కమెడియన్ నుండి విలన్ గా..!

Telugu Film Actor Sunil Turns Comedian To Villain,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Comedian turned hero Sunil now turns villain,Sunil Turns Villain for Colour Photo,Hero Sunil Turns Villain in Colour Photo Telugu Movie,Colour Photo,Colour Photo Movie,Colour Photo Telugu Movie,Sunil,Actor Sunil As Villain In Colour Photo Movie

కమెడియన్ గా తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టి.. ఎన్నో సినిమాల్లో తన కామెడీతో నవ్వించి.. హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే హిట్ కొట్టిన ‘అందాల రాముడు’ సునీల్. అయితే కమెడియన్ గా ఎంత సక్సెస్ అయ్యాడో.. హీరోగా మాత్రం అవ్వలేకపోయాడు అని చెప్పొచ్చు. దీనితో కొంత గ్యాప్ తీసుకున్న సునీల్ మళ్ళీ ఈ మధ్యనే తెరపైకి వస్తున్నాడు. ఇక ఇటీవలే ‘అల వైకుంఠపురములో’, ‘డిస్కో రాజా’ సినిమాల్లో నటించిన సునీల్ ఇప్పుడు మరో డిఫరెంట్ పాత్రతో వస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈరోజు ప్రముఖ కమెడియన్ సునీల్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘కలర్ ఫొటో’ సినిమాలో ఆయన లుక్‌ను టీం రిలీజ్ చేసింది. ఎస్సై రామరాజుగా సునీల్ విలన్ పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. జీపులో స్టైల్‌గా కూర్చుని సీరియస్‌గా కనిపిస్తున్న సునీల్ తన లుక్‌తో ఆకట్టుకుంటున్నారు. ఇక డిస్కో రాజా సినిమాలో విలన్ గా తన మార్క్ ను చూపించాడు. ఆయనలో ఈ కోణం కూడా ఉందని ఆడియన్స్‌కు చూపించాడు.ఈ సినిమాలో ఎలా నటిస్తాడో చూడాలి.

కాగా విజేత, పేపర్‌ బాయ్‌, మజిలీ, డియర్‌ కామ్రేడ్‌, ప్రతిరోజూ పండగే సినిమాల్లో తనదైన నటనతో ఆకట్టుకున్న కమెడియన్. సుహాస్‌ ఈ సినిమాతో హీరోగా పరిచయం కాబోతున్నారు. నటుడు సందీప్ రాజ్ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాను హృదయ కాలేయం సినిమాకు దర్శకత్వం వహించిన స్టీవెన్‌ శంకర్‌ అలియాస్‌ సాయి రాజేష్, లౌక్యా ఎంటర్‌టైన్మెంట్స్‌తో కలిసి నిర్మిస్తున్నాడు. సుహాస్‌కు జోడిగా ఛాందిని చౌదరి నటిస్తున్నారు. ఈ సినిమాకు కీరవాణి తనయుడు కాళ భైరవ సంగీత అందిస్తున్నాడు. మరి యూట్యూబ్‌చానల్‌ సుహాస్, సందీప్‌లు కలిసి చేశారు. ఇప్పుడు ఈ కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కుతుండటంతో ఈ మూవీపై ఆసక్తి నెలకొంది. చూద్దాం మరి ఈ సినిమాతో ఎంత సక్సెస్ అవుతారో..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − eleven =