ను. అస్సలు ఏడ్వడం లేదు. నువ్వు బాగా ఆడు. చాలా బాగా ఆడుతున్నావు. ఇంకా బాగా స్ట్రాంగ్‌గా ఆడాలి. 10 వారాల పాటు ఉన్నావంటే నువ్వు ఎంత స్ట్రాంగో అర్థం చేసుకో’ అంటూ లాస్యకు మంజునాథ్ ధైర్యం చెప్పాడు.
రీక్యాప్ - ఈవారం టాలీవుడ్ అప్ డేట్స్
గత వారం రోజుల్లో ఎన్నో సినిమా వార్తలు 'దితెలుగుఫిలింనగర్ .కమ్' ద్వారా మీకు అందించాం. ఈ వారంలో ఎన్నో విశేషాలు చోటు చేసుకున్నాయి. మరి ఆ అప్ డేట్స్ లో మీరేమైనా ముఖ్యమైన అప్ డేట్స్ మరిచిపోయారా? అయితే ఈ వీక్లీ రౌండప్ మీకోసం. ఈవారం వార్తలపై మీరొక లుక్కేయండి.
అన్నయ్యతో మల్టీ స్టారర్ అప్పుడు చూద్దాం
దొరసాని సినిమా తర్వాత ఆనంద్ దేవరకొండ చేస్తున్న రెండో సినిమా మిడిల్ క్లాస్ మెలోడీస్. వినోద్ అనంతోజు దర్శకత్వంలో వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈరోజు అమెజాన్ లో రిలీజ్ అయింది. ప్రముఖ నిర్మాణ సంస్థ భవ్య క్రియేషన్స్ ప్రొడక్షన్ లో వెనిగళ్ళ ఆనందప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. మంచి కామెడీ ఎంటర్ టైనర్ అని.. చాలా నేచురల్ గా తెరకెక్కించారన్న ప్రశంసలు అందుకుంటున్నారు చిత్రయూనిట్.
'థ్యాంక్ యు బ్రదర్' టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసిన రానా
కరోనా పై ఇప్పటికే రెండు మూడు సినిమాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే బ్యాక్ డ్రాప్ తో మరో సినిమా వస్తుంది. రమేష్ రాపర్తి దర్శకత్వంలో అనసూయ భరద్వాజ, అశ్విన్ విరాజ్ ప్రధాన పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాకు 'థ్యాంక్ యు బ్రదర్' అనే టైటిల్ ను పెట్టారు.
'బాబా' గా షకలక శంకర్ కామెడీ
బుల్లితెరపై జబర్దస్త్ అనే కామెడీ ప్రోగ్రాంతో కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు షకలక శంకర్. ఇక ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చిన శంకర్ కమెడియన్ గా కొన్ని సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకోవడమే కాకుండా ప్రేక్షాదరణను పొందాడు. హాస్య నటుడిగా పలు సినిమాల్లో మరిచిపోలేని పాత్రలు చేసాడు. అవంతి సినిమాలో బాబా గెటప్ లో షకలక శంకర్ చేసిన కామెడీ నవ్వులు తెప్పిస్తుంది. ఆ కామెడీ సీన్ మీకోసం ఈ కింద లింక్ క్లిక్ చేసి మీరు కూడా నవ్వుకోండి.
సమంత వెయిట్ లిఫ్టింగ్
తెలుగు , తమిళ బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ సమంత స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. సోషల్ మీడియాలో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ సమంత తన జీవిత విశేషాలను అభిమానులతో పంచుకుంటున్నారు. గార్డెనింగ్ , హెల్త్ ల గురించి టిప్స్ ఇస్తూ సమంత అభిమానులను ఆకట్టుకుంటున్నారు. సమంత ప్రస్తుతం నందిని రెడ్డి దర్శకత్వంలో తెలుగు , తమిళ భాషలలో రూపొందనున్న మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
‘ఢీ’ సీక్వెల్ ఎగ్జైటింగ్ అప్ డేట్
శ్రీను వైట్ల, మంచు విష్ణు కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా 'ఢీ' కు సీక్వెల్ రాబోతున్నట్టు గత రెండు రోజుల నుండి వార్తలు తెగ చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. ఢీ2 కి సంబంధించి ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయని, దీనికి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ కూడా జరుగుతుందని ఎప్పటినుండో వార్తలు వస్తున్నా దీనిపై మాత్రం క్లారిటీ లేదు. అయితే ఇప్పుడు ఈ కన్ఫ్యూజన్ కు బ్రేక్ పడినట్లయింది తాజాగా మంచు విష్ణు చేసిన ట్వీట్ తో. ఈ సినిమాకు సంబంధించి ఇక అప్ డేట్ ఇచ్చాడు తన ట్విట్టర్ లో.
శ్రీదేవి లా తనయ జాన్వీ కపూర్
లెజెండరీ యాక్ట్రెస్ , అతిలోక సుందరి తనయ జాన్వీ కపూర్ బ్లాక్ బస్టర్ "ధడక్" మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. జాన్వీ కపూర్ ప్రధాన పాత్ర లో నటించిన "గుంజన్ సక్సేనా :ది కార్గిల్ గర్ల్ " మూవీ విజయం సాధించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. "రూహి అఫ్జనా ", "దోస్తానా 2 " మూవీస్ లో జాన్వీ నటిస్తున్నారు. మలయాళ సూపర్ హిట్ "హెలెన్ " హిందీ రీమేక్ మూవీ లో జాన్వీ కథానాయికగా ఎంపిక అయ్యారు.
అఖిల్ అక్కినేని కి జోడీగా రష్మిక ?
యంగ్ హీరో అఖిల్ అక్కినేని ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్" మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మూవీ ని సంక్రాంతి పండగకు రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. ఈ మూవీ తరువాత హీరో అఖిల్ మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
'ఇదే మా కథ' ఫస్ట్ లుక్స్ రిలీజ్
గురుపవన్ దర్శకత్వంలో సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, భూమికా చావ్లా, తాన్యా హోప్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా ఇదే మా కథ. రోడ్ ట్రిప్ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. నలుగురు వ్యక్తులు కలిసి రోడ్ ట్రిప్ ను ఎలా కొనసాగించారన్నదే ఈ సినిమా కథ. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. లాక్ డౌన్ కి ముందే షూటింగ్ స్టార్ట్ చేసి లడఖ్ తదితర ప్రాంతాల్లో షూటింగ్ చేశారు చిత్ర యూనిట్. కరోనా వల్ల బ్రేక్ రాగ ఇటీవలే షూట్ స్టార్ట్ చేసి హైదరాబాద్ షెడ్యూల్ పూర్తిచేసినట్టు తెలుస్తుంది. ఇంకా మనాలి షెడ్యూల్ బ్యాలెన్స్ ఉండగా... డిసెంబర్ కల్లా ఆ షెడ్యూల్ ను కూడా షూటింగ్ పూర్తిచేయడానికి…