
ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 168


నిర్మాతల హీరో

వరుస సినిమాలతో నాగశౌర్య బిజీ..!

పవన్ సినిమాలో అంజలి ఉన్నట్టే..!
డైరెక్టర్ శంకర్ ఎస్ ఆర్ధిక సాయం
కమెడియన్ నుండి విలన్ గా..!

కొత్త సినిమాకు నాని గ్రీన్ సిగ్నల్

`పొన్నియిన్ సెల్వన్` సెకండ్ షెడ్యూల్ పూర్తి

అల్లు అర్జున్ 20... కేరళలో 40 రోజుల భారీ షెడ్యూల్

కార్తీ 'ఖైదీ" రీమేక్ లో అజయ్ దేవగన్

రామ్ చరణ్ తో వెంకీ కుడుముల?

ప్రభాస్ 21... మరో చందమామ కథ?

పిరియాడిక్ ఫిల్మ్ లో సాయితేజ్?
రమ్య కృష్ణ కాదు నదియా..!
స్వేచ్ఛ మూవీ పబ్లిక్ ఒపీనియన్
హిట్ మూవీ పబ్లిక్ ఒపీనియన్
మరోసారి తండ్రైన సందీప్ వంగా
విజయ్ దేవరకొండ చాలా స్మార్ట్

పాన్ ఇండియా కాదు - పాన్ వరల్డ్ డార్లింగ్స్..!

రామ్ #RED టీజర్ రిలీజ్
కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ ప్రధాన పాత్రలో 'రెడ్' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తమిళంలో సూపర్ హిట్ అయిన 'తడం' సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. రెండు పాటలను ఇటీవల ఇటలీలో చిత్రీకరించారు. ఒక్క పాట మినహా చిత్రీకరణ పూర్తయిందని తెలుస్తోంది. ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు.

నిర్మాతల హీరో
సెన్సేషనల్ హిట్ "అర్జున్ రెడ్డి " మూవీ తో యూత్ లో క్రేజ్ పెంపొందించుకున్న విజయ్ దేవరకొండ బ్లాక్ బస్టర్ "గీత గోవిందం" మూవీ తో స్టార్ హీరోగా మారారు. విజయ్ హీరోగా నటించిన "నోటా ", "డియర్ కామ్రేడ్ " మూవీస్ పరాజయం పొందినా విజయ్ క్రేజ్ ఏ మాత్రం చెక్కు చెదరలేదు. విజయ్ ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ "ఫైటర్ " (వర్కింగ్ టైటిల్ ) తో బాలీవుడ్ కు ఎంటర్ అవుతున్నారు.

వరుస సినిమాలతో నాగశౌర్య బిజీ..!
యంగ్ హీరో నాగశౌర్య వరుసపెట్టి సినిమాలను లైన్ లో పెట్టేస్తున్నాడు. రీసెంట్ గా 'అశ్వథ్థామ' సినిమాతో వచ్చిన నాగశౌర్య ఆ సినిమా అయిపోయిన వెంటనే మరో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ తెరకెక్కుతుంది. ఇటీవలే ఈ సినిమా కూడా ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకుంటుంది.

పవన్ సినిమాలో అంజలి ఉన్నట్టే..!
పవన్ కళ్యాణ్ ఓ వైపు రాజకీయాలు.. మరో వైపు సినిమాలు రెండింటినీ చాలా బ్యాలన్స్ చేస్తూ వస్తున్నాడు. షూటింగ్ పనులు చూసుకుంటూనే మరోపక్క రాజకీయాలను కూడా చూసుకుంటున్నారు. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ లో నటిస్తున్నాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. వచ్చే నెలకల్లా ఈ సినిమా షూటింగ్ ను ముగించి.. మే 15వ తేదీన రిలీజ్ చేయనున్నారు. ఉగాది రోజున ఈ సినిమా టైటిల్ ను ప్రకటించనున్నారు.
డైరెక్టర్ శంకర్ ఎస్ ఆర్ధిక సాయం
లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై శంకర్ ఎస్ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ కమల్ హాసన్ హీరో గా సూపర్ హిట్ "ఇండియన్ " (భారతీయుడు) మూవీ సీక్వెల్ "ఇండియన్ 2" (భారతీయుడు 2) మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్, ప్రియా భవాని శంకర్ కథానాయికలు కాగా అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.
కమెడియన్ నుండి విలన్ గా..!
కమెడియన్ గా తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టి.. ఎన్నో సినిమాల్లో తన కామెడీతో నవ్వించి.. హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే హిట్ కొట్టిన 'అందాల రాముడు' సునీల్. అయితే కమెడియన్ గా ఎంత సక్సెస్ అయ్యాడో.. హీరోగా మాత్రం అవ్వలేకపోయాడు అని చెప్పొచ్చు. దీనితో కొంత గ్యాప్ తీసుకున్న సునీల్ మళ్ళీ ఈ మధ్యనే తెరపైకి వస్తున్నాడు. ఇక ఇటీవలే 'అల వైకుంఠపురములో', 'డిస్కో రాజా' సినిమాల్లో నటించిన సునీల్ ఇప్పుడు మరో డిఫరెంట్ పాత్రతో వస్తున్నాడు.

