నాని 28 టైటిల్ రిలీజ్

Nani 28 Title Is Out

బ్రోచేవారెవరురా ఫేం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్. అంతేకాదు ఈ రోజు ఈ సినిమా నుండి సర్ ప్రయిజింగ్ అప్ డేట్ ఇస్తామని చెప్పిన సంగతి కూడా విదితమే. ఇక చెప్పినట్టే ఈ సినిమా నుండి అప్డేట్ ఇచ్చారు చిత్రయూనిట్. ఈ సినిమాను నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ తమ ట్విట్టర్ ద్వారా ఈ సినిమా టైటిల్ ను అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకు ‘అంటే సుందరానికి’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. రొమాంటిక్ ప్రేమ కథగా ఈ మూవీ తెరకెక్కనుందని తెలుస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమాలో మ‌ల‌యాళ బ్యూటీ న‌ర్జియా ఫ‌హ‌ద్ నానితో జతకట్టనుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఇక మిగిలిన నటీనటులు సాంకేతిక నిపుణుల వివ‌రాలు అతి త్వ‌ర‌లో ప్ర‌క‌టించ‌నున్నారు.

ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో నాని హీరోగా ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా “టక్ జగదీష్” సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రీతువర్మ, ఐశ్వర్యా రాజేష్ కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాను… సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. ఈ మూవీ తరువాత రాహుల్‌ సంక్రీత్యన్‌ దర్శకత్వంలో శ్యామ్ సింగరాయ్‌లో నటించనున్నారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మిస్తోన్న ఈ మూవీలో సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్లుగా నటించనున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించనున్న ఈ మూవీ డిసెంబర్‌ నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − 11 =