పవన్ సినిమాలో అంజలి ఉన్నట్టే..!

Actress Anjali To Act Alongside Pawan Kalyan In Pink Telugu Remake

పవన్ కళ్యాణ్ ఓ వైపు రాజకీయాలు.. మరో వైపు సినిమాలు రెండింటినీ చాలా బ్యాలన్స్ చేస్తూ వస్తున్నాడు. షూటింగ్ పనులు చూసుకుంటూనే మరోపక్క రాజకీయాలను కూడా చూసుకుంటున్నారు. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ లో నటిస్తున్నాడు. వేణు శ్రీ‌రామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. వచ్చే నెలకల్లా ఈ సినిమా షూటింగ్ ను ముగించి.. మే 15వ తేదీన రిలీజ్ చేయనున్నారు. ఉగాది రోజున ఈ సినిమా టైటిల్ ను ప్రకటించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈ సినిమాలో నటించే హీరోయిన్ల విషయంపై ఇప్పటివరకూ క్లారిటీ రాలేదు. అయితే నివేదా థామస్, అంజలి నటిస్తున్నట్టు వార్తలు ఆ మధ్య వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. నివేదా థామస్ అయితే ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా ఎంపిక అయింది. కానీ అంజలి విషయంలో మాత్రం చిత్రయూనిట్ కూడా ఏం క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఇప్పుడు ఈ సినిమాలో అంజలి ఉన్నట్టే అనిపిస్తుంది. ఎందుకంటే… ఈ సినిమాలో ఫస్ట్ సింగిల్ గురించి గతకొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్న థమన్ రీసెంట్ గా ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే కదా. ‘పవన్ కు అతిపెద్ద అభిమానినైన నేను కూడా పీ.ఎస్.పీకే 26 ఫస్ట్ సింగిల్ విడుదల కోసం ఎదురు చూడలేకపోతున్నాను. పీ.ఎస్.పీకే 26 కోసం మా బృందం మొత్తం ఎంతో కష్టపడి పనిచేస్తున్నాం. ఇది మాకే కాదు అందరికీ ఎంత ముఖ్యమో బాగా తెలుసు. పవన్‌కల్యాణ్‌ చిత్రానికి ఉత్తమ సంగీతాన్ని అందించేందుకు మేము కృషి చేస్తున్నాం. లవ్‌ యూ ఆల్‌. పీ.ఎస్.పీకే 26 ఫస్ట్ సింగిల్ త్వరలో రానుంది” అని ట్వీట్‌ చేశారు. అంతేకాదు పవన్ ప్రొఫైల్ పిక్ పెట్టి.. ఫస్ట్ సింగిల్ త్వరలో అని మరో ట్వీట్ కూడా చేసాడు. ఇక ఇదే ట్వీట్ కు అంజలి కూడా స్పందించి… ఆ హ్యాష్ ట్యాగ్ ను పెట్టి ఓ చిన్న డ్యాన్సింగ్ ఎమోజీ పెట్టింది. దీనితో ఈ సినిమాలో అంజలి కూడా వున్నట్టే అని కన్ఫామ్ అవుతున్నారు. మరి చూద్దాం అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ..


ఇక ఈ సినిమాలో నివేదా థామస్ ఒక కీలక పాత్రలో నటిస్తుండగా.. దిల్ రాజు, బోని కపూర్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. కాగా అమితాబ్‌, తాప్సీ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కిన బాలీవుడ్ హిట్ చిత్రం ‘పింక్’ ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఇదే సినిమాను త‌మిళంలో ‘నెర్కొండ పార్వాయి’ అనే టైటిల్‌తో.. అజిత్ ప్ర‌ధాన పాత్ర‌లో తమిళ్ లో రీమేక్ చేయగా అక్కడ కూడా హిట్ కొట్టింది. మరి తెలుగులో ఎంత వరకూ హిట్ కొడుతుందో చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + 5 =