పిరియాడిక్ ఫిల్మ్ లో సాయితేజ్?

tollywood-most-happening-hero-sai-tej-to-act-in-a-periodic-movie

`చిత్ర ల‌హ‌రి`, `ప్ర‌తి రోజూ పండ‌గే` విజ‌యాల‌తో మ‌ళ్ళీ స‌క్సెస్ ట్రాక్ లోకి వ‌చ్చేసిన `సుప్రీమ్` హీరో సాయితేజ్… ప్ర‌స్తుతం `సోలో బ్ర‌తుకే సో బెట‌ర్` చేస్తున్నాడు. నూత‌న ద‌ర్శ‌కుడు సుబ్బు రూపొందిస్తున్న ఈ యూత్ ఫుల్ ఎంట‌ర్ టైన‌ర్ మే 1న రిలీజ్ కానుంది. కాగా, ఆ లోపే త‌న నెక్స్ట్ వెంచ‌ర్ ని ప‌ట్టాలెక్కించ‌నున్నాడు తేజ్. కాగా, ఇదో పిరియాడిక్ ఫిల్మ్ అని తెలిసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివ‌రాల్లోకి వెళితే… `బిందాస్, ర‌గ‌డ‌, దూసుకెళ్తా` చిత్రాల ద‌ర్శ‌కుడు వీరు పోట్ల ఇటీవ‌ల సాయితేజ్ ని సంప్ర‌దించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన క‌థ చెప్పాడు. శ్రీ‌కృష్ణ‌దేవ‌రాయ‌ల కాలం నాటి వాతావ‌ర‌ణాన్ని ప్ర‌తిబింబిస్తూ పిరియాడిక్ ట‌చ్ తో వీరు తీర్చిదిద్దిన ఈ స్క్రిప్ట్… సాయితేజ్ ని ఎంత‌గానో ఇంప్రెస్ చేసిందట‌. దీంతో, ఈ చిత్రాన్ని త‌న త‌దుప‌రి చిత్రంగా సెట్ చేసుకున్నాడ‌ట తేజ్. దాదాపు రూ.40 కోట్ల బ‌డ్జెట్ తో తెర‌కెక్క‌నున్న ఈ సినిమాని అనిల్ సుంక‌ర నిర్మించ‌నున్నాడ‌ట‌. మార్చి నెలాఖ‌రు నుంచి సెట్స్ పైకి వెళ్ళ‌నున్న ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డి కానున్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.