బిగ్ బాస్ 4 – ఫైనల్లీ కెప్టెన్ అయిన హారిక

Bigg Boss Telugu 4 Day

బిగ్ బాస్ 4 – ఇక అందరి పేరెంట్స్ రాగ ఫైనల్లీ రెండు రోజుల నుండి ఎదురుచూస్తున్న లాస్య కొడుకు జున్ను కూడా వచ్చేసాడు. కుమారుడిని చూడగానే లాస్య భోరున ఏడ్చింది. ‘బుజ్జీ… అంటూ గార్డెన్‌ ఏరియా నుంచి పరుగెత్తుకొచ్చింది. ఏడ్చుకుంటూనే భర్తతో మాట్లాడింది. ‘నువ్వు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నావు. నువ్వెంత స్ట్రాంగ్‌గా ఉన్నావో నీ కన్నా ఎక్కువ స్ట్రాంగ్‌గా ఉన్నాడు జున్ను. అస్సలు ఏడ్వడం లేదు. నువ్వు బాగా ఆడు. చాలా బాగా ఆడుతున్నావు. ఇంకా బాగా స్ట్రాంగ్‌గా ఆడాలి. 10 వారాల పాటు ఉన్నావంటే నువ్వు ఎంత స్ట్రాంగో అర్థం చేసుకో’ అంటూ లాస్యకు మంజునాథ్‌ ధైర్యం చెప్పాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మరోవైపు రెండు రోజులుగా సాగుతున్న కమాండోల టాస్క్ కూడా ఫైనల్లీ అయిపోయింది. దీనితో హౌస్ మేట్స్ కాస్త రిలాక్స్ అయ్యారు. నెక్స్ట్ డే అరియానా, హారిక మంచిగా రెడీ అయి కూర్చొని కాఫీ తాగుతుండగా… అవినాష్‌ వారితో కామెడీ చేసాడు. చిన్న పిల్లలు స్కూల్‌కి వెళ్లకుండా ఇక్కడేం చేస్తున్నారని ఆటపట్టించాడు. తమ అందాన్ని చూసి అవినాష్‌ కల్లు తిప్పుకోలేకపోతున్నాడని అరియానా అనగా.. అందం గురించి మనం మాట్లాడుకోవద్దని అవినాష్‌ పంచ్‌ వేశాడు.

ఇక అనంతరం ఈ వారం లగ్జరీ బడ్జెట్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ టాస్క్‌లో భాగంగా రిఫ్రిజిరేటర్‌ లో వారికి కావాల్సిన లగ్జరీ బడ్జెట్ ఐటమ్స్‌ను పెట్టి ఇంటి సభ్యులకు క్విజ్‌ పోటీ పెట్టాడు బిగ్‌బాస్‌. క్విజ్‌ మాస్టర్‌గా అవినాష్‌ను ఎంపిక చేసిన బిగ్‌బాస్‌.. పోటీ దారులుగా సోహైల్‌, లాస్య, మోనాల్‌, అభిజిత్‌ను పెట్టాడు. సరైన సమాధానం చెప్పిన ఇంటి సభ్యుడు ఫ్రిజ్ డోర్ ఓపెన్ చేసి ఒక లగ్జరీ బడ్జెట్ ఐటమ్ తీసుకోవచ్చు. ప్రశ్నలు కూడా సింపుల్‌గా, నవ్వులు తెప్పించేలా ఉన్నాయి. ఇకఏదోలాగా కష్టపడి హౌస్ మేట్స్ దాదాపు అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పి వారికి కావాల్సిన ఐటమ్స్ ను తీసుకున్నారు.

ఇక మెయిన్ కెప్టెన్సీ టాస్క్. ఈ టాస్క్ లో మూడు స్టార్ లు వచ్చిన అఖిల్, అభిజిత్, హరికలకు కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ ముగ్గురు మిగతా ఇంటి సభ్యులను ఒప్పించి వారి భుజాల మీద కూర్చోవాల్సి ఉంటుంది. ఎవరైతే ఎక్కువ సేపు కిందికి దిగకుండా భుజాల మీద ఉంటారో వాళ్లు ఇంటి కెప్టెన్‌ అవుతారు. అఖిల్‌ సోహైల్‌ని ఎంచుకున్నాడు. అభిజిత్‌ అవినాష్‌ను, మారిక మోనాల్‌ని ఎంచుకుంది. మొదటగా అభిజిత్‌ బరువును మోయలేక అవినాష్‌ . ఆ తర్వాత సోహైల్‌ కిందపడిపోయాడు. దీంతో మోనాల్‌ భుజాలపై ఉన్న హారిక కెప్టెన్‌గా ఎన్నికైంది. చాలా వారాలనుండి వెయిట్ చేస్తున్న హారిక ఫైనల్ గా కెప్టెన్ అయింది.

ఆ తర్వాత బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వచ్చిన తర్వాత కొత్తగా నేర్చుకున్న విషయాలు ఏంటి? మీలో వచ్చిన మార్పులు ఏంటో హౌస్‌మేట్స్‌తో పంచుకోండని బిగ్‌బాస్‌ ఆదేశించాడు. దీంతో సోహైల్‌ ‘ బిగ్‌బాస్‌లోకి రాక ముందు పుడ్‌ విలువ తెలిసేది కాదు. ఇక్కడి వచ్చాకే ఫుడ్‌ వాల్యూ తెలిసింది. ఇక్కడికి రాకముందు ఇంకా చాలా కోపం ఉండేది ఇప్పుడు ఆ కోపం కూడా తగ్గింది. గతంలో ఎక్కుమ సమయం ఫోన్‌తోనే గడిపేవాడిని. గడుపుతున్నా. ఫోన్‌ లేకపోతే మనిషి విలువ తెలుస్తోంది’ అని సోహైల్‌ చెప్పాడు. ఇక అరియానా మాట్లాడుతూ.. బిగ్‌బాస్‌లోకి వచ్చాక తనకు సమయం విలువ బాగా తెలిసిందని, చిన్న చిన్న విషయాలకు కృతష్నులై ఉంటున్నానని చెప్పుకొచ్చాడు. నా ఆటిట్యూడ్ కూడా చాలా వరకూ మార్చుకున్నా. ఇక్కడినుండి ఈ క్షణం బయటకి వెళ్లినా కూడా నేను చాలా పరిపూర్ణంగా వెళ్తున్నట్టే అని చెప్పింది. మరోవైపు లాస్య, అభిజిత్, హారిక, మోనాల్ మాట్లాడుకుంటూ ఉంటారు. హారిక కెప్టెన్ అవ్వడంపై అభి జోక్స్ వేస్తుంటాడు. దీనితో హారిక ‘ నా మీద జోకులు వేస్తే నేను ఊరుకోవాలి. నీ మీద వేస్తనేమో సీరియస్‌ అవుతావు.. ఇంకోసారి సీరియస్ అవ్వు నీ పని చెప్తా అంటూ పంచ్ ఇచ్చింది.

ఇక ఈ రోజు వీకెండ్. ఈవారం హౌస్ నుండి ఏ కంటెస్టెంట్ ఇంటి నుండి వెళతారో.. ఎవరు సేఫ్ లో వుంటారో తెలియాలంటే అప్పటివరకు వెయిట్ చేయాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + fourteen =