విక్రమ్ ‘కోబ్రా’ ఫస్ట్ లుక్ రిలీజ్

Chiyaan Vikram Cobra Movie First Look Is Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Chiyaan Vikram,Cobra,Cobra Movie,Cobra Telugu Movie,Cobra Movie Updates,Cobra Telugu Movie Latest News,Cobra First Look,Cobra Telugu Movie First Look,Cobra Movie First Look

విభిన్నమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్ విక్రమ్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటి వరకు రెండు, మూడు గెటప్పుల్లో మాత్రమే అలరించిన విక్రమ్ ఇప్పుడు ఏకంగా ఒకటి కాదు రెండు కాదు ఈసారి ఏకంగా 20కు పైగా గెటప్స్ తో వస్తున్నాడు. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో విక్రమ్ ‘కోబ్రా’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. సగానికి పైగా ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే టైటిల్ పోస్టర్ తోనే ఇంట్రెస్ట్ ను పెంచగా.. ఇక తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. వయకామ్ .. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి, ఎ.ఆర్.రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరి అపరిచితుడు అనంతరం ఎన్నో సినిమాలు చేసిన విక్రమ్ బాక్స్ ఆఫీస్ వద్ద అనుకున్నంతగా సక్సెస్ అందుకోలేకపోయాడు. అయితే ఈ సినిమాతో ఎలాగైనా సౌత్ లో బిగెస్ట్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. మరి చూద్దాం ఎంతవరకూ హిట్ కొడతాడో..!

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − 2 =