మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్‌తో పాటు బయోపిక్ సినిమాలకూ కేరాఫ్ అడ్రస్‌గా నిలచిన ఈ జనరేషన్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి. తొలి చిత్రం ‘గమ్యం’ నుంచి గత చిత్రం ‘యన్టీఆర్ మహానాయకుడు` వరకు ఈ టాలెంటెడ్ టెక్నీషియన్ రూపొందించిన సినిమాలన్నీ వేటికవే ప్రత్యేకంగా నిలుస్తాయి. అలా జానర్ ఏదైనా తన ఆలోచనలకి తెర రూపమిస్తూ నవ్య రీతిలో క్రిష్ తెరకెక్కించిన ప్రతీ సినిమా ప్రేక్షకులను అలరించింది. అంతేకాదు… రాశి కంటే వాసికే ప్రాధాన్యమిచ్చే క్రిష్… తన 12 ఏళ్ళ దర్శక ప్రస్థానంలో కేవలం 10 చిత్రాలకే పరిమితమవగా… వాటిలో రెండు హిందీ సినిమాలు, ఒక తమిళ చిత్రం ఉండడం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“ఇద్దరు వేర్వేరు భావాలున్న వ్యక్తులు కలసి ప్రయాణం సాగిస్తే ఎలా ఉంటుంది?” అన్న కాన్సెప్ట్‌తో రూపొందించిన మొదటి చిత్రం ‘గమ్యం’ మొదలు… ‘వేదం’, ‘వానం’(తమిళం), ‘కృష్ణం వందే జగద్గురుమ్’, ‘గబ్బర్ ఈజ్ బ్యాక్’(హిందీ), ‘కంచె’, ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ వరకు ప్రతీ సినిమా… క్రిష్‌లోని సృజనాత్మకతకు అద్దం పట్టింది. ఇక గత ఏడాది ఆరంభంలో విడుదలైన మహానటుడు యన్టీఆర్ బయోపిక్ మూవీస్ ‘యన్టీఆర్: కథానాయకుడు’, ‘యన్టీఆర్: మహానాయకుడు’తో పాటు ‘మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ’ కమర్షియల్‌గా సక్సెస్‌ను ఇవ్వలేకపోయినా… దర్శకుడిగా క్రిష్‌ను మరో స్థాయికి తీసుకువెళ్ళగలిగాయి. మొత్తమ్మీద… పరిమిత చిత్రాలతో అపరిమిత అభిమానగణాన్ని సంపాదించుకున్నారు ఈ టాలెంటెడ్ డైరెక్టర్.
ఇంతకీ… ఇప్పుడు క్రిష్ ప్రస్థానంతో ఈ ప్రస్తావన అంతా ఎందుకంటే… సరిగ్గా ఇదే ఫిబ్రవరి 29న (లీప్ ఇయర్) 12 ఏళ్ళ క్రితం తన తొలి చిత్రం `గమ్యం`(2008) విడుదలైంది. అంటే… నేటితో దర్శకుడిగా క్రిష్ పుష్కర కాలం పూర్తి చేసుకున్నారన్నమాట. మొత్తానికి.. నాలుగేళ్ళకు ఒకమారు వచ్చే అరుదైన తేదిన ఈ అరుదైన దర్శకుడి తొలి చిత్రం విడుదలవడం విశేషం. ఈ సందర్భంగా… మరోసారి క్రిష్‌కి శుభాభినందనలు తెలియజేస్తూ… ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో తెరకెక్కిస్తున్న పిరియాడిక్ మూవీతో క్రిష్ మళ్ళీ విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షిద్దాం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: