13వ తేదీ రిలీజ్ కానున్న 6 చిత్రాలు

2020 March 13 Telugu Movies,Latest Telugu Movies News,Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,Telugu Movies Grand Release on March 13,Upcoming Telugu Movies March 2020,Six Telugu Movies Grand Release on March 13,Tollywood Movies Releasing this Week,Telugu Movies Releasing in March 2020

ప్రతీ శుక్రవారం రిలీజయ్యే మూవీస్ విశేషాలు తెలుసుకుంటున్నాం కదా. ఇప్పుడు 13 వ తేదీ శుక్రవారం రిలీజయ్యే 6 సినిమాల గురించి తెలుసుకుందాం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

1. శివన్ : ఎస్ ఆర్ సినీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై శివన్ దర్శకత్వంలో సాయి తేజ కల్వకోట, తరుణిక సింగ్ జంటగా రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ “శివన్” మూవీ రూపొందింది. సిద్ధార్ధ్ సదాశివుని సంగీతం అందించారు. మ్యాంగో మ్యూజిక్ ద్వారా రిలీజ్ అయిన ఆడియో ప్రేక్షకులను ఆకట్టుకుంది. టీజర్, ట్రైలర్, సాంగ్స్ మూవీ పై అంచనాలను పెంచాయి.

2. యురేక :లక్ష్మీప్రసాద్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కార్తీక్ ఆనంద్ దర్శకత్వంలో కార్తీక్ ఆనంద్, షాలిని జంటగా కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ “యురేక ” మూవీ రూపొందింది. బ్రహ్మాజీ, రఘుబాబు ముఖ్య పాత్రలలో నటించారు. నరేష్ కుమరన్ సంగీతం అందించారు.

3.ప్రేమ పిపాసి : రాహుల్ భాయ్ మీడియా, దుర్గా శ్రీ ఫిల్మ్స్, పి ఎస్ రామకృష్ణ సంయుక్తంగా నిర్మించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ “ప్రేమ పిపాసి ” మూవీ కి మురళి రామస్వామి దర్శకుడు. GPS , కపిలాక్షి మల్హోత్రా, సోనాక్షి వర్మ ప్రధాన పాత్రలలో నటించారు. ఆర్, ఎస్ సంగీతం అందించారు.

4. 302:డ్రీమ్ ట్రీ మీడియా బ్యానర్ పై కార్తికేయ మిరియాల దర్శకత్వంలో భవికా దేశాయ్ ప్రధాన పాత్రలో క్రైమ్, సస్పెన్స్, హారర్, కామెడీ అంశాలతో “302 ” మూవీ రూపొందింది. వెన్నెల కిషోర్, రవి వర్మ, విజయ సాయి, తాగుబోతు రమేష్ ముఖ్య పాత్రలలో నటించారు. రఘురామ్ సంగీతం అందించారు.


5 . బగ్గిడి గోపాల్ : మాస్టర్ చేతన్ రెడ్డి , మాస్టర్ నితిన్ రెడ్డి సమర్పణ లో బగ్గిడి ఆర్ట్ మూవీస్ బ్యానర్ పై రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన “బగ్గిడి గోపాల్” మూవీ కి అర్జున్ కుమార్ దర్శకుడు. బగ్గిడి గోపాల్ నిజ జీవిత సంఘటనలతో రూపొందిన ఈ మూవీ లో రమాకాంత్, సిరిచందన, సుమన్, కవిత, ప్రభావతి ముఖ్య తారాగణం. జయసూర్య బి సంగీతం అందించారు.

6 . అర్జున :నట్టి ఎంటర్ టైన్ మెంట్స్, క్విటీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై కన్మణి దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా రాజకీయ నేపథ్యంలో “అర్జున” మూవీ రూపొందింది. మరియం జకారియా హీరోయిన్ కాగా వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించారు. ఈ మూవీ లో హీరో రాజశేఖర్ తండ్రీ కొడుకులుగా నటించడం విశేషం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − 12 =