కొత్త సినిమాకు నాని గ్రీన్ సిగ్నల్
హీరో నాని పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాని, సుధీర్ బాబు హీరోలుగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ "V" మూవీ మార్చి 25 వ తేదీ రిలీజ్ కానుంది. హీరో నాని ప్రస్తుతం సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "టక్ జగదీష్" మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ మూవీ తరువాత "టాక్సీ వాలా " ఫేమ్ రాహుల్ దర్శకత్వంలో నాని హీరోగా "శ్యామ్ సింగరాయ్" మూవీ సెట్స్ పైకి వెళ్ళనుంది.

`పొన్నియిన్ సెల్వన్` సెకండ్ షెడ్యూల్ పూర్తి
లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న చిత్రం `పొన్నియిన్ సెల్వన్`. మోహన్ బాబు, విక్రమ్, `జయం` రవి, కార్తి, ఐశ్వర్యా రాయ్, త్రిష తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీని లైకా సంస్థ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. డబుల్ ఆస్కార్ విన్నర్ ఎ.ఆర్. రెహమాన్ సంగీతమందిస్తున్నాడు.

అల్లు అర్జున్ 20... కేరళలో 40 రోజుల భారీ షెడ్యూల్
`అల వైకుంఠపురములో`తో కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఒక వైపు ఆ విజయాన్ని ఆస్వాదిస్తూనే.. మరో వైపు కొత్త చిత్రంపై దృష్టి సారించాడు. తన లక్కీ డైరెక్టర్ సుకుమార్ రూపొందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో బన్నీ రెండు విభిన్న పాత్రల్లో సందడి చేయనున్నాడని ఫిల్మ్ నగర్ ఇన్ ఫర్మేషన్.

కార్తీ 'ఖైదీ" రీమేక్ లో అజయ్ దేవగన్
డ్రీమ్ వారియర్ పిక్చర్స్, వివేకానంద పిక్చర్స్ బ్యానర్స్ పై లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కార్తీ హీరోగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ "ఖైదీ "తమిళ మూవీ, తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. హీరోయిన్, సాంగ్స్ వంటి కమర్షియల్ హంగులు లేకుండా కేవలం కాన్సెప్ట్ పై తెరకెక్కిన "ఖైదీ " మూవీ విశేష ప్రేక్షకాదరణ పొందింది.

రామ్ చరణ్ తో వెంకీ కుడుముల?
`ఛలో` (2018)తో దర్శకుడిగా తొలి అడుగేసిన వెంకీ కుడుముల.. మొదటి ప్రయత్నంలోనే మంచి విజయాన్ని ఒడిసిపట్టుకున్నాడు. ఇక రెండో చిత్రంగా స్వల్ప విరామం తరువాత వచ్చిన `భీష్మ` కూడా బ్లాక్ బస్టర్ టాక్ తో వసూళ్ళ వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో... ఇప్పుడు అందరి దృష్టి కూడా వెంకీ థర్డ్ వెంచర్ పైనే ఉంది.

ప్రభాస్ 21... మరో చందమామ కథ?
చందమామ కథల తరహాలో తెరకెక్కిన `బాహుబలి` చిత్రాలు.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ని మరో స్థాయికి తీసుకెళ్ళాయి. డార్లింగ్ కి పాన్ - ఇండియా స్టార్ ఇమేజ్ ని కట్టబెట్టాయి. కట్ చేస్తే... ఇప్పుడిదే తరహాలో మరో డిఫరెంట్ కాన్సెప్ట్ తో `ప్రభాస్ 21` రాబోతోంది. `మహానటి` ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్... చందమామ కథ తరహాలో తెరకెక్కనుందట. సైంటిఫిక్ ఫిక్షన్ గా ఈ సినిమా రూపొందనుందని కొన్ని కథనాలు వచ్చినా... `పాతాళ భైరవి` తరహాలో జనరంజక జానపద చిత్రంగా `ప్రభాస్ 21` ఉంటుందని వినికిడి.

