వరుస సినిమాలతో నాగశౌర్య బిజీ..!

Naga Shaurya Gets Busy With Handful Of New Movie Offers

యంగ్ హీరో నాగశౌర్య వరుసపెట్టి సినిమాలను లైన్ లో పెట్టేస్తున్నాడు. రీసెంట్ గా ‘అశ్వ‌థ్థామ‌’ సినిమాతో వచ్చిన నాగశౌర్య ఆ సినిమా అయిపోయిన వెంటనే మరో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ తెరకెక్కుతుంది. ఇటీవలే ఈ సినిమా కూడా ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పుడు మరో సినిమాను లైన్లోకి తెచ్చేసాడు. నాగశౌర్య హీరోగా ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ ప్రొడక్షన్ నెం 4గా కె.పి.రాజేంద్ర దర్శకత్వంలో మహేష్ ఎస్‌.కోనేరు నిర్మిస్తున్న కొత్త చిత్రం ఈ రోజు రామానాయుడు స్టూడియోస్ లో పూజా కార్య‌క్ర‌మాల‌తో ఘ‌నంగా ప్రారంభమైంది. ముహూర్తపు స‌న్నివేశానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు క్లాప్ కొట్టగా హీరో కల్యాణ్ రామ్ కెమెరా స్విచ్చాన్ చేశారు. దర్శకులు హరీష్ శంకర్, వి.ఐ.ఆనంద్ గౌరవ దర్శకత్వం వహించారు. అనంత‌రం హీరో కల్యాణ్ రామ్ స్క్రిప్ట్‌ను ద‌ర్శ‌కుడు కె.పి.రాజేంద్రకి అంద‌జేశారు. ఈ సందర్భంగా

నిర్మాత మహేష్ ఎస్‌. కోనేరు మాట్లాడుతూ – ‘నాగశౌర్య గారి కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అండ్ మోస్ట్ ప్రస్టేజియస్ ప్రాజెక్ట్ గా ఉండబోతుందని చెప్పడానికి చాలా ఆనందంగా ఉంది అన్నారు. మా దర్శకుడు రాజా మంచి ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్ టైనర్ ని రెడీ చేశారు. మార్చిలో షూటింగ్ ప్రారంభించి ఈ ఏడాది సెకండ్ హాఫ్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలను త్వరలోనే తెలియజేస్తాం. హీరో కళ్యాణ్ రామ్ గారికి, దిల్ రాజు గారికి, హరీష్ శంకర్ గారికి విచ్చేసిన ఇతర సినిమా పెద్దలకు, మీడియా వారికి థ్యాంక్స్.’ అన్నారు.

దర్శకుడు కె.పి.రాజేంద్ర మాట్లాడుతూ – ‘ప్రారంభోత్సవానికి విచ్చేసిన కళ్యాణ్ రామ్ గారికి, దిల్ రాజు గారికి, హరీష్ శంకర్ గారికి థ్యాంక్స్. మంచి ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్. ఈ సినిమాలో స‌రికొత్త నాగశౌర్యని చూస్తారు. మార్చిలో ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేస్తున్నాం. మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి’ అన్నారు.

నాగశౌర్య హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి కెెమెరా: స‌మీర్ రెడ్డి, ఎడిటింగ్‌: ఛోటా కె.ప్ర‌సాద్‌, మ్యూజిక్‌: సాగ‌ర్ మ‌హ‌తి, ఆర్ట్‌: కిర‌ణ్ కుమార్ మ‌న్నె, క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: కె.పి.రాజేంద్ర‌.

మొత్తానికి వరుస పరాజయాలతో సతమతమవుతున్న నాగశౌర్యకు ‘అశ్వ‌థ్థామ‌’ సినిమా మంచి రిలీఫ్ ఇచ్చింది. దీనితో వరుస సినిమాలను లైన్ లో పెట్టాడు నాగశౌర్య. మరి చూద్దాం ఈ సినిమాలు ఎంత వరకూ సక్సెస్ తెచ్చిపెడతాయో.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.