‘ఢీ’ సీక్వెల్‌ ఎగ్జైటింగ్ అప్ డేట్

Actor Manchu Vishnu To Announce An Interesting Update About Dhee Movie Sequel Soon

శ్రీను వైట్ల, మంచు విష్ణు కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా ‘ఢీ’ కు సీక్వెల్ రాబోతున్నట్టు గత రెండు రోజుల నుండి వార్తలు తెగ చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. ఢీ2 కి సంబంధించి ఇప్పటికే చ‌ర్చ‌లు పూర్త‌య్యాయ‌ని, దీనికి సంబంధించి స్క్రిప్ట్ వ‌ర్క్ కూడా జ‌రుగుతుంద‌ని ఎప్పటినుండో వార్తలు వస్తున్నా దీనిపై మాత్రం క్లారిటీ లేదు. అయితే ఇప్పుడు ఈ కన్ఫ్యూజన్ కు బ్రేక్ పడినట్లయింది తాజాగా మంచు విష్ణు చేసిన ట్వీట్ తో. ఈ సినిమాకు సంబంధించి ఇక అప్ డేట్ ఇచ్చాడు తన ట్విట్టర్ లో.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సినిమా ప్రియులు మెచ్చిన చిత్రాల‌లో ఢీ మూవీ ఒక‌టి. ఈసినిమాకు పని చేసిన ప్రతి కాస్ట్ అండ్ క్రూ కి ఈ సినిమా గేమ్ చేంజ‌ర్‌గా మారింది. అంతేకాదు ఆ స‌మ‌యంలో ఎన్నో చిత్రాల‌కు మార్గదర్శకంగా కూడా నిలిచింది అని చెప్పిన విష్ణు ఓ పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. ఆ పోస్ట‌ర్‌లో న‌వంబ‌ర్ 23న చిత్రానికి సంబంధించి క్రేజీ అప్‌డేట్ రానుంద‌ని ఉంది. ఇక ఈ నెల 23న మంచు విష్ణు బర్త్ డే అన్న సంగతి తెలిసిందే.

ఇక శ్రీను వైట్ల, మంచు విష్ణు కాంబినేషన్ లో వచ్చిన ‘ఢీ’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలుసు. ఈ మూవీ హీరోగా మంచు విష్ణుకే కాదు.. దర్శకుడు శ్రీను వైట్ల, హీరోయిన్ జెనీలియాకు మంచి బ్రేక్ ఇచ్చింది. అంతేకాదు శంకర్ గౌడ్‌గా శ్రీహరి, అతని పెదనాన్న పాత్రలో జయప్రకాష్ రెడ్డి, సునీల్.. ఇక చారి గారు నన్ను ఇన్వాల్వ్ చేయకండీ అంటూ బ్రహ్మానందం చేసిన కామెడీ ఎప్పటికీ గుర్తుండే ఉంటుంది. మరి ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ వస్తే ఆ రేంజ్ లోనే ఉంటుందో లేదో చూద్దాం.

మరోవైపు మంచు విష్ణు మోస‌గాళ్ళు అనే పాన్ ఇండియా సినిమాతో బిజీగా ఉన్నాడు. వారి సినిమాలు అయిపోయే లోపు స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి.. ఈ సినిమాను పట్టాలెక్కిస్తారేమో చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 3 =