పిరియాడిక్ ఫిల్మ్ లో సాయితేజ్?
`చిత్ర లహరి`, `ప్రతి రోజూ పండగే` విజయాలతో మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేసిన `సుప్రీమ్` హీరో సాయితేజ్... ప్రస్తుతం `సోలో బ్రతుకే సో బెటర్` చేస్తున్నాడు. నూతన దర్శకుడు సుబ్బు రూపొందిస్తున్న ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ మే 1న రిలీజ్ కానుంది. కాగా, ఆ లోపే తన నెక్స్ట్ వెంచర్ ని పట్టాలెక్కించనున్నాడు తేజ్. కాగా, ఇదో పిరియాడిక్ ఫిల్మ్ అని తెలిసింది.
రమ్య కృష్ణ కాదు నదియా..!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వరుణ్ బాక్సర్ గా నటించనున్నాడు. దీనిలో భాగంగానే వరుణ్ ఈ సినిమా కోసం ఒలింపిక్ విన్నర్ టోని జెఫ్రీస్ పర్యవేక్షణలో ట్రైనింగ్ తీసుకున్నాడు. ఇక రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేశారు. వైజాగ్లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటున్నట్టు తెలుస్తుంది.
స్వేచ్ఛ మూవీ పబ్లిక్ ఒపీనియన్
నిజానికి మనకు కమెర్షియల్, సస్పెన్స్, ఫ్యామిలీ, కామెడీ ఎంటెర్టైన్ట్ ఈ జోనర్స్ లోనే మ్యాగ్జిమమ్ సినిమాలు వస్తాయి. సందేశాత్మక సినిమాలు.. అందులోనూ ఆడపిల్లలు వాళ్లకు వచ్చే కష్టాలు ఇలాంటి నేపథ్యంలో వచ్చే సినిమాలు చాలా తక్కువ. తక్కువ కూడా ఎప్పుడో ఒకటి వస్తుంటాయి. అయితే ఇప్పుడు ఈ కాన్సెప్ట్ తో మనముందుకు వచ్చేసింది ప్రముఖ గాయని మంగ్లీ. ఆడపిల్లలు పుడితే కొంతమంది అమ్మేస్తున్న నేపథ్యంలో.. అలా అమ్మకానికి గురై అభాగ్యురాలైన ఓ యువతి ఎలా బతికింది? ఆమె ఏంసాధించింది అనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘స్వేచ్ఛ’. ప్రముఖ గాయని మంగ్లీ టైటిల్ రోల్‌ను పోషించింది. కె.పి.ఎన్.చౌహాన్ ప్రధాన పాత్రలో నటిస్తూ స్వీయ…
హిట్ మూవీ పబ్లిక్ ఒపీనియన్
క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలపై ప్రేక్షకులకు ఎప్పుడూ ఇంట్రెస్ట్ ఉంటుంది. కాస్త కంటెంట్ ఉండి.. థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఉంటే బొమ్మ హిట్టే. ఇప్పుడు అదే క్రైమ్ జోనర్ ను నమ్ముకొని మన ముందుకు వచ్చేశాడు 'ఫలక్‌నుమా దాస్' ఫేమ్ విశ్వక్ సేన్. విశ్వక్ సేన్, రుహానీ శర్మ హీరో హీరోయిన్లు గా నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి నిర్మించిన సినిమా 'హిట్'. ఈ సినిమాకు మొదటినుండీ పాజిటివ్ బజ్ ఉంది. పోస్టర్ల దగ్గరనుండి టీజర్, ట్రయిలర్ వరకూ అన్నీ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఇటీవల స్నీక్ పీక్ అంటూ సినిమాలోని కీలక ఘట్టాన్ని ముందుగానే చెప్పేసి ఆ తరవాత ఏం జరుగుతుందనే ఉత్కంఠను క్రియేట్ చేసి…
మరోసారి తండ్రైన సందీప్ వంగా
అర్జునరెడ్డి డైరెక్టర్ సందీప్ వంగ మరోసారి తండ్రయ్యాడు. సందీప్ సతీమణి మనీషా రెడ్డి ఈ మధ్యాహ్నం పండండి అమ్మాయికి జన్మనిచ్చింది. సందీప్, మనీషా 2014లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ దంపతులకు ఇప్పటికే ఓ కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం సందీప్, మనీషాలకు రెండో సంతానంగా పాప జన్మించింది. పలువురు సన్నిహితులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు.
విజయ్ దేవరకొండ చాలా స్మార్ట్
విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'ఫైటర్' సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెలుగు, హిందీ భాషలలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ముంబై లో షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న సంగతి కూడా విదితమే. ఇక ఇటీవలే ఆమె కూడా షూటింగ్ లో జాయిన్ అయింది. ఈ నేపథ్యంలో అప్పుడే అమ్మడు మన యంగ్ హీరోపై ప్రశంసలు కురిపించేస్తుంది.

పాన్ ఇండియా కాదు - పాన్ వరల్డ్ డార్లింగ్స్..!
యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తో ప్రభాస్ సినిమా ఉంటున్నట్టు వైజయంతి మూవీస్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై రూపొందనున్న ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనుందట. ఇక తాజాగా ఈ సినిమాపై నాగ్ అశ్విన్ ట్వీట్ చేయగా అది ఇప్పుడు వైరల్ అయింది. ఈ ఏడాది చివర్లో సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుంది.. 2021 చివర్లో సినిమాను రిలీజ్ చేస్తామని అశ్విన్ ట్వీట్ చేశారు. ఇప్పుడే సినిమా గురించి మాట్లాడటం సరికాదు...కొంతమంది ఇది పాన్ ఇండియా సినిమా అంటున్నారు... ప్రభాస్ పాన్ ఇండియా రేంజ్‌ను ఎప్పుడో దాటేశారు... ఆయనదిప్పుడు పాన్ వరల్డ్ స్థాయి అని ట్వీట్ లో…