హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘మోసగాళ్ళు’. అతిపెద్ద ఐటీ కుంభకోణాల్లో ఒకటిగా నిలిచిన స్కామ్ వెనుక ఉన్న మిస్టరీని ఛేదించే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ లాస్ ఏంజెల్స్‌లో జరుగుతోంది. ఇక ఈ సినిమా నుండి ఇప్పటిక విష్ణు, కాజల్ ఫస్ట్ లుక్ పోస్టర్లు విడుదల చేయగా.. అవి ఆకట్టుకున్నాయి. ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుండి సునీల్ శెట్టి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ లుక్ లో పోలీస్ యూనిఫామ్, తలకు సిక్కులు ధరించే ‘టర్బన్’ తో సునీల్ శెట్టి ఒక సిన్సియర్ పోలీసాఫీసర్ గా కనిపిస్తున్నారు. ఈ సినిమాలో ఏసీపీ కుమార్ పాత్ర పోషిస్తున్నాడు సునీల్ శెట్టి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నవదీప్, నవీన్ చంద్ర, రుహాని సింగ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని ఏవీఏ ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తోంది. ఈ సినిమాను వేసవిలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
COMING SOON #Mosagallu@iVishnuManchu @MsKajalAgarwal @pnavdeep26 @Naveenc212 @TheLeapMan @ruhisingh11 pic.twitter.com/KuAHLshI4b
— Suniel Shetty (@SunielVShetty) February 29, 2020
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: