కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film News 2020

ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 18

షూటింగ్ అప్‌డేట్

షూట్ కు రెడీ అయిన బాలయ్య

ఇప్పటికే టాలీవుడ్ మొత్తం షూటింగ్ లతో బిజీ అయిపోయింది. ఇక ఇన్ని రోజులు రెస్టింగ్ మోడ్ లో ఉన్న హీరోలందరూ షూటింగ్ లతో బిజీ అయిపోతుంది. ఇప్పుడు బాలయ్య కూడా షూట్ కు రెడీ అయిపోయినట్టు తెలుస్తుంది. రీసెంట్ గానే బోయపాటి షూట్ ను స్టార్ట్ చేసాడు. కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించాడు. అయితే ఈ షూటింగ్ లో బాలయ్య పాల్గొనలేదు. ఈ రోజునుండి మరో షెడ్యూల్ ప్రారంభం కానుండగా.. ఈ షెడ్యూల్ లో బాలకృష్ణ కూడా పాల్గొననున్నాడట. అంతేకాదు హీరోయిన్ సయేషా, పూర్ణ కూడా ఈషెడ్యూల్ లో పాల్గొననున్నట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

షూటింగ్ లో హీరో అజిత్ కు ప్రమాదం

బోనీ కపూర్ ఫిల్మ్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు హెచ్ వినోత్ దర్శకత్వంలో సూపర్ స్టార్ అజిత్ , హుమా ఖురేషి జంటగా యాక్షన్ ఎంటర్ టైనర్ "వాలిమై "తమిళ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో హీరో కార్తికేయ ప్రతినాయకుడిగా కోలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మాల్దీవులలో రకుల్ ప్రీత్ సింగ్

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ తెలుగు , తమిళ , హిందీ భాషల సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ రకుల్ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ షూటింగ్ ను రకుల్ రీసెంట్ గా కంప్లీట్ చేశారు. రకుల్ ప్రస్తుతం నితిన్ "చెక్ ", "అయిలాన్ ", "ఇండియన్ 2 "(తమిళ ), "ఎటాక్ ", "సర్దార్ &గ్రాండ్ సన్" (హిందీ ) మూవీస్ లో నటిస్తున్నారు. అజయ్ దేవగన్ హిందీ మూవీ "మేడే "లో రకుల్ కథానాయికగా ఎంపిక అయ్యారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

నా సేఫ్టీ నాకు ముఖ్యం అంటున్న శృతి

కరోనా ప్రభావం కాస్త తగ్గినట్టు అనిపిస్తున్నాఇప్పుడప్పుడే రిలాక్స్ అయ్యే పరిస్థితి లేదు. అందుకే కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తూ షూటింగ్ లు మొదలుపెడుతున్నారు. ఇక సెలెబ్రిటీస్ కూడా నిర్లక్ష్యం వద్దని జాగ్రత్తగా ఉండమని తమ సోషల్ మీడియా ద్వారా చెపుతూనే ఉన్నారు. ఇప్పుడు శృతి హాసన్ కూడా మరొకసారి తన సోషల్ మీడియా వేదికగా జాగ్రత్తలు తీసుకోమని చెపుతుంది. కోవిడ్ అనేది సీరియస్ హెల్త్ రిస్క్.. కరోనా ప్రభావం ఇంకా తగ్గలేదు.. సెట్స్ లో నిబంధనలు పాటించనప్పుడు ఒక వ్యక్తిగా ఒక నటిగా నా హెల్త్ గురించి జాగ్రత్తలు తీసుకునే రైట్ నాకుంది అంటూ చెప్పుకొచ్చింది ఈ భామ.

TFN Adminవాట్సాప్
బిగ్ బాస్

బిగ్ బాస్ 4 - అభిజిత్ కు మోనాల్ సోదరి కౌంటర్

ఇక మొన్నటి ఎపిసోడ్ లో నలుగురు కంటెస్టెంట్ ల పేరెంట్స్ రాగా నిన్నటి ఎపిసోడ్ లో మిగిలిన కంటెస్టెంట్ల పేరెంట్స్ వచ్చారు. ఇక ఎపిసోడ్ స్టార్టింలోనే అఖిల్ తన మదర్ గురించి మోనాల్ తో డిస్కషన్ చేస్తుంటాడు. అమ్మ మొద‌టిసారి నాకు ఐ ల‌వ్ యూ చెప్పింద‌ని అఖిల్ హ్యాపీగా ఫీల‌య్యాడు. అమ్మ త‌న పేరును ప‌చ్చ‌బొట్టు పొడిపించుకుంద‌ని త‌ను చాలా పొసెసివ్ అని మోనాల్‌తో చెప్పుకొచ్చాడు. అందుకే నీతో ఎక్కువ‌గా మాట్లాడ‌లేదని తెలిపాడు. ఇక మరోవైపు బిగ్ బాస్ కంటెస్టెంట్ లతో కొంచం సేపు ఆడుకున్నాడు.

TFN Adminవాట్సాప్
Gaali Sampath Movie Team Kickstarts Shooting Work From Today
షూటింగ్ అప్‌డేట్

పట్టాలెక్కిన 'గాలి సంపంత్'

శ్రీ విష్ణు, ల‌వ్‌లీ సింగ్ హీరోహీరోయిన్లుగా అనీష్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న సినిమా గాలి సంపత్. ఈ సినిమాలో రాజేంద్ర ‌ప్ర‌సాద్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్ ను ఈ రోజు రిలీజ్ చేశారు.ఇటీవలే అధికారికంగా లాంఛ్ అయిన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈరోజు నుండి మొదలైంది. వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయాలన్న ప్లాన్ లో ఉన్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

రాధే శ్యామ్ సెట్స్ నుండి స్నీక్ పీక్ వీడియో

జిల్ ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా 'రాధే శ్యామ్' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా ఇటలీలో షూటింగ్ ను పూర్తి చేసుకొని వచ్చారు. ఇక ఇక్కడికి వచ్చి ఒక వారం గ్యాప్ తీసుకొని అప్పుడే మళ్లీ షూటింగ్ ను మొదలు పెట్టేసారు చిత్రయూనిట్. హైద్రాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. మేజర్ పోర్షన్స్ పూర్తి చేసుకోగా మొత్తం షూటింగ్ ను ఈ ఏడాది చివరి లోపు పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Raja The Great Movie Back To Back Comedy Scenes
సినిమా వార్తలు

'రాజా ది గ్రేట్' - బ్యాక్ టు బ్యాక్ కామెడీ సీన్స్

మాస్ మహారాజ్ రవి తేజ అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేసిన సినిమా రాజా ది గ్రేట్. బెంగాల్ టైగర్ సినిమా తర్వాత అప్పటివరకూ హిట్ లేక ప్లాప్స్ తో బాధపడుతున్న రవితేజ చాలా గ్యాప్ తీసుకొని ఈ సినిమా తీయగా ఈసినిమా కాస్త ఊరటనిచ్చింది. మంచి హిట్ తెచ్చిపెట్టింది. 2017 లో రిలీజ్ అయిన ఈ సినిమాలో రవితేజ అంధుడిగా కనిపించగా... రవితేజకు జోడీగా మెహ్రీన్ కౌర్ పిర్జాదా నటించింది. రాధిక, రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్, సంపత్ వంటి నటీనటులు ఇతర కీలక పాత్రలు పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకు సాయి కార్తీక్ సంగీతం అందించాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

వర్కౌట్స్ తో తాప్సీ బిజీ

తెలుగు , తమిళ భాషల సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ తాప్సీ బ్లాక్ బస్టర్ "ఛష్మే బద్దూర్ "మూవీ తో బాలీవుడ్ లో అడుగు పెట్టారు. బాలీవుడ్ మూవీస్ తో పాటు తాప్సీ తెలుగు , తమిళ చిత్రాలలో కూడా నటిస్తున్నారు. కమర్షియల్ మూవీస్ తో పాటు ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ ఎంపిక చేసుకుంటున్నారు. "పింక్ ", నామ్ షబానా ", "బద్లా ", "శాండ్ కీ ఆంఖ్" , "తప్పడ్" వంటి సూపర్ హిట్ మూవీస్ లో తాప్సీ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మామతో అల్లుడు - ఫ్యాన్ బాయ్ మూమెంట్

ఎంత హీరోలు అయినా కూడా వాళ్లకి కూడా ఎవరో ఒకరు ఫెవరెట్ ఉంటారు. ఇప్పుడు అలాంటి ఫ్యాన్ బాయ్ మూమెంట్ ను ఎంజాయ్ చేస్తున్నాడు సుధీర్ బాబు. అసలు సంగతేంటంటే.. ఈరోజు తన ట్విట్టర్ లో ఒక ఫొటో పోస్ట్ చేశాడు. కృష్ణ అక్కడ కుర్చీపై కూర్చుంటే.. కింద సుధీర్ బాబు సిగ్గు పడుతూ కూర్చున్నాడు. దానికి సుధీర్ బాబు.. చాలా ఏళ్లుగా ఆయన్ని దగ్గరిగా చూస్తున్నా.. అయితే ఆయనతో ఉన్న ప్రతిక్షణం ఒక ఫ్యాన్ బాయ్ మూమెంట్ లా అనిపిస్తుంటుంది అని తన ట్వీట్ లో పేర్కొన్నాడు. ఇప్పుడు ఈఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మరో బాలీవుడ్ మూవీలో రకుల్ ప్రీత్

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు , తమిళ , హిందీ భాషల చిత్రాలతో బిజీగా ఉన్నారు. సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ రకుల్ , అభిమానులను అలరిస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ తేజ్ , రకుల్ జంటగా రూపొందుతున్న మూవీ షూటింగ్ ను రకుల్ కంప్లీట్ చేశారు. నితిన్ హీరోగా రూపొందుతున్న "చెక్ "మూవీ లో నటిస్తున్న రకుల్ "అయలాన్", "ఇండియన్ 2" తమిళ మూవీస్ తోపాటు బాలీవుడ్ మూవీస్ "ఎటాక్ ", "సర్దార్ &గ్రాండ్ సన్ " లలో నటిస్తున్నారు. ఇప్పుడు మరో బాలీవుడ్ మూవీ లో హీరోయిన్ గా ఎంపిక అయ్యారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

అడివి శేష్ లేటెస్ట్ వర్కౌట్

"గూఢచారి ", "ఎవరు " వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ అడివి శేష్ టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ రైటర్ , హీరోగా కొనసాగుతున్నారు. అడివి శేష్ ప్రస్తుతం "మేజర్ ", "గూఢచారి 2" మూవీస్ లో నటిస్తున్నారు. సోనీ పిక్చర్స్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్స్ , ఎ +ఎస్ బ్యానర్స్ పై శశి కిరణ్ దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా "మేజర్ " మూవీ తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'సూర్య' సినిమాపై 'మహేష్' ప్రశంసలు

సూర్య నటించిన 'ఆకాశం నీ హద్దురా' సినిమాకు ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు సెలబ్రిటీస్ అందరూ. ఇప్పటికే చాలా మంది ఈ సినిమాపై స్పందించి పొగడ్తలు కురిపించారు. నిన్నటికి నిన్న విజయదేవరకొండ ఈ సినిమా చూసి చాలా బావుందని చెప్పడంతో పాటు డైరెక్టర్ సుధా తో సినిమా చేయాలని వుందని కూడా తెలిపాడు. ఇక ఇప్పుడు తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఈ సినిమా చూసి ట్విట్టర్ ద్వారా సూర్య, చిత్రయూనిట్ ను ప్రశంసించారు.

TFN Adminవాట్సాప్
Actress Kangana Ranaut To Join Thalaivi Movie Shoot Today
సినిమా వార్తలు

"తలైవి " మూవీ సెట్స్ లో కంగనా రనౌత్

విబ్రి మీడియా , కర్మ మీడియా &ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై ఎ ఎల్ విజయ్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ కథానాయికగా , లెజెండరీ యాక్ట్రెస్ , దివంగత తమిళనాడు ముఖ్య మంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా "తలైవి" మూవీ తమిళ , తెలుగు , హిందీ భాషలలో రూపొందుతుంది. అరవింద్ స్వామి , ప్రకాష్ రాజ్ , భాగ్యశ్రీ , పూర్ణ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ బయోపిక్ మూవీ కి జి వి ప్రకాష్ కుమార్ , రచిత అరోరా సంగీతం అందిస్తున్నారు. స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ "తలైవి" మూవీ కి కథను అందించారు.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

షూటింగ్ పూర్తి చేసుకున్న జాంబీ రెడ్డి

గత కొన్ని నెలలుగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా పై ప్రశాంత్ వర్మ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బాలనటునిగా ఎన్నో సినిమాల్లో అలరించిన తేజ సజ్జా ‘ఓ బేబీ’ చిత్రంలో కీలక పాత్రలో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు తేజ సజ్జా హీరోగా, ఆనంది, దక్ష హీరోయిన్లుగా ఈ సినిమా తెరకెక్కుతుంది.

TFN Adminవాట్సాప్
Romantic Movie Actress Ketika Sharma Grabs Opportunity To Play Lead Role Opposite Jr NTR In NTR 30
సినిమా వార్తలు

"#NTR30" మూవీ లో కేతిక శర్మ ?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం "రౌద్రం రణం రుధిరం " మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక మూవీ కి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హారిక &హాసిని క్రియేషన్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ "#NTR30"మూవీ రూపొందనుంది. మార్చి నెలలో సెట్స్ పైకి వెళ్ళే ఈ మూవీ కై దర్శకుడు త్రివిక్రమ్ నటీ నటులను ఎంపిక చేస్తున్నారు. ఈ మూవీ లో ఎన్టీఆర్ కు జోడీగా కేతిక శర్మ ను ఎంపిక చేయనున్నట్టు సమాచారం.

Team TFNవాట్సాప్
రిలీజ్ అప్‌డేట్

'ఆదిపురుష్' రిలీజ్ డేట్ ఫిక్స్

కరోనా ప్రభావం ఇప్పుడిప్పుడే తగ్గుతుంది. మొదట కాస్త భయపడినా ఇప్పుడు అందరూ షూటింగ్స్ ను మొదలుపెట్టేసారు. ఇక థియేటర్స్ ఓపెన్ చేసినా కూడా ఇప్పుడప్పుడే థియేటర్స్ లో సినిమాలు వచ్చే ఛాన్స్ ఉందో లేదో కూడా అప్పుడే చెప్పలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో సినిమా షూటింగ్ ఇంకా మొదలుపెట్టనేలేదు కానీ అప్పుడే సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించింది ఆదిపురుష్ టీం.

TFN Adminవాట్సాప్
Director Vamsy Gives An interesting Insight About Working With Mega Star Chiranjeevi
సినిమా వార్తలు

22 ఏళ్లకే చిరు ని డైరెక్ట్ చేశా

తెలుగు తెరకి అపురూప చిత్రాలను అందించిన సీనియర్ డైరెక్టర్ వంశీ. ఆయన కథలు వాస్తవానికి దగ్గరగా .. ఆయన కథల్లోని పాత్రలు సహజత్వానికి దగ్గరగా ఉంటాయి. అంతేకాదు ఒక సినిమాను చాలా తక్కువ రోజుల్లో పూర్తి చేసే డైరెక్టర్ వంశీ. ఇక డైరెక్టర్ వంశీ అంటే మనకు ముందు సితార, లేడీస్ టైలర్, అన్వేషణ ఈ సినిమాలే గుర్తొస్తాయి. కానీ లేడీస్ టైలర్ కంటే ముందే వంశీ చిరు తో కూడా ఒక సినిమా చేసిన సంగతి చాలా తక్కువ మందికే తెలిసి ఉండొచ్చు. అసలు సంగతేంటంటే లేడీస్ టైలర్ కంటే ముందే చిరు తో మంచు పల్లకి సినిమా చేసాడు. ఇక ఈ సినిమాపై వంశీ ఒక ఇంటర్వ్యూ లో చెపుతూ ఆసక్తికర విషయాలు తెలిపారు. నిజానికి అది తమిళ్ సినిమాను. దాన్ని తెలుగులో…

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

'ఆచార్య' షూటింగ్ లో అప్పుడే

కరోనా వల్ల ఇన్ని నెలలు షూటింగ్ కు బ్రేక్ పడగా.. 'ఆచార్య' చిత్రయూనిట్ నవంబర్ 10 నుండి మళ్లీ షూటింగ్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. నిజానికి చిరు కూడా ఈ షూటింగ్ లో పాల్గొనాలి కానీ చిరు కరోనా పాజిటివ్ అని ముందు రావడంతో మిగిలిన చిత్ర బృందం షూటింగ్ ను ప్రారంభించింది. అయితే ఆ తర్వాత మళ్లీ టెస్టింగ్ కిట్ లో లోపం ఉండటం వల్ల పాజిటివ్ వచ్చిందని.. కరోనా లేదని తెలిసిపోయింది. దీనితో నవంబర్ 20 వ తేదీ నుండి చిరంజీవి కూడా షూటింగ్ లో పాల్గొనబోతున్నారు.

TFN Adminవాట్సాప్

షేర్