ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 167
మల్టీ స్టారర్ తో మహేష్ బాలీవుడ్ ఎంట్రీ..?
ప్రేక్షకులు...'సరిలేరు నీకెవ్వరు'

VD 10 మూవీ లో విజయ్ స్టన్నింగ్ పెర్ఫార్మెన్స్
"ఏ మాయ చేసావె " మూవీ సీక్వెల్ ?

యన్టీఆర్ ‘పెళ్ళి చేసి చూడు’కు 68 ఏళ్ళు

మహేష్ బాబు చిత్రానికి గోపీసుందర్ బాణీలు?

'భక్తవత్సలం నాయుడుగా' మోహన్ బాబు

ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిథిగా మెగా స్టార్

'కార్తికేయ2' ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్
'మోసగాళ్ళు' నుండి సునీల్ శెట్టి సీరియస్ లుక్
హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘మోసగాళ్ళు’. అతిపెద్ద ఐటీ కుంభకోణాల్లో ఒకటిగా నిలిచిన స్కామ్ వెనుక ఉన్న మిస్టరీని ఛేదించే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ లాస్ ఏంజెల్స్‌లో జరుగుతోంది. ఇక ఈ సినిమా నుండి ఇప్పటిక విష్ణు, కాజల్ ఫస్ట్ లుక్ పోస్టర్‌లు విడుదల చేయగా.. అవి ఆకట్టుకున్నాయి. ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుండి సునీల్ శెట్టి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ లుక్ లో పోలీస్ యూనిఫామ్, తలకు సిక్కులు ధరించే ‘టర్బన్’ తో సునీల్ శెట్టి ఒక…
మల్టీ స్టారర్ తో మహేష్ బాలీవుడ్ ఎంట్రీ..?
కృష్ణ వారసుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకొని సూపర్ హిట్స్ తో దూసుకుపోతున్నాడు మహేష్. అంతేకాదు ఈ హీరోకు కేవలం తెలుగులోనే కాదు అటు కోలీవుడ్, శాండిల్‌వుడ్‌లోనూ మంచి క్రేజ్ ఉంది. ఇక ఇదిలా ఉండగా మహేష్ బాబు బాలీవుడ్ లో సినిమాలు చేయనని ఇప్పటికే చాలా ఇంటర్వూస్ లో చెప్పిన సంగతి తెలిసిందే. మహేష్ బాబు చెప్పినా... బాలీవుడ్ సినిమా చేస్తారంటూ వార్తలు వస్తూనేవున్నాయి.. అయితే అవన్నీ వట్టి రూమర్లే అంటూ ఎప్పటికప్పుడు మహేష్ బాబు కూడా కొట్టి పడేస్తూనే ఉన్నాడు. ఇక ఇప్పుడు మరోసారి మహేష్ బాబు…
ప్రేక్షకులు...'సరిలేరు నీకెవ్వరు'
అనిల్ రావిపూడి, మహేష్ కాంబినేషన్ లో వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలైన ఈ సినిమా తొలిరోజు నుండే సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని బాక్స్ ఆఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ రాబట్టుకోవడమే కాదు దిగ్విజయంగా 50 రోజులు కూడా పూర్తి చేసుకుంది. 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర యూనిట్ ఫ్యాన్స్‌కు చిన్న సర్‌ప్రైజ్ ఇచ్చింది. ‘సరిలేరు నీకెవ్వరు’ స్పెసల్ ప్రోమోతో పాటు మైండ్ బ్లాక్ వీడియో సాంగ్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ రెండు వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

"సరిలేరు నీకెవ్వరు " టీమ్ కు థ్యాంక్స్ - మహేష్ బాబు
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఏ కె ఎంటర్ టైన్ మెంట్స్, జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా రూపొందిన "సరిలేరు నీకెవ్వరు " మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 11వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. రికార్డ్ కలెక్షన్స్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతూ 50 రోజులు పూర్తి చేసుకుంది.

VD 10 మూవీ లో విజయ్ స్టన్నింగ్ పెర్ఫార్మెన్స్
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ "ఫైటర్ "(వర్కింగ్ టైటిల్) షూటింగ్ శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. పూరి కనెక్ట్స్, ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై హిందీ, తెలుగు భాషలలో రూపొందుతున్న ఈ మూవీ లో సూపర్ హిట్ మూవీస్ "స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2", "పతి పత్ని ఔర్ వో " ఫేమ్ అనన్య పాండే కథానాయిక.
"ఏ మాయ చేసావె " మూవీ సీక్వెల్ ?
యాక్టర్ , రైటర్ , సింగర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో శింబు ,త్రిష జంటగా "విన్నైతాండి వరువాయా " తమిళ మూవీ, నాగ చైతన్య, సమంత జంటగా రూపొందిన తెలుగు మూవీ "ఏ మాయ చేసావె " ఏక కాలం లో రూపొందాయి. రెండు మూవీస్ ఘనవిజయం సాధించాయి.

మహేష్ బాబు మల్టీ స్టారర్ చేయడం పై మీ అభిప్రాయం..?
సూపర్ మహేష్ బాబు మల్టీ స్టార్టర్ సినిమా 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమా వచ్చి చాలా ఏళ్లే అయిపోయింది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో విక్టరీ వెంకటేష్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు మహేష్. చిన్నోడా.. పెద్దోడా అంటూ ఆడియన్స్ ను అలరించి హిట్ కొట్టారు. ఒక రకంగా ఈ సినిమాఈ తరం హీరోలు మల్టీ స్టారర్ సినిమాలు చేయడానికి పునాది వేసింది అని చెప్పొచ్చు. ఇక ఇప్పుడు మళ్ళీ మహేష్ మల్టీ స్టారర్ పై పలు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

యన్టీఆర్ ‘పెళ్ళి చేసి చూడు’కు 68 ఏళ్ళు
మహానటుడు యన్.టి.రామారావును వెండితెరకు పరిచయం చేసిన ఘనత దిగ్గజ దర్శకులు యల్.వి.ప్రసాద్ ది. యన్టీఆర్ తొలిచిత్రం ‘మనదేశం’(1949)తో మొదలైన వీరి ప్రయాణం... ‘అప్పు చేసి పప్పుకూడు’(1959) వరకు సాగింది. అలా... వీరి కలయికలో వచ్చిన పలు విజయవంతమైన చిత్రాల్లో ‘పెళ్ళి చేసి చూడు’ ఒకటి. యన్.టి.రామారావు, జి.వరలక్ష్మి నాయకానాయికలుగా నటించగా... సావిత్రి, యస్.వి.రంగారావు, యండమూరి జోగారావు, డా.శివరామకృష్ణయ్య, దొరస్వామి, చదలవాడ, పద్మనాభం, సూర్యకాంతం, పుష్పలత తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. అంతేకాదు... దర్శకులు యల్.వి.ప్రసాద్ అతిథి పాత్రలో మెరిసారు కూడా. ఈ…

మహేష్ బాబు చిత్రానికి గోపీసుందర్ బాణీలు?
`మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు` (2015)తో తెలుగునాట స్వరకర్తగా తొలి అడుగేశాడు టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ గోపీసుందర్. ఆపై `భలే భలే మగాడివోయ్`, `ఊపిరి`, `నిన్ను కోరి`, `గీత గోవిందం`, `మజిలీ` తదితర చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం `నిశ్శబ్దం`, `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్` చిత్రాలకి బాణీలు అందిస్తున్నాడు.

దర్శకుడిగా పుష్కరకాలం కెరీర్‌ను పూర్తి చేసుకున్న క్రిష్ జాగర్లమూడి
మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్‌తో పాటు బయోపిక్ సినిమాలకూ కేరాఫ్ అడ్రస్‌గా నిలచిన ఈ జనరేషన్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి. తొలి చిత్రం ‘గమ్యం’ నుంచి గత చిత్రం ‘యన్టీఆర్ మహానాయకుడు` వరకు ఈ టాలెంటెడ్ టెక్నీషియన్ రూపొందించిన సినిమాలన్నీ వేటికవే ప్రత్యేకంగా నిలుస్తాయి. అలా జానర్ ఏదైనా తన ఆలోచనలకి తెర రూపమిస్తూ నవ్య రీతిలో క్రిష్ తెరకెక్కించిన ప్రతీ సినిమా ప్రేక్షకులను అలరించింది. అంతేకాదు... రాశి కంటే వాసికే ప్రాధాన్యమిచ్చే క్రిష్... తన 12 ఏళ్ళ దర్శక ప్రస్థానంలో కేవలం 10 చిత్రాలకే పరిమితమవగా... వాటిలో రెండు హిందీ సినిమాలు, ఒక తమిళ చిత్రం ఉండడం విశేషం.

"రాజ రాజ చోర" మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
విభిన్న కథా చిత్రాలు ఎంపిక చేసుకుని సక్సెస్ లు సాధిస్తున్న శ్రీవిష్ణు మరో డిఫరెంట్ కథా చిత్రం లో నటిస్తున్న విషయం తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై నూతన దర్శకుడు హాసిత్ గోలి దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ " రాజ రాజ చోర" మూవీ రూపొందుతుంది. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు.

మేలో వరుసగా మూడు వారాల పాటు థమన్ సందడి
వరుస విజయాలతో ముందుకు సాగుతున్నాడు యువ సంగీత సంచలనం థమన్. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన `అల వైకుంఠపురములో`తో కెరీర్ బెస్ట్ హిట్ ని అందుకున్న థమన్.. ఈ వేసవిలో వరుస చిత్రాలతో సందడి చేయనున్నాడు. మరీ ముఖ్యంగా.. మే నెలలో వరుసగా మూడు వారాల పాటు క్రేజీ ప్రాజెక్ట్స్ తో పలకరించనున్నాడు.

`పింక్` రీమేక్ ఫస్ట్ లుక్ అప్ డేట్
హిందీనాట ఘనవిజయం సాధించిన `పింక్`.. తెలుగులో రీమేక్ అవుతున్న విషయం విదితమే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ-ఎంట్రీ మూవీగా తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. ప్రస్తుతం మెరుపు వేగంతో చిత్రీకరణ జరుపుకుంటోంది. `ఎంసీఏ` ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని `దిల్` రాజు, బోనీకపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

'భక్తవత్సలం నాయుడుగా' మోహన్ బాబు
సినిమా హిట్లు ప్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు తమిళ్ స్టార్ హీరో సూర్య. ఇటీవలే 'కాప్పాన్' తెలుగులో 'బందోబస్త్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా.. అది బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇప్పుడు సుధా కొంగర దర్శకత్వంలో సూర్య మరో కొత్త సినిమాలో నటిస్తున్నాడు. తమిళ్ లో ‘సూరరై పోట్రు’ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా!’ టైటిల్‌తో విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇటీవలే ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా.. ఇప్పుడు తాజాగా మోహన్ బాబు ఫస్ట్ లుక్స్ ను రిలీజ్ చేశారు.

PSPK 26 మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్
సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణ సారథ్యం లో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న "వకీల్ సాబ్ "(వర్కింగ్ టైటిల్ ) మూవీ మే 15 వ తేదీ రిలీజ్ కానుంది. బాలీవుడ్ హిట్ మూవీ "పింక్ " కు రీమేక్ గా రూపొందుతున్న ఈ మూవీ లో అంజలి, నివేత థామస్, అనన్య ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.

'ఉప్పెన' నుండి రాబోతున్న మొదటి పాట..!
సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఉప్పెన సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక మరోపక్క చిన్నగా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది చిత్రయూనిట్. ఇటీవలే వైష్ణవ్, ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్ లను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇప్పుడు తాజాగా మరో అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా నుండి మొదటి పాటను రిలీజ్ చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. నీ కన్ను నీలి సముద్రం అంటూ సాగే మొదటి పాట మార్చి 2న సాయంత్రం గం.4.05ని.లకు విడుదల అవ్వనుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిథిగా మెగా స్టార్
విశ్వంత్, సంజయ్ రావు, నిత్యా శెట్టి, బ్రహ్మాజీ ప్రధాన పాత్రధారులుగా.. చెందు ముద్దు దర్శకుడిగా పరిచయం అవుతూ వస్తున్న సినిమా 'ఓ పిట్టకథ'. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటూనే..మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేశారు చిత్రయూనిట్. ఇప్పటీకే ఈ సినిమా నుండి ప్రీ-టీజర్, టీజర్, మొదటి పాటను రిలీజ్ చేశారు. ఇక తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికను ఖరారు చేశారు. మార్చి 1న హైదరాబాద్‌లో ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని గ్రాండ్‌గా చేయబోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రానున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

'కార్తికేయ2' ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్
నిఖిల్, చందు మెుండేటి కాంబినేషన్ లో వచ్చిన 'కార్తికేయ' సినిమా ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈ సినిమా సీక్వెల్ కూడా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఇప్పటివరకూ పట్టాలెక్కలేదు. అయితే తాజాగా ఈ సినిమా ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. పీపుల్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ అర్ట్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాను "కార్తికేయ2" మార్చి 2 న తిరుమల తిరుపతి లో పూజాకార్యక్రమాలతో ప్రారంభించనున్నారు.

పాయల్ న్యూ మూవీ టైటిల్ &ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్
సెన్సేషనల్ హిట్ "RX 100" మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన పాయల్ రాజ్ పుత్ తన అందం , అభినయం తో యూత్ ను ఆకట్టుకున్నారు. పాయల్ గ్లామరస్ రోల్ లో నటించిన "RDX లవ్ " మూవీ నిరాశ పరచినా "వెంకీ మామ ", "డిస్కో రాజా " మూవీస్ లో తన ట్యాలెంట్ నిరూపించుకున్నారు. గ్లామరస్ రోల్స్ కాకుండా నటనకు ప్రాధాన్య మున్న మూవీస్ ను పాయల్ ఎంపిక చేసుకుంటున్నారు.

విక్రమ్ 'కోబ్రా' ఫస్ట్ లుక్ రిలీజ్
విభిన్నమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్ విక్రమ్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటి వరకు రెండు, మూడు గెటప్పుల్లో మాత్రమే అలరించిన విక్రమ్ ఇప్పుడు ఏకంగా ఒకటి కాదు రెండు కాదు ఈసారి ఏకంగా 20కు పైగా గెటప్స్ తో వస్తున్నాడు. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో విక్రమ్ 'కోబ్రా' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. సగానికి పైగా ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే టైటిల్ పోస్టర్ తోనే ఇంట్రెస్ట్ ను పెంచగా.. ఇక తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.