‘భక్తవత్సలం నాయుడుగా’ మోహన్ బాబు

సినిమా హిట్లు ప్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు తమిళ్ స్టార్ హీరో సూర్య. ఇటీవలే ‘కాప్పాన్’ తెలుగులో ‘బందోబస్త్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా.. అది బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇప్పుడు సుధా కొంగర దర్శకత్వంలో సూర్య మరో కొత్త సినిమాలో నటిస్తున్నాడు. తమిళ్ లో ‘సూరరై పోట్రు’ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా!’ టైటిల్‌తో విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇటీవలే ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా.. ఇప్పుడు తాజాగా మోహన్ బాబు ఫస్ట్ లుక్స్ ను రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వాటిలో ఆయన సీనియర్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ గా డైనమిక్ లుక్స్ తో కనిపిస్తున్నారు. సినిమాలో ఆయన పాత్రపేరు భక్తవత్సలం నాయుడు. ఎయిర్ ఫోర్స్ లో తెలుగు ప్రాంతానికి చెందిన ఉన్నతస్థాయి అధికారిగా ఆయన కనిపించనున్నారు. మోహన్ బాబు అసలు పేరు భక్తవత్సలం నాయుడు అనే విషయం మనకు తెలిసిందే. సినిమాలో ఆయనది సూర్యకు మార్గనిర్దేశకునిగా పాత్ర. తమిళ వెర్షన్ కోసం తన పాత్రకు ఆయన స్వయంగా డబ్బింగ్ చెప్పారు. మోహన్ బాబుపై చిత్రీకరించిన సన్నివేశాలు సినిమాలో ప్రధాన ఆకర్షణ అవుతాయనీ, ఆయన పాత్రను అభిమానులు బాగా లైక్ చేస్తారనీ చిత్ర బృందం చెబుతోంది.


సామాన్యులకు సైతం విమాన యానాన్ని సులభతరం చేయడానికి ఎయిర్ దక్కన్ అనే ఎయిర్ లైన్ సంస్థను స్థాపించిన కెప్టెన్ జీఆర్ గోపీనాథ్ జీవితం ఆధారంగా ‘ఆకాశం నీ హద్దురా’ రూపొందుతోంది. ఈ సినిమాలో సూర్య జోడీగా అపర్ణా బాలమురళి నటిస్తున్నారు. 2డి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య స్వయంగా నిర్మిస్తోన్న ఈ సినిమా బాలీవుడ్ నిర్మాత గునీత్ మోంగా కు దక్షిణాదిన తొలి సినిమా కావడం గమనార్హం. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి నికేత్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. 2020 ఏప్రిల్ 9న చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.