‘వి’ నుండి ‘వస్తున్నా..వచ్చేస్తున్నా’ పాట విడుదల

Vasthunnaa Vachestunna Lyrical Song From V Movie,Latest Telugu Movies News,Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,Vasthunnaa Vachestunna Lyrical Song,Vasthunnaa Vachestunna Song,V Movie,V Movie Songs,V Telugu Movie Songs,V Movie Full Songs

ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం లో నాని హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా ‘V’. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా జోరు పెంచారు.ఇటీవలే ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే ఈ సినిమా నుండి మొదటి పాటను రిలీజ్ చేయగా…తాజాగా మరో సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ రోజు వి మూవీలోని ‘వస్తున్నా.. వచ్చేస్తున్నా’ లిరికల్ వీడియో విడుదల చేశారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యం అందించిన ఈపాటను శ్రేయ ఘోషల్, అమిత్ త్రివేది, అనురాగ్ కులకర్ణి కలిసి పాడారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈ సినిమాలో నివేత థామస్, అదితి రావు హైదరి హీరోయిన్లు గా నటిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శిరీష్‌, హ‌ర్షిత్ రెడ్డి రూపొందుతున్న ఈ సినిమాకు అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను ఉగాది కానుకగా మార్చి 25 వ తేదీన రిలీజ్ చేయనున్నారు.అంతేకాదు ఫస్ట్ టైమ్ నాని నెగటివ్ రోల్ లో నటించడం విశేషం. ఇక నాని పాత్ర‌కు ధీటుగా ఉండే ఐపీయ‌స్ ఆఫీస‌ర్ పాత్ర‌లో సుధీర్‌బాబు నటిస్తున్నాడు. నాని, సుధీర్ బాబు మ‌ధ్య నువ్వా నేనా? అనేలా వ‌చ్చే యాక్ష‌న్ స‌న్నివేశాలు సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలిచేలా ఉన్నాయి. చూద్దాం మరో ఏం జరుగుతుందో…

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − twelve =