పాయల్ న్యూ మూవీ టైటిల్ &ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్

Payal Rajput New Movie Title And First Look Release Date Is Out

సెన్సేషనల్ హిట్ “RX 100” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన పాయల్ రాజ్ పుత్ తన అందం , అభినయం తో యూత్ ను ఆకట్టుకున్నారు. పాయల్ గ్లామరస్ రోల్ లో నటించిన “RDX లవ్ ” మూవీ నిరాశ పరచినా “వెంకీ మామ “, “డిస్కో రాజా ” మూవీస్ లో తన ట్యాలెంట్ నిరూపించుకున్నారు. గ్లామరస్ రోల్స్ కాకుండా నటనకు ప్రాధాన్య మున్న మూవీస్ ను పాయల్ ఎంపిక చేసుకుంటున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కైవల్య క్రియేషన్స్ బ్యానర్ పై ప్రాణదీప్ దర్శకత్వంలో పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్ర లో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మిస్టరీ డ్రామా రూపొందుతుంది. ఈ మూవీ లో పాయల్ IPS ఆఫీసర్ గా నటిస్తున్నారు. పాయల్ నటిస్తున్న ఈ కొత్త మూవీ టైటిల్ , పాయల్ ఫస్ట్ లుక్ పోస్టర్ మార్చి 4వ తేదీ రిలీజ్ కానున్నాయి. దర్శకుడు ప్రాణదీప్ మాట్లాడుతూ .. ఈ మూవీ ఒక గేమ్ ఛేంజింగ్ మూవీ అని, స్టోరీ, స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటాయని, కొత్త పాయల్ ను చూస్తారని, పాయల్ ఇమేజ్ ను ఈ మూవీ ఛేంజ్ చేస్తుందని, ఒక షూటింగ్ షెడ్యూల్ పూర్తి అయ్యిందని, ఫైనల్ షూటింగ్ షెడ్యూల్ మార్చి మొదటి వారంలో ప్రారంభం అయ్యి నెలాఖరువరకు జరుగుతుందని, ఈ షెడ్యూల్ తో షూటింగ్ కంప్లీట్ అవుతుందని సమ్మర్ లో రిలీజ్ కానుందని తెలిపారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + 16 =