నటసింహ బాలకృష్ణకు అచ్చొచ్చిన దర్శకుల్లో బి.గోపాల్ ఒకరు. `లారీ డ్రైవర్` (1990), `రౌడీ ఇన్స్ పెక్టర్` (1992), `సమరసింహారెడ్డి` (1999), `నరసింహనాయుడు` (2001).. ఇలా వీరిద్దరి కాంబినేషన్ లో నాలుగు బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. వీటిలో `సమరసింహారెడ్డి`, `నరసింహనాయుడు` అయితే ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచాయి. అయితే ఐదో సినిమాగా వచ్చిన `పలనాటి బ్రహ్మనాయుడు`(2003) మాత్రం నిరాశపరిచింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




కట్ చేస్తే.. దాదాపు 17 ఏళ్ళ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా రానుందని టాక్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. మే నెలాఖరులో సెట్స్ పైకి వెళుతుందని సమాచారం. ప్రస్తుతం బాలకృష్ణ… బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ డివోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ చేస్తున్నారు. పేరు నిర్ణయించని ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. మే నెలాఖరు కల్లా ఈ సినిమా తాలుకూ షూటింగ్ పూర్తవుతుందని సమాచారం. జూలైలో ఈ సినిమా జనం ముందుకు వచ్చే అవకాశముంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: