ఉప్పెన ‘ధక్..ధక్..ధక్’ సాంగ్ రిలీజ్

Dhak Dhak Song From Uppena Out Now,Latest Telugu Movies News,Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,Dhak Dhak Song,Dhak Dhak,Uppena Songs,Uppena Movie Songs,Uppena Telugu Movie Songs,Uppena Telugu Songs,Uppena Video Songs,Uppena Movie Latest News,Panja Vaisshnav Tej,Vaisshnav Tej Uppena

సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు సాన దర్శకత్వంలో సాయి తేజ్ తమ్ముడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా ఉప్పెన. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక మరోపక్క చిన్నగా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఈ సినిమాకు సంబంధించిన పాటలు ఒక్కోటి విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో మొదటి పాటగా విడుదల చేసిన నీ కన్ను నీలి సముద్రం అనే పాట ఇప్పటికే పది మిలియన్ల వ్యూస్ దక్కించుకుని యూ ట్యూబ్ ని షేక్ చేస్తోంది.చాలా రోజుల తరువాత దేవిశ్రీ ప్రసాద్‌ మార్క్‌కి తగ్గ సాంగ్ వచ్చింది. ఇప్పుడు తాజాగా మరో పాటను రిలీజ్ చేశారు. ‘ధక్ ధక్ ధక్’ అనే పాటను రిలీజ్ చేశారు. నువ్వూ నేను ఎదురైతే ధక్..ధక్..ధక్.. మనసూ మనసూ దగ్గరైతే ధక్..ధక్..ధక్.. ఆశలు అలలై పొంగుతుంటే ధక్..ధక్..ధక్.. అంటూ సాగే ఈ పాటను శరత్ సంతోష్, హరిప్రియ ఆలపించగా.. చంద్రబోస్ సాహిత్యం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా.. మరో కీలక పాత్రలో తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటిస్తున్నాడు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండ‌గా శ్యామ్ ద‌త్ సైనుద్దీన్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఏప్రిల్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరి తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా నటిస్తుండటంతో పాటు దేవి శ్రీ కంపోజ్ చేసిన సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వస్తుండటంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. చూద్దాం ఈ మెగా హీరో ఆ అంచనాలను రీచ్ అవుతాడో..? లేదో..?

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 13 =