టాలీవుడ్ లో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో పూజాహెగ్డే ప్రేక్షకులను అలరిస్తున్నారు. బ్లాక్ బస్టర్ “అల .. వైకుంఠపురములో .. మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న పూజాహెగ్డే ప్రస్తుతం “రాధేశ్యామ్”, “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ” మూవీస్ లో నటిస్తున్నారు. రెండు బాలీవుడ్ మూవీస్ లో పూజాహెగ్డే కథానాయికగా ఎంపిక అయ్యారు. సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ పూజాహెగ్డే అభిమానులను అలరిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ , పూజాహెగ్డే జంటగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “అరవింద సమేత వీర రాఘవ “మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ మూవీ ఎక్స్ పీరియన్స్ గురించి పూజాహెగ్డే మాట్లాడుతూ .. ఈ మూవీ లో ఎన్టీఆర్ తో ఫస్ట్ టైమ్ స్క్రీన్ షేర్ చేసుకున్నాననీ, “అరవింద సమేత వీర రాఘవ “మూవీ తనకు ఎప్పటికీ ఒక ప్రత్యేకమైన చిత్రం అనీ , హీరో ఎన్టీఆర్ తో కలసి పనిచేయడం అద్భుతంగా అనిపించిందనీ, తమ ఇద్దరికీ ఎనర్జీ లెవెల్స్ ఎక్కువనీ , ఆన్ స్క్రీన్ లో తమ జోడీ ప్రేక్షకులను అలరించిందనీ , ఆన్ స్క్రీన్ లోనే కాకుండా ఆఫ్ స్క్రీన్ లోనూ ఈ మూవీ తనకు పలు అనుభవాలు అందించిందనీ , అరవింద పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకొనడం సంతోషంగా అనిపించిందనీ చెప్పారు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: