ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 15
'సన్ ఆఫ్ ఇండియా' - హెద్రాబాద్ షెడ్యూల్ ప్రారంభం
'కపటధారి' సెన్సార్ పూర్తి.. క్రిస్మస్ కు రిలీజ్
ఆనందంలో షిర్లీ సేతియా
ఎన్టీఆర్ స్టైల్ లో డేవిడ్ వార్నర్
'ఢిల్లీ క్రైమ్' టీం కి మహేష్ అభినందనలు
యాక్షన్ థ్రిల్లర్ "గద్దలకొండ గణేష్ "

6 మిలియన్స్ క్లబ్ లోకి మహేష్
సితార తో మహేష్ షాపింగ్
వలయం చిత్రం చూడడానికి 5 కారణాలు
గ్యాప్ రాలేదు.. తీసుకున్నా అంటున్న శృతి
మేఘా ఆకాష్ స్టైలిష్ లుక్
ప్రభాస్ న్యూ లీన్ లుక్.. ఏ సినిమా కోసం..!
అఖిల్ అక్కినేని వీకెండ్ హార్స్ రైడింగ్
"సీటీమార్" షూటింగ్ పునః ప్రారంభం
మరో తమిళ మూవీలో రష్మిక ?
'స్పీడున్నోడు' నుండి శ్యామల కామెడీ
ఢీ అండ్ ఢీ.. ఢీ సీక్వెల్ కాదు
శర్వా ద్విభాషా చిత్రం.. షూటింగ్ పూర్తి
'కిల్ బిల్ పాండే' గా బ్రహ్మీ కామెడీ
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన రేసుగుర్రం సినిమా మంచి విజయం దక్కించుకున్న సంగతి తెలిసిందే. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ‘కిక్’ శ్యామ్ అన్నదమ్ములుగా నటించిన ఈ ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ అందరినీ అలరించింది. “టామ్ అండ్ జెర్రీ”లా నిత్యం పోట్లాడుకుంటూ ఉండే ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఉండే భావోద్వేగాలను.. వినోదాత్మకంగా వెండితెరపై ఆవిష్కరించాడు సురేందర్ రెడ్డి.
'సన్ ఆఫ్ ఇండియా' - హెద్రాబాద్ షెడ్యూల్ ప్రారంభం
రత్నబాబు దర్శకత్వంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రధాన పాత్రలో వస్తున్న దేశభక్తి కథా చిత్రం 'సన్ ఆఫ్ ఇండియా. అందుకే ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఈ సినిమాను ప్రకటించారు. ఇదివరకెన్నడూ కనిపించని అత్యంత పవర్ఫుల్ రోల్లో మోహన్‌బాబు ఈ సినిమాలో కనిపిస్తున్నారట. ఇక ఈ సినిమా షూటింగ్ ను ఇటీవలే ప్రారంభించారు చిత్రయూనిట్.
'కపటధారి' సెన్సార్ పూర్తి.. క్రిస్మస్ కు రిలీజ్
ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో సుమంత్ ఇప్పుడు 'కపటధారి' అనే మరో డిఫరెంట్ కథతో వస్తున్న సంగతి తెలిసిందే. కన్నడంలో సూపర్‌హిట్టయిన `కవలుదారి` సినిమాకు ఇది తెలుగు రీమేక్. కన్నడలో రిషి పోషించిన ట్రాఫిక్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ పాత్రలో సుమంత్ నటించారు.ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది.
ఆనందంలో షిర్లీ సేతియా
యంగ్ హీరో నాగశౌర్య పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై అనీష్ కృష్ణ దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ పూజా కార్యక్రమాలు జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో నాగశౌర్య కు జోడీగా సింగర్ , యాక్ట్రెస్ షిర్లీ సేతియా ఎంపిక అయ్యారు. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. డిసెంబర్ నెలలో సెట్స్ పైకి వెళ్ళనుంది. హీరో నాగశౌర్య ప్రస్తుతం "#NS20 ", "వరుడు కావలెను " మూవీస్ షూటింగ్స్ లో పాల్గొంటున్నారు.
ఎన్టీఆర్ స్టైల్ లో డేవిడ్ వార్నర్
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఐపిఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ను ముందుండి నడిపించి భారత క్రికెట్ అభిమానులకు దగ్గరయ్యారు. లాక్ డౌన్ సమయం లో పలు వీడియోస్ తో వార్నర్ తెలుగు ప్రేక్షకులను అలరించారు. మైండ్ బ్లాక్ (సరిలేరు నీకెవ్వరు ), బుట్ట బొమ్మ (అల వైకుంఠపురములో ) సాంగ్స్ ను తన వైఫ్ తో స్టెప్స్ వేసి వార్నర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. పేస్ యాప్ తో స్టార్ హీరోస్ ప్రభాస్ , మహేష్ బాబు , రామ్ చరణ్ , అల్లు అర్జున్ ముఖాలకు తన ముఖం సెట్