ప‌్ర‌భాస్ కి జోడీగా క‌త్రినా కైఫ్?

Bollywood Actress Katrina Kaif,Katrina Kaif To Act Opposite Prabhas In Nag Ashwin New Movie,Latest Telugu Movies News,Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,Katrina Kaif Next with Prabhas,Prabhas,Nag Ashwin New Movie,Prabhas Nag Ashwin New Movie,Prabhas Upcoming Movie Updates

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా `మ‌హాన‌టి` ఫేమ్ నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ భారీ బ‌డ్జెట్ మూవీ తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ వైజ‌యంతీ మూవీస్ ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మించ‌నున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. ఈ ఏడాది చివ‌ర‌లో సెట్స్ పైకి వెళ్ళ‌నుంది. వ‌చ్చే సంవ‌త్స‌రం చివ‌ర‌లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే.. సైన్స్ ఫిక్ష‌న్ మూవీగా తెర‌కెక్క‌నున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా ప‌దుకుణే నాయిక‌గా న‌టిస్తున్న‌ట్లు ఆ మ‌ధ్య వార్త‌లు వినిపించాయి. లేటెస్ట్ బ‌జ్ ఏంటంటే.. ఆ పాత్ర‌లో మ‌రో బాలీవుడ్ బ్యూటీ క‌త్రినా కైఫ్ క‌నిపించ‌బోతోంద‌ట‌. అదేగ‌నుక నిజ‌మైతే… ప్ర‌భాస్, క‌త్రినా కాంబోలో వ‌చ్చే తొలి సినిమా ఇదే అవుతుంది. వాస్త‌వానికి `సాహో`లోనే క‌త్రినా నాయిక‌గా న‌టించాల్సింది. కొన్ని కార‌ణాల వ‌ల్ల అది కుద‌ర‌లేదు. ఈ సారైనా ఈ జోడీ మురిపిస్తుందేమో చూడాలి.

కాగా, క‌త్రినా ఇదివ‌ర‌కు తెలుగులో `మ‌ల్లీశ్వ‌రి`, `అల్ల‌రి పిడుగు` చిత్రాల్లో న‌టించిన సంగ‌తి తెలిసిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.