ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిథిగా మెగా స్టార్

Megastar Chiranjeevi Graces As Chief Guest To O Pitta Katha Pre Release Event,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,O Pitta Katha,O Pitta Katha Movie,O Pitta Katha Telugu Movie,O Pitta Katha Movie Updates,O Pitta Katha Telugu Movie Latest News,O Pitta Katha Pre Release Event,O Pitta Katha Telugu Movie Pre Release Event Date Locked

విశ్వంత్, సంజయ్ రావు, నిత్యా శెట్టి, బ్రహ్మాజీ ప్రధాన పాత్రధారులుగా.. చెందు ముద్దు దర్శకుడిగా పరిచయం అవుతూ వస్తున్న సినిమా ‘ఓ పిట్టకథ’. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటూనే..మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేశారు చిత్రయూనిట్. ఇప్పటీకే ఈ సినిమా నుండి ప్రీ-టీజర్, టీజర్, మొదటి పాటను రిలీజ్ చేశారు. ఇక తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికను ఖరారు చేశారు. మార్చి 1న హైదరాబాద్‌లో ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని గ్రాండ్‌గా చేయబోతున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా రానున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇంకా ఈ చిత్రంలో, శ్రీనివాస్‌ భోగిరెడ్డి, భద్రాజీ, రమణ చల్కపల్లి, సిరిశ్రీ, సూర్య ఆకొండి తదితరులు నటిస్తున్నారు. భ‌వ్య క్రియేష‌న్స్ పతాకంపై వి.ఆనందప్రసాద్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రవీణ్‌ లక్కరాజు సంగీతమందిస్తున్న ఈ సినిమా మార్చి 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.