
ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 163

కన్నడ చిత్ర సీమకు `ఖైదీ`

'ఆర్ఆర్ఆర్' హిందీ టైటిల్ అదేనా..?
"రామసక్కనోళ్ళు " మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
'చిరు' ఎఫెక్ట్ - టైటిల్ ను మార్చనున్నారా..!

వరుణ్ తేజ్ సినిమాలో..!
సీన్ రీ క్రియేషన్ వీడియో సంచలనం
బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్ ప్లాన్..!

#VD10 మూవీ లో భారీ క్లైమాక్స్ ఫైట్

మొదటి షెడ్యూల్ పూర్తి చేసిన మెగా ప్రిన్స్

మరో తెలుగు మూవీ లో అమృత అయ్యర్

బన్నీ - సుక్కు చిత్రంలో `ఇస్మార్ట్` విలన్?

జూన్ నుంచి సెట్స్ పైకి `బంగార్రాజు`?

దుల్కర్ సల్మాన్ కు జోడీగా కాజల్ అగర్వాల్
మలయాళ, తమిళ, హిందీ, తెలుగు మూవీస్ లో సక్సెస్ ఫుల్ హీరో గా రాణిస్తున్న దుల్కర్ సల్మాన్, టాలీవుడ్, కోలీవుడ్ ల స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ జంటగా రూపొందుతున్న తమిళ మూవీ షూటింగ్ ఈ రోజు చెన్నై లో ప్రారంభం అయ్యింది. రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ మూవీ కి ప్రముఖ కొరియోగ్రాఫర్ బృంద మాస్టర్ దర్శకత్వం వహిస్తున్నారు.
రానా `రాక్షస రాజు రావణాసురుడు`లో ముగ్గురు నాయికలు?
`నేనే రాజు నేనే మంత్రి`(2017) వంటి విజయవంతమైన చిత్రం తరువాత యంగ్ హీరో దగ్గుబాటి రానా, సెన్సేషనల్ డైరెక్టర్ తేజ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. `రాక్షస రాజు రావణాసురుడు` పేరుతో రూపొందనున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్ లో రానా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తాడని సమాచారం. అంతేకాదు.. అతనికి జోడీగా ముగ్గురు కథానాయికలు నటించబోతున్నారని తెలిసింది. ప్రస్తుతం నాయికల అన్వేషణ సాగుతోందని వినికిడి. త్వరలోనే షూటింగ్ డిటైల్స్ తో పాటు నాయికల వివరాలు వెల్లడి కానున్నాయి.
కన్నడ చిత్ర సీమకు `ఖైదీ`
కోలీవుడ్ స్టార్ కార్తి నటించిన `ఖైదీ` చిత్రం... తెలుగు, తమిళ భాషల్లో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. లోకేష్ కనకరాజ్ రూపొందించిన ఈ యాక్షన్ థ్రిల్లర్... ప్రస్తుతం బాలీవుడ్ లో రీమేక్ అవుతోంది. ప్రముఖ హిందీ నటుడు అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో నటించనున్న సదరు చిత్రం.. వచ్చే ఏడాది ఫిబ్రవరి 12న థియేటర్లలో సందడి చేయనుంది. కాగా, హిందీ వెర్షన్ సెట్స్ పైకి వెళ్ళే లోపే.. శాండిల్ వుడ్ బాట పట్టనున్నాడు `ఖైదీ`.

బెల్లంకొండ సాయి కొత్త చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్
సక్సెస్ ఫుల్ మూవీ "రాక్షసుడు "తరువాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. గొర్రెల సుబ్రహ్మణ్యం నిర్మాతగా సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై "కందిరీగ" మూవీ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో సాయి హీరోగా ఒక మూవీ రూపొందింది. నభా నటేష్, అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలు కాగా సోను సూద్, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలలో నటించారు.
`ఆర్ ఆర్ ఆర్` రిలీజ్ డేట్ టార్గెట్ గా వరుణ్, నితిన్ చిత్రాలు?
`భీష్మ` ఘనవిజయం యువ కథానాయకుడు నితిన్ లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. ఒకవైపు ఆ సక్సెస్ ని ఆస్వాదిస్తూనే.. మరోవైపు `రంగ్ దే`, `చెక్` చిత్రాల షూటింగ్ లతో బిజీగా ఉన్నాడు నితిన్. కాగా, వీటిలో `రంగ్ దే`నే ముందుగా తెరపైకి రానుంది. `తొలి ప్రేమ` ఫేమ్ వెంకీ అట్లూరి రూపొందిస్తున్న `రంగ్ దే`లో నితిన్ కి జోడీగా `మహానటి` కీర్తి సురేష్ నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్నాడు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇదిలా ఉంటే... ఈ చిత్రాన్ని జూలై 30న విడుదల చేయబోతున్నట్లు ప్రచారం సాగుతోంది.

నాని మరదలిగా ఐశ్వర్య.. ప్రియురాలిగా రీతూ వర్మ
`నిన్ను కోరి` తరువాత నేచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం `టక్ జగదీష్`. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నానికి జోడీగా రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేష్ నటిస్తున్నారు. జగపతిబాబు ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. యువ సంగీత సంచలనం థమన్ బాణీలు అందిస్తున్న ఈ సినిమాని సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ప్రస్తుతం `టక్ జగదీష్`కి సంబంధించిన చిత్రీకరణ మెరుపు వేగంతో జరుగుతోంది.

విశాల్ 'డిటెక్టివ్ 2' ఫస్ట్ లుక్ రిలీజ్
విశాల్ హీరోగా మిస్కిన్ దర్శకత్వంలో ‘డిటెక్టివ్’ సినిమా వచ్చిన సంగతి గుర్తుండేవుంటుంది కదా. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై మిస్కిన్ దర్శకత్వంలో విశాల్ హీరోగా రూపొందిన 'తుప్పరివాలన్ 'తమిళ మూవీ 2017 సంవత్సరం సెప్టెంబర్ లో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఆ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ 'డిటెక్టివ్' కూడా మూవీ ఘనవిజయం సాధించింది. ఇప్పుడు ‘డిటెక్టివ్’ సినిమా సీక్వెల్ చేస్తున్న సంగతి కూడా విదితమే. తొలి భాగానికి దర్శకత్వం వహించిన మిస్కిన్ దర్శకత్వంలోనే ఈ సీక్వెల్ కూడా తెరకెక్కించాలని తననే తీసుకున్నారు. అయితే షూటింగ్ మధ్యలోనే డైరెక్టర్ మిస్కిన్ సినిమా నుంచి తప్పుకున్నాడు. కొద్దిరోజులుగా…

'ఆర్ఆర్ఆర్' హిందీ టైటిల్ అదేనా..?
ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్. వచ్చే ఏడాది జనవరి 8న విడుదల కానున్న ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. చిత్రంలో ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో కనిపించనుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా అలరించనున్నాడు. ఇప్పటి వరకు చిత్రానికి సంబంధించి ఎలాంటి ప్రమోషన్స్ మొదలు పెట్టని రాజమౌళి మరి కొద్ది రోజులలో ఫస్ట్ లుక్‌తో పాటు చిత్ర టైటిల్ అనౌన్స్ చేయనున్నట్టు సమాచారం.
"రామసక్కనోళ్ళు " మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
ఎస్ ఎస్ ఎస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై రాజ్ కార్తికేన్ దర్శకత్వంలో ఛమ్మక్ చంద్ర, మేఘనా చౌదరి జంటగా రూపొందిన రొమాంటిక్ యాక్షన్ డ్రామా "రామసక్కనోళ్ళు " మూవీ మార్చి 20 వ తేదీ రిలీజ్ కానుంది. బ్రహ్మానందం, బ్రహ్మాజీ, రఘు బాబు, ధన రాజ్ ముఖ్య పాత్రలలో నటించారు.
'చిరు' ఎఫెక్ట్ - టైటిల్ ను మార్చనున్నారా..!
మొత్తానికి చిరు ఎఫెక్ట్ వల్ల సినిమా టైటిల్ ను మార్చే ప్లాన్ లో వున్నాడట కొరటాల శివ. నిజానికి వీరిద్దరి కాంబినేషన లో సినిమా స్టార్ట్ అయినప్పుడే ఆచార్య టైటిల్ తెగ ప్రచారం అయింది. అయితే ఈ టైటిల్ అవునో?కాదో..? అసలు ఆ టైటిల్ పెడతారో..? కొత్త టైటిల్ ఏదైనా ఫిక్స్ చేస్తారా..? ఇలా పలు ఆలోచనలతో కన్ఫ్యూజన్ లో వున్నారు అభిమానులు. అయితే 'ఓ పిట్టకథ' ప్రీరిలీజ్ ఫంక్షన్లో చిరంజీవి నోరు జారి `ఆచార్య`అనే పేరు చెప్పేయడంతో సస్పెన్స్ కాస్త తుస్ మన్నది. పెద్దగా ప్లాన్ చేసి గ్రాండ్ గా టైటిల్ ను రిలీజ్ చేద్దామనుకున్నారు కొరటాల.. కానీ చిరు పొరపాటున నోరు జారారు. ఈ సినిమా టైటిలేంటో జనాలకు తెలిసిపోయింది. దాంతో ఈ…

వరుణ్ తేజ్ సినిమాలో..!
మెగా కాంపౌండ్ లో ఉన్న హీరోల్లో మెగా ప్రిన్స్ రూటు కాస్త సెపరేట్. మొదటి నుండి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ఫిదా సినిమాతో క్లాస్ హిట్ కొట్టిన వరుణ్... ఎఫ్2 సినిమాతో కామెడీ యాంగిల్ ను చూపించాడు.. గద్దల కొండ సినిమాతో తనలోని నెగిటివ్ షేడ్ ను కూడా చూపించాడు. ఇప్పుడు మరో డిఫరెంట్ స్టోరీ తో వస్తున్నాడు. ప్రస్తుతం నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో 'బాక్సింగ్' నేపథ్యంలో వరుణ్ సినిమా చేస్తున్న చేస్తున్నాడు. గత నెల ఫిబ్రవరి 24 న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించగా... ఈ షెడ్యూల్ నిన్ననే ముగిసింది. సెకండ్ షెడ్యూల్ ను త్వరలో ప్రారంభించనున్నారు.

'లవ్ స్టోరీ' - 'ఏ పిల్లా' ఫుల్ సాంగ్ రిలీజ్
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రలో 'లవ్ స్టోరీ' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఒక పక్క షూటింగ్ జరుపుకుంటూనే మరోపక్క ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ ఇస్తూనే ఉంది చిత్రయూనిట్. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, నాగచైతన్య ఫస్ట్ గ్లింప్స్, టైటిల్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అలాగే వాలెంటైన్స్ డే సందర్భంగా "లవ్ స్టోరీ" మూవీ లోని ఏ పిల్లా సాంగ్ మ్యూజికల్ ప్రివ్యూ వీడియోను రిలీజ్ చేయగా అది ఎంత వైరల్ అయిందో తెలుసు. ముఖ్యంగా లాస్ట్ సీన్ కు అందరూ ఫిదా అయ్యారు. సమంత కూడా ఈ సీన్ కు స్పందించి ట్వీట్…
సీన్ రీ క్రియేషన్ వీడియో సంచలనం
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, కాజోల్ జంటగా రూపొందిన "దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే " హిందీ మూవీ 1995 సంవత్సరంలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఆ మూవీ లో సాంగ్స్ తో పాటు ట్రైన్ సీన్ కూడా ప్రేక్షకులను అలరించింది. షారుఖ్ ఖాన్, కాజోల్ ప్లేస్ లలో మహేష్ బాబు, రష్మిక లతో ఆ ట్రైన్ సీన్ ను మహేష్ బాబుఅభిమానులు రీ క్రియేషన్ చేసి వీడియో రూపొందించారు.
బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్ ప్లాన్..!
శ్రీను వైట్ల, మంచు విష్ణు కాంబినేషన్ లో వచ్చిన 'ఢీ' సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలుసు. ఇక ఆ సినిమా తర్వాత ఇద్దరూ ఫుల్ బిజీ అయిపోయారు. అయితే ప్రస్తుతం పరిస్థితి వేరనుకోండి. విష్ణు హిట్ కొట్టి కొన్నేళ్లు అయిపోయింది. అలానే శ్రీను వైట్ల నుండి హిట్ వచ్చి చాలా కాలమైంది. ఇప్పుడు ఇద్దరికీ హిట్ చాలా అవసరం.

#VD10 మూవీ లో భారీ క్లైమాక్స్ ఫైట్
క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, బాలీవుడ్ సక్సెస్ ఫుల్ హీరోయిన్ అనన్య పాండే జంటగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్ టైనర్ #VD10 మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. విజయ్ ఫైటర్ గా నటిస్తున్న ఈ మూవీ లో రమ్య కృష్ణ, రోనిత్ రాయ్, అలీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందించారు. విజయ్ దేవరకొండ ఈమూవీ తో బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.

మొదటి షెడ్యూల్ పూర్తి చేసిన మెగా ప్రిన్స్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మంచి స్పీడ్ మీదే ఉన్నాడు. అలా షూటింగ్ ను మొదలు పెట్టాడో లేదో అప్పుడే ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసాడు. నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వరుణ్ బాక్సర్ గా నటించనున్నాడు. ఇక ఈసినిమా కోసం గతంలోనే ఒలింపిక్ విన్నర్ టోని జెఫ్రీస్ పర్యవేక్షణలో కొన్ని నెలల పాటు ట్రైనింగ్ తీసుకున్నాడు. ఫిబ్రవరి 24 న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించింది. సుమారు రెండు వారాలు జరిగిన ఈ షెడ్యూల్ నిన్ననే ముగిసింది. ఈ షెడ్యూల్ లో వరుణ్ తేజ్, ఇంకొందరు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను తెరకెక్కించారు. అక్కడి షెడ్యూల్ పూర్తవడంతో…

'ఒరేయ్ బుజ్జిగా' - భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో
విజయ్‌కుమార్ దర్శకత్వంలో యంగ్ హీరో రాజ్ తరుణ్ కథానాయకుడిగా 'ఒరేయ్.. బుజ్జిగా' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమాను ఉగాది కానుకగా మార్చి 25 వ తేదీ రిలీజ్ కానున్న నేపథ్యంలో... ప్రచార కార్యక్రమాలు మొదలు పెట్టారు. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈ సినిమా నుండి పాటలు, టీజర్ ను రిలీజ్ చేశారు.

మరో తెలుగు మూవీ లో అమృత అయ్యర్
బ్లాక్ బస్టర్ తమిళ మూవీ "బిగిల్ " లో నటించిన అమృత అయ్యర్ "30 రోజుల్లో ప్రేమించటం ఎలా ?" మూవీ తో టాలీవుడ్ కు ఎంటర్ అవుతున్నారు. ప్రముఖ యాంకర్ ప్రదీప్ హీరోగా పరిచయం అవుతున్న ఆ మూవీ మార్చి 25 వతేదీ రిలీజ్ కానుంది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా రూపొందుతున్న "రెడ్ " మూవీ లో ముగ్గురు హీరోయిన్స్ లో ఒకరిగా అమృత ఎంపిక అయ్యారు. ఇప్పుడు మరో మూవీ కి అమృత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

బన్నీ - సుక్కు చిత్రంలో `ఇస్మార్ట్` విలన్?
`అల వైకుంఠపురములో` ఘనవిజయంతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేశాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో.. తన లక్కీ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో ఓ యాక్షన్ థ్రిల్లర్ చేస్తున్నాడు. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో బన్నీకి జోడీగా రష్మికా మందన్న నటిస్తోంది. తమిళ నటుడు విజయ్ సేతుపతి ఓ కీలక పాత్రలో దర్శనమివ్వనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చుతున్నాడు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి 40 రోజుల పాటు సాగే లాంగ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది.

జూన్ నుంచి సెట్స్ పైకి `బంగార్రాజు`?
కింగ్ నాగార్జున కెరీర్ లో హయ్యస్ట్ గ్రాసర్ గా నిలచిన చిత్రం `సోగ్గాడే చిన్ని నాయనా`. 2016 సంక్రాంతికి విడుదలైన ఈ సినిమాకి త్వరలో సీక్వెల్ రాబోతోంది. `సోగ్గాడే...`ని తెరకెక్కించిన కళ్యాణ్ కృష్ణనే ఈ కొనసాగింపు చిత్రాన్ని కూడా రూపొందించనున్నాడు. `సోగ్గాడే చిన్ని నాయనా`లో నాగ్ కి జోడీగా కనిపించిన రమ్యకృష్ణ.. ఇందులోనూ నటిస్తోందని సమాచారం. అలాగే యువ సామ్రాట్ నాగచైతన్య కూడా మరో కథానాయకుడిగా నటిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.