అల్లు అర్హకు బన్నీ సర్‌ప్రైజ్ గిఫ్ట్

Stylish Star Allu Arjun Gives A Surprise Gift To His Daughter Allu Arha On Her Birthday

అల్లు అర్జున్ తనయ అల్లు అర్హ క్యూట్ క్యూట్ మాటలు ఎలా వుంటాయో.. ఎంత యాక్టీవ్ గా ఉంటుందో..బన్నీ కూడా తన కూతురితో ముద్దు ముద్దు గా ఎలా మాట్లాడిస్తాడో సోషల్ మీడియాలో బన్నీ అప్ లోడ్ చేస్తున్న వీడియోలను బట్టి చెప్పొచ్చు. ఇప్పటికే అర్హకు సంబంధించి ఎన్నో వీడియోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఇప్పుడు అర్హ పుట్టిన రోజు పండుగ సందర్భంగా ఒక వీడియో తో పాటు స్పెషల్ సర్ ప్రయిజ్ ఇచ్చాడు. ఈ రోజు బన్నీ కూతురు అల్లు అర్హబర్త్‌డే. ఈ సందర్భంగా అల్లు అర్జున్‌ ఆమెకు స్పెషల్‌ గిఫ్ట్‌ను అందించి సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. చిన్న సర్‌ప్రైజ్ అంటూ అర్హకు ఓ గుర్రాన్ని బహుమతిగా ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

View this post on Instagram

 

A post shared by Allu Arjun (@alluarjunonline)

అంతేకాదు దీంతో పాటు అల్లు అర్హ యాక్ట్‌ చేసిన అంజలి సినిమాలో టైటిల్‌ సాంగ్‌ను కూడా విడుదల చేశారు. మణిరత్నం 1990 క్లాసిక్ `అంజలి`లోని క్లాసిక్ సాంగ్ ‘అంజలి అంజలి’ సాంగ్ మ‌నందరికి గుర్తుండే ఉంటుంది. ఇళ‌య‌రాజా సంగీత సార‌ధ్యంలో రూపొందిన ఈ సాంగ్‌లో బేబి ష్యామిలీ క‌నిపించి అల‌రించింది. ఇప్పుడు అర్హ కూడా ఆ పాటలో ఎంతో తేలిగ్గా ఎమోషన్స్ ని పలికించింది.

ఇక బన్నీ ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మేడ్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కించనున్న ఈ సినిమా షూటింగ్ ఫైనల్లీ మొదలైంది. రష్మిక మందన్ననటిస్తుండగా మరో హీరోయిన్‌ గా నివేత పేతురాజ్ కనిపించనున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో విలన్‌ పాత్రలో బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈసినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. పుష్ప బన్నీ మెదటి పాన్ ఇండియా చిత్రంగా ఐదు భాషలలో విడుదల కానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 4 =