సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ మధ్య సోషల్ మీడియాలో బాగానే యాక్టీవ్ గా ఉంటున్నారన్న సంగతి తెలిసిందే. తన సినిమాలు, వ్యక్తిగత విషయాలపై మాత్రమే కాదు పలు విషయాలను కూడా పంచుకుంటారు. అంతేకాదు తనకు సన్నిహితులైతే వారి పుట్టినరోజులను గుర్తుపెట్టుకొని మరీ శుభాకాంక్షలు తెలియచేస్తాడు మహేష్. తన మేకప్ మెన్ పుట్టిన రోజును కూడా గుర్తుంచుకొని మరి విషెస్ చెప్పాడంటేనే అర్థంచేసుకోవచ్చు. ఇక ఈ రోజు తనకు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన అనిల్ రావిపూడి బర్త్ డే. ఈ సందర్భంగా మహేష్ తన ట్విట్టర్ ద్వారా అనిల్ రావిపూడికి బర్త్ డే విషెస్ తెలిపాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
గత ఏడాది సరిలేరు నీకెవ్వరు సినిమా సెట్ లో అనిల్ పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న ఫొటో ను ఇప్పుడు షేర్ చేస్తూ కాలం ఎంత తొందరగా గడుస్తుంది. నిన్నటిలానే ఉంది. నా అభిమాన దర్శకులలో ఒకరు అయిన అనీల్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు . మీరు చేసే ప్రతి పనిలో మీకు ఆనందం మరియు విజయం లభిస్తుందని కోరుకుంటున్నాను అని ట్వీట్ చేశారు. కాగా అనీల్ రావిపూడి- మహేష్ కాంబినేషన్లో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు చిత్రం ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై మంచి విజయం సాధించింన సంగతి తెలిసిందే.
How time flies… Feels like yesterday… Happiest Birthday to one of my favourite directors @AnilRavipudi. Wishing you all the happiness and success in everything you do. 🤗🤗🤗 pic.twitter.com/r8nZw9a3m7
— Mahesh Babu (@urstrulyMahesh) November 23, 2020
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: