సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. తన తండ్రి సూపర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా.. మహేష్ పుట్టినరోజు సందర్భంగా మోషన్ పోస్టర్ రిలీజ్ చేయగా వాటికీ సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన ఎప్పుడో వచ్చినా… అధికారికంగా మాత్రం పట్టాలెక్కలేదు. ఇక దానికితోడు తెలిసిందే కదా కరోనా వల్ల అన్ని సినిమాల షూటింగ్ లు ఆగిపోయాయని. అలాగే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలుపెట్టలేకపోయారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు ఆరోజు రానే వచ్చింది. ఈ సినిమాను అధికారికంగా లాంచ్ చేశారు. మహేష్ బాబు తనయి సితార క్లాప్ కొట్టగా, భార్య నమ్రత కెమెరా స్విచ్ ఆన్ చేసి సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. ఈ మూవీ రెగ్యూలర్ షూట్ జనవరి మొదటి వారం నుండి జరగనుంది. 2021 దసరాకు సినిమా రిలీజ్ చేసే ఆలోచనలో వున్నారు.
Super star @urstrulymahesh & @KeerthyOfficial starrer #SarkaruVaariPaata Pooja took place today!
Regular shoot commences from 1st Week of Jan 2021
Clap by #SitaraGhattamaneni
Camera Switched on by #NamrataMahesh@ParasuramPetla @MusicThaman @GMBents @14ReelsPlus pic.twitter.com/HmUGBLMCmr— Mythri Movie Makers (@MythriOfficial) November 21, 2020
కాగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే పలు పాటలు కంపోజ్ చేసినట్టు కూడా తెలుస్తుంది.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: