ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 16
చిరంజీవి మూవీ టైటిల్ తో విజయ్ ఆంటోనీ
క్రైమ్ డ్రామాగా తరుణ్ భాస్కర్ మూడో సినిమా
మరో కన్నడ మూవీ లో అంజలి
'బంగార్రాజు' కు కూడా టైమొచ్చింది
రెజీనా స్టైలిష్ లుక్

"F 3" మూవీ అప్ డేట్
ఫేవరెట్ డైరెక్టర్ కి బర్త్ డే విషెస్
శృతి రియాక్షన్ కు బన్నీ షాక్
భార్య కు నాని బర్త్ డే విషెస్ - గుడ్ కంపెనీ
హీరో నాగచైతన్య బర్త్ డే సీడీపీ రిలీజ్
'ఢీ' సీక్వెల్ ఆఫీషియల్ అనౌన్స్ మెంట్
రష్మిక ఫ్యాన్స్ సెలబ్రేషన్స్
మాల్దీవుల్లో సమంత అడ్వెంచర్
మహేష్ ఫ్యాన్స్ కు పండగే అంటున్న పూరీ
నాగశౌర్య కు జోడీగా సంచలన గాయని షర్లీ సేతియా
శింబు 'మానాడు' ఫస్ట్ లుక్ రిలీజ్
"దుర్గామతి" ఫస్ట్ లుక్ రిలీజ్
జి అశోక్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో రూపొందిన హారర్ థ్రిల్లర్ "భాగమతి "మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. "భాగమతి "మూవీ తమిళ , మలయాళ డబ్బింగ్ వెర్షన్స్ విజయం సాధించాయి. స్టార్ హీరోయిన్ అనుష్క అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన "భాగమతి "మూవీ US బాక్స్ ఆఫీస్ లో 1 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. "భాగమతి "మూవీ హిందీ భాషలో రీమేక్ అవుతుంది.
చిరంజీవి మూవీ టైటిల్ తో విజయ్ ఆంటోనీ
ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు విజయ్ ఆంటోనీ "మహాత్మ ", "దరువు " వంటి మూవీస్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. క్రైమ్ థ్రిల్లర్ "నాన్ " తమిళ మూవీ తో విజయ్ హీరోగా మారారు. సూపర్ హిట్ "బిచ్చగాడు "మూవీ తో తెలుగు ప్రేక్షకులను విజయ్ ఆకట్టుకున్నారు. విజయ్ హీరోగా రూపొందిన తమిళ మూవీస్ తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ "యమన్ ", "భేతాళుడు ", "ఇంద్ర సేన ", "రోషగాడు ", "కాశి ", "కిల్లర్ " మూవీస్ ప్రేక్షకులను అలరించాయి. విజయ్ ప్రస్తుతం 4 తమిళ మూవీస్ లో నటిస్తున్నారు.

బిగ్ బాస్ 4 - రంగు పడింది.. 12 వారం నామినేషన్స్ లిస్ట్
బిగ్ బాస్ 4 - వీకెండ్ అయిపోయింది.. ఇంకా సోమవారం వచ్చిందంటే అందరూ ఆసక్తిగా ఎదురుచూసేది మాత్రం నామినేషన్ ప్రక్రియ కోసం. ఇక నిన్న ఎపిసోడ్ నామినేషన్ ప్రక్రియ ఎంత హాట్ గా జరిగింది.. ఫైనల్ గా నామినేషన్ లో ఎవరు ఉన్నారో తెలియాలంటే మాత్రం ఏం జరిగిందో తెలియాలంటే ఎపిసోడ్ లోకి వెళ్లాల్సిందే.
థియేటర్స్ కు గ్రీన్ సిగ్నల్ .. కేసీఆర్ కు చిరు కృతజ్ఞతలు
కరోనా వల్ల అన్ని రంగాలతో పాటు సినీ రంగానికి కూడా భారీ నష్టమే కలిగింది. ఒక రకంగా చెప్పాలంటే కాస్త ఎక్కువ నష్టమే కలిగిందని చెప్పొచ్చు. థియేటర్స్ మూత పడటం.. షూటింగ్ లు చేయలేని పరిస్థితి.. మరో పక్క కరోనా వల్ల ఎంతో మంది సెలెబ్రిటీస్ మరణించడం.. సినీ కార్మికులకు ఇబ్బందులు ఇలా చాలా సమస్యలు ఇండస్ట్రీని కుదేలు చేశాయి. ఇప్పుడిప్పుడే షూటింగ్స్ మొదలు పెడుతున్నారు. కొన్ని సినిమాలు షూటింగ్ ను పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి.
క్రైమ్ డ్రామాగా తరుణ్ భాస్కర్ మూడో సినిమా
తొలి సినిమా పెళ్లి చూపులు తోనే టాలీవుడ్ లో సెన్సేషన్ సృష్టించాడు యువ దర్శకుడు తరుణ్ భాస్కర్. అంతే కాదు మొదటి సినిమాతోనే జాతీయ అవార్డు ను దక్కించుకున్నాడు. ఇక పెళ్ళిచూపులు సినిమా తర్వాత ఈ నగరానికి ఏమైంది? సినిమా తీసాడు. అయితే ఈ సినిమా సూపర్ హిట్ అవ్వకపోయినా ఒక మాదిరిగానే ఆడింది. మధ్యలో ఫలక్ నుమా దాస్ సినిమాలో పోలీస్ పాత్రలో నటించగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ సినిమా తర్వాత తానే హీరోగా 'మీకు మాత్రమే చెప్తా' సినిమా కూడా తీసాడు.
మరో కన్నడ మూవీ లో అంజలి
"ఫొటో "(2006) మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన అంజలి తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ భాషల పలు సూపర్ హిట్ మూవీస్ తో 15 సంవత్సరాలుగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలతో పాటు ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ తో అంజలి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. "ఆనంద భైరవి ", "వకీల్ సాబ్ " తెలుగు మూవీస్ లో నటిస్తున్న అంజలి రెండు తమిళ మూవీస్ లో కూడా నటిస్తున్నారు. హీరోయిన్ అంజలి ఇప్పుడు ఒక కన్నడ మూవీ లో కథానాయికగా ఎంపిక అయ్యారు.
'బంగార్రాజు' కు కూడా టైమొచ్చింది
కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున హీరోగా వచ్చిన 'సోగ్గాడే చిన్ని నాయన' సినిమా ఎంత మంచి హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2016 విడుదలైన ‘సోగ్గాడే చిన్నినాయనా కింగ్ నాగార్జున కెరీర్‌లోనే హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలిచింది.ఇక ఈ సినిమా సీక్వెల్ ను కూడా తీయాలని గత రెండేళ్ల నుండి ప్లాన్ చేస్తున్నారు కూడా. ఆ మధ్య దాదాపు సెట్స్ పైకి వెళ్లనుందన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే అది కుదరలేదు. దానికి తోడు కరోనా కూడా రావడంతో అది ఇంకా లేట్ అయింది. మరోవైపు కళ్యాణ్ కృష్ణ కూడా స్క్రిప్ట్ ఎప్పుడో రెడీ చేసుకొని పెట్టుకున్నాడు.
రెజీనా స్టైలిష్ లుక్
" శివ మనసులో శృతి " మూవీ తో తమిళ యాక్ట్రెస్ రెజీనా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. పలు తెలుగు , తమిళ భాషల సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయంతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. రీసెంట్ గా సూపర్ హిట్ "ఎవరు " మూవీ తో తెలుగు ప్రేక్షకులను అలరించిన రెజీనా ప్రస్తతం 4 తమిళ మూవీస్ లో నటిస్తున్నారు. సోషల్ మీడియా లో తన లేటెస్ట్ ఫొటోలతో రెజీనా అభిమానులను ఆకట్టుకుంటున్నారు.

"F 3" మూవీ అప్ డేట్
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ -తమన్నా , వరుణ్ తేజ్ - మెహరీన్ జంటగా రూపొందిన కామెడీ ఎంటర్ టైనర్" F 2 :ఫన్ &ఫ్రస్టేషన్ "మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా పూర్తి కామెడీ ఎంటర్ టైనర్ గా దర్శకుడు అనిల్ తెరకెక్కించిన " F 2 :ఫన్ &ఫ్రస్టేషన్ "మూవీ విశేష ప్రేక్షకాదరణ పొందింది. హీరోలు వెంకటేష్ , వరుణ్ తేజ్ తమ కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించారు. " F 2 :ఫన్ &ఫ్రస్టేషన్ "మూవీ సీక్వెల్ "F 3" మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే.
ఫేవరెట్ డైరెక్టర్ కి బర్త్ డే విషెస్
సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ మధ్య సోషల్ మీడియాలో బాగానే యాక్టీవ్ గా ఉంటున్నారన్న సంగతి తెలిసిందే. తన సినిమాలు, వ్యక్తిగత విషయాలపై మాత్రమే కాదు పలు విషయాలను కూడా పంచుకుంటారు. అంతేకాదు తనకు సన్నిహితులైతే వారి పుట్టినరోజులను గుర్తుపెట్టుకొని మరీ శుభాకాంక్షలు తెలియచేస్తాడు మహేష్. తన మేకప్ మెన్ పుట్టిన రోజును కూడా గుర్తుంచుకొని మరి విషెస్ చెప్పాడంటేనే అర్థంచేసుకోవచ్చు. ఇక ఈ రోజు తనకు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన అనిల్ రావిపూడి బర్త్ డే. ఈ సందర్భంగా మహేష్ తన ట్విట్టర్ ద్వారా అనిల్ రావిపూడికి బర్త్ డే విషెస్ తెలిపాడు.
శృతి రియాక్షన్ కు బన్నీ షాక్
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన రేసుగుర్రం సినిమా మంచి విజయం దక్కించుకున్న సంగతి తెలిసిందే. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ‘కిక్’ శ్యామ్ అన్నదమ్ములుగా నటించిన ఈ ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ అందరినీ అలరించింది. “టామ్ అండ్ జెర్రీ”లా నిత్యం పోట్లాడుకుంటూ ఉండే ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఉండే భావోద్వేగాలను.. వినోదాత్మకంగా వెండితెరపై ఆవిష్కరించాడు సురేందర్ రెడ్డి.
భార్య కు నాని బర్త్ డే విషెస్ - గుడ్ కంపెనీ
సోషల్ మీడియాలో నాని ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటాడు. సినిమాలకు సంబంధించిన విషయాలే కాదు వ్యక్తిగత విషయాలు కూడా అభిమానులతో షేర్ చేసుకుంటాడు. ఇక ఇదిలా ఉండగా ఈ రోజు నాని సతీమణి అంజనా పుట్టినరోజు. ఈ సందర్భంగా నాని అంజనాకు సోషల్ మీడియా ద్వారా బర్త్ డే విషెస్ తెలియచేసాడు. ఫ్లయిట్ లో ఉన్న తమ ఫ్యామిలీ ఫొటోను పోస్ట్ చేస్తూ.. హ్యాపీ బర్త్ డే అంజనా.. లాంగ్ ఫ్లయిట్ కానీ నువ్వు ఇద్దరికీ మంచి కంపెనీ ఇచ్చావు అంటూ పోస్ట్ లో పేర్కొన్నాడు.
హీరో నాగచైతన్య బర్త్ డే సీడీపీ రిలీజ్
"జోష్" మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన నాగచైతన్య "ఏ మాయ చేసావె ", "100%లవ్ ", "తడాఖా ", "మనం ", "ఒక లైలా కోసం ", "ప్రేమమ్ ", మజిలీ ", "వెంకీ మామ " వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోగా దూసుకుపోతున్న నాగచైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ "లవ్ స్టోరీ " మూవీ లో నటిస్తున్నారు. విక్రమ్ K కుమార్ దర్శకత్వంలో "థాంక్యూ "మూవీ కి నాగచైతన్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
'ఢీ' సీక్వెల్ ఆఫీషియల్ అనౌన్స్ మెంట్
మొత్తానికి అందరూ ఉంహించుకున్నట్టు గానే అప్ డేటే ఇచ్చాడు మంచు విష్ణు. ఇక ఈ సినిమా నుండి ఎగ్జైటింగ్ అప్ డేట్ ఉందని రెండు రోజుల క్రితమే చెప్పి సస్పెన్స్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ రోజు విష్ణు బర్త్‌డే సందర్భంగా ఢీ సీక్వెల్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చింది. ఈ సందర్భంగా విష్ణు ట్వీట్ చేశాడు. పెద్ద అన్నయ్య శ్రీను వైట్లతో మరోసారి సినిమా చేయడం చాలా ఉత్సాహంగా ఉందని.. ఈ సారి "డబుల్ డోస్"(ఢీఢీ) తో వస్తున్నట్టు ప్రకటించారు. ఇక 'ఢీ' కి పనిచేసిన గోపి మోహన్ కూడా ఈ సినిమాకు పనిచేస్తుండటం మరో విశేషం.

బిగ్ బాస్ 4 - షాకింగ్ ఎలిమినేషన్.. లాస్య ఔట్
బిగ్ బాస్4 - ఊహించని విధంగా లాస్య హౌస్ నుండి బయటకి వచ్చేసింది. మరి నిన్నటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఇక వీకెండ్ అందులో సండే కాబట్టి నాగ్ ఫుల్ జోష్ లో ఎంట్రీ ఇచ్చేసాడు. ఇక అదే జోష్ తో ఇంటి సభ్యులతో కూడా గేమ్స్ ఆడించాడు. ఇందులో మొదటగా.. ఏ టీం. బీ టీం అని రెండు టీం లగ విడగొట్టి అవినాష్, అరియానా, సోహైల్, మోనాల్ ఏ టీమ్‌గా మిగిలినవారు బీ టీమ్‌గా ఏర్పడ్డారు. ఇక గేమ్ ఏంటంటే స్క్రీన్ పై కొన్ని ఫొటోలను చూపించి దాని ఆధారంగా పాటల పేర్లు చెప్పడం. ఈ గేమ్ లో హారిక టీం లీడర్ గా ఉన్న జట్టుగెలిచింది. ఈ గేమ్ అయిపోయిన తర్వాత హారిక సేఫ్ అయినట్లు నాగ్ ప్రకటించారు.
రష్మిక ఫ్యాన్స్ సెలబ్రేషన్స్
టాలీవుడ్ , శాండల్ వుడ్ లలో రష్మిక సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్న రష్మిక కోలీవుడ్ లో కూడా ప్రవేశిస్తున్నారు. గూగుల్ సెర్చ్ ఇంజన్ లో నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా గా రష్మిక ఒక అరుదైన రికార్డ్ ను సాధించారు. గూగుల్ లో నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా అని టైప్ చేయగానే రష్మిక కు సంబంధించిన సమాచారం కనిపిస్తుంది.
మాల్దీవుల్లో సమంత అడ్వెంచర్
తెలుగు , తమిళ భాషల స్టార్ హీరోల తో సమంత జంటగా రూపొందిన పలు మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని సమంత స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ సమంత అభిమానులను అలరిస్తున్నారు. సమంత ప్రస్తుతం తెలుగు , తమిళ భాషలలో రూపొందే హారర్ కామెడీ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మహేష్ ఫ్యాన్స్ కు పండగే అంటున్న పూరీ
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన ఎప్పుడో వచ్చినా… అధికారికంగా మాత్రం పట్టాలెక్కలేదు. ఇక దానికితోడు తెలిసిందే కదా కరోనా వల్ల అన్ని సినిమాల షూటింగ్ లు ఆగిపోయాయని. అలాగే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలుపెట్టలేకపోయారు. ఈ సినిమాను అధికారికంగా ఈరోజు లాంచ్ చేశారు. మహేష్ బాబు తనయి సితార క్లాప్ కొట్టగా, భార్య నమ్రత కెమెరా స్విచ్ ఆన్ చేసి సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. ఈ మూవీ రెగ్యూలర్ షూట్ జనవరి మొదటి వారం నుండి జరగనుంది. 2021 దసరాకు సినిమా రిలీజ్ చేసే ఆలోచనలో వున్నారు.
నాగశౌర్య కు జోడీగా సంచలన గాయని షర్లీ సేతియా
ప్రస్తుతం సుబ్రహ్మణ్యపురం ఫేమ్ దర్శకుడు సంతోష్ జాగర్లపూడి తో కలిసి నాగ శౌర్య 20 వ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.పురాతన క్రీడ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. దీనితో పాటుసితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో.. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ లో కె.పి.రాజేంద్ర దర్శకత్వంలో మరో సినిమా తెరకెక్కుతుంది.
శింబు 'మానాడు' ఫస్ట్ లుక్ రిలీజ్
ప్రస్తుతం శింబు వెంకట్ ప్రభు డైరెక్షన్లో ‘మానాడు’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పవర్ ఫుల్ పొలిటికల్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో వుంది.ఇక తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. నిజానికి ఈ సినిమాను గత ఏడాదే ప్రకటించినా కరోనా వల్ల ఆలస్యమైంది. ఇప్పుడు శరవేగంగా షూటింగ్ జరుపుతున్నారు.