స్పెషల్ అట్రాక్షన్ గా జున్ను – ఆ విషయంలో లాస్య గ్రేటే

Anchor Lasya Receives Huge Applauds For Her Challenging Attitude and Determination In Bigg Boss House

మొత్తానికి చూస్తుండగానే బిగ్ బాస్ రియాలిటీ షో 75 రోజులు పూర్తి చేసుకుంది. ప్రస్తుతానికైతే ఇంట్లో 8మంది కంటెస్టెంట్ లు ఉన్నారు. ఇక ఈ వారం మొత్తం ఎమోషన్స్ తో నిండిపోయింది బిగ్ బాస్ హౌస్. అందరు హౌస్ మేట్స్ పేరెంట్స్ రాగా అందరూ కొంచెం రిలీఫ్ ఫీల్ అయ్యారు. అయితే అందరి పరిస్థితి వేరు.. లాస్య పరిస్థితి వేరు. అందరి కోసం పేరెంట్స్ వస్తే.. లాస్య మాత్రం జున్ను కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి. ముఖ్యంగా ఈ వారం స్పెషల్ అట్రాక్షన్ మాత్రం లాస్య కొడుకు జున్నుదే అని చెప్పొచ్చు. జున్ను ఎంట్రీ కోసం ఒక్క లాస్య, హౌస్ మేట్స్ మాత్రమే కాదు బిగ్ బాస్ లవర్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూసారు. ఫైనల్లీ నిన్న జున్ను హౌస్ లోకి వచ్చేసాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక జున్నుని చూడగానే లాస్య భోరున ఏడ్చింది. ఏడ్చుకుంటూనే భర్తతో మాట్లాడింది. ‘నువ్వు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నావు. నువ్వెంత స్ట్రాంగ్‌గా ఉన్నావో నీ కన్నా ఎక్కువ స్ట్రాంగ్‌గా ఉన్నాడు జున్ను. అస్సలు ఏడ్వడం లేదు. నువ్వు బాగా ఆడు. చాలా బాగా ఆడుతున్నావు. ఇంకా బాగా స్ట్రాంగ్‌గా ఆడాలి. కిచెన్‌లో ఎక్కువగా ఉండిపోతున్నావు. అక్కడి నుంచి బయటికి వచ్చి గేమ్ బాగా ఆడాలి. 10 వారాల పాటు ఉన్నావంటే నువ్వు ఎంత స్ట్రాంగో అర్థం చేసుకో’ అంటూ లాస్యకు మంజునాథ్‌ ధైర్యం చెప్పాడు. ఇక జున్నును ఇంటి సభ్యులంతా ఆడించారు. అవినాష్‌ అయితే జోకర్‌ గా మారి జున్నును నవ్వించాడు. ఇంటి సభ్యులందరూ లాస్య భర్తతో మాట్లాడుతూ ఆమెపై జోకులు వేశారు. అలాగే ఆంటీ అంటూ లాస్యను ఆట పట్టించారు. లాస్య ఆంటీ కాదని, ఆమె నవ్వు జన్యూన్‌ అని, గేమ్‌ చాలా బాగా ఆడుతుందని మంజునాథ్ చెప్పు కొచ్చాడు.

ఇక తల్లిప్రేమ ఎలా ఉంటుందో చెప్పడం ఎవరికైన చాలా కష్టం. రెండేళ్ల కొడుకుని వదిలేసి ఈ గేమ్ కు రావడమే లాస్యకు పెద్ద టాస్క్ లాంటింది. అలాంటిది తనని వదిలి ఇన్ని రోజులు ఉండటం.. పదే పదే గుర్తుకు వచ్చినా కూడా ఆ ఎమోషన్ ను కంట్రోల్ చేసుకుంటూ.. క్యారీ చేస్తూ ఇంట్లో ఉంటూ ఒకపక్క వంట చేస్తూ.. మరోపక్క టాస్కులు ఆడటం అంటే కత్తి మీద సాము లాంటిందే. అలాంటిది ఇన్ని పరిస్థితుల మధ్య లాస్య ఇన్ని వారాలు ఇంట్లో ఉందంటే మాములు విషయం కాదు. గ్రేట్ అని చెప్పొచ్చు. మరి ఈవారం లాస్య కూడా నామినేషన్ లో వుంది. మరి సేఫ్ అవుతుందా.. లేదా అన్నది చూడాలంటే మరో రోజు వెయిట్ చేయాల్సిందే.

తన అమాయకత్వంతో, అల్లరితో బుల్లి తెరపై యాంకర్ గా ఎంతో క్రేజ్ సంపాదించుకుంది యాంకర్ లాస్య. ‘సంథింగ్ స్పెషల్’ కార్యక్రమంతో ప్రేక్షకులకు చేరువై ఆ తరువాత ఎన్నో ప్రోగ్రామ్స్ కు యాంకర్ గా చేసింది. ఇక కెరీర్ కాస్త స్పీడ్ గా ఉన్నప్పుడే లాస్య మంజునాథ్ ను వివాహం చేసుకుంది. వివాహం తరువాత అప్పుడప్పుడూ బుల్లితెరపై కనిపించడమే కానీ పూర్తి స్థాయిలో యాంకర్‌గా ఏ షో లో కనిపించలేదు. తన యూ ట్యూబ్ ఛానల్ తో పలు వంటకాలు, టిప్స్ చెపుతూ అభిమానులకు దగ్గరగానే ఉంటుంది. ఇటీవలే మళ్ళీ తెరపై కొన్ని షోస్‌లో అక్కడక్కడా కనిపిస్తోంది. మరి బిగ్ బాస్ తర్వాత అయినా లాస్య ఫుల్ బిజీ అయిపోతుందేమో చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − 11 =