`ఛలో` (2018)తో దర్శకుడిగా తొలి అడుగేసిన వెంకీ కుడుముల.. మొదటి ప్రయత్నంలోనే మంచి విజయాన్ని ఒడిసిపట్టుకున్నాడు. ఇక రెండో చిత్రంగా స్వల్ప విరామం తరువాత వచ్చిన `భీష్మ` కూడా బ్లాక్ బస్టర్ టాక్ తో వసూళ్ళ వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో… ఇప్పుడు అందరి దృష్టి కూడా వెంకీ థర్డ్ వెంచర్ పైనే ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




వినిపిస్తున్న కథనాల ప్రకారం… వెంకీ కుడుముల తదుపరి చిత్రం ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ లో ఉంటుందని తెలిసింది. అంతేకాదు… మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఉంటుందని ఫిల్మ్ నగర్ సర్కిల్ టాక్. ప్రస్తుతం కథాచర్చలు జరుగుతున్నాయని… మరి కొద్ది రోజుల్లో ఈ సినిమాకి సంబంధించి ఫుల్ క్లారిటీ వస్తుందని చెప్పుకుంటున్నారు. మరి… మూడో సినిమాతోనూ వెంకీ సక్సెస్ అందుకుంటాడేమో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: