పాన్ ఇండియా కాదు – పాన్ వరల్డ్ డార్లింగ్స్..!

Nag Ashwin About His Film With Prabhas,Latest Telugu Movies News,Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,Prabhas,Nag Ashwin,Director Nag Ashwin,Darling Prabhas New Film,#Prabhas21, Prabhas 21 Movie Updates, Prabhas 21 Telugu Movie Latest News

యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తో ప్రభాస్ సినిమా ఉంటున్నట్టు వైజయంతి మూవీస్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్‌పై రూపొందనున్న ఈ చిత్రం సైన్స్ ఫిక్ష‌న్ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్క‌నుంద‌ట‌. ఇక తాజాగా ఈ సినిమాపై నాగ్ అశ్విన్ ట్వీట్ చేయగా అది ఇప్పుడు వైరల్ అయింది. ఈ ఏడాది చివర్లో సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుంది.. 2021 చివర్లో సినిమాను రిలీజ్ చేస్తామని అశ్విన్ ట్వీట్ చేశారు. ఇప్పుడే సినిమా గురించి మాట్లాడ‌టం స‌రికాదు…కొంతమంది ఇది పాన్ ఇండియా సినిమా అంటున్నారు… ప్ర‌భాస్ పాన్ ఇండియా రేంజ్‌ను ఎప్పుడో దాటేశారు… ఆయ‌న‌దిప్పుడు పాన్ వ‌ర‌ల్డ్ స్థాయి అని ట్వీట్ లో పేర్కొన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా జిల్ ఫేమ్ రాధాకృష్ణా దర్శకత్వంలో ప్రభాస్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో ప్యాన్‌ ఇండియన్‌ సినిమాగా.. 1970 కాలంనాటి పీరియాడికల్ లవ్ స్టోరీ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుంది. గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళ్ భాషల్లో రూపొందనుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.