క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలపై ప్రేక్షకులకు ఎప్పుడూ ఇంట్రెస్ట్ ఉంటుంది. కాస్త కంటెంట్ ఉండి.. థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఉంటే బొమ్మ హిట్టే. ఇప్పుడు అదే క్రైమ్ జోనర్ ను నమ్ముకొని మన ముందుకు వచ్చేశాడు ‘ఫలక్‌నుమా దాస్’ ఫేమ్ విశ్వక్ సేన్. విశ్వక్ సేన్, రుహానీ శర్మ హీరో హీరోయిన్లు గా నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి నిర్మించిన సినిమా ‘హిట్’. ఈ సినిమాకు మొదటినుండీ పాజిటివ్ బజ్ ఉంది. పోస్టర్ల దగ్గరనుండి టీజర్, ట్రయిలర్ వరకూ అన్నీ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఇటీవల స్నీక్ పీక్ అంటూ సినిమాలోని కీలక ఘట్టాన్ని ముందుగానే చెప్పేసి ఆ తరవాత ఏం జరుగుతుందనే ఉత్కంఠను క్రియేట్ చేసి ప్రేక్షకుల్నీ థీయేటర్‌కు రప్పించే కొత్త పంథాలో ఈ సినిమా ప్రమోషన్‌ను నిర్వహించారు. మరి ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ ‘హిట్’ తో విశ్వక్ సేన్ మరో ‘హిట్’ కొట్టాడో లేదో తెలియాలంటే పబ్లిక్ ఒపీనియన్ ఎలా ఉందో చూడాల్సిందే..
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: