మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వరుణ్ బాక్సర్ గా నటించనున్నాడు. దీనిలో భాగంగానే వరుణ్ ఈ సినిమా కోసం ఒలింపిక్ విన్నర్ టోని జెఫ్రీస్ పర్యవేక్షణలో ట్రైనింగ్ తీసుకున్నాడు. ఇక రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేశారు. వైజాగ్లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటున్నట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమాలో మొదటిగా వరుణ్ కు తల్లిగా రమ్యకృష్ణ నటిస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు రమ్యకృష్ణ ప్లేస్ లో నదియా వచ్చినట్టు తెలుస్తుంది. నదియా ఈ సినిమాలో వరుణ్ కు తల్లిగా నటిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై క్లారిటీ రావాలంటే కోదిరోజులు వెయిట్ చేయాల్సిందే. కాగా గతంలో నదియా వరుణ్ బాబాయ్ పవన్ కళ్యాణ్ కు అత్త గా నటించిన సంగతి తెలిసిందే.
కాగా అల్లు అరవింద్ సమర్పణలో సిద్దు ముద్ద మరియు అల్లు వెంకటేష్ కలిసి నిర్మిస్తున్నారు. ఇక థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు జార్జ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. ఇక హీరోయిన్ గా ప్రముఖ బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్ కుమార్తె సాయి మంజ్రేకర్ కథానాయికగా నటిస్తుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ ఆగాల్సిందే. ఇక జులై 30, 2020 న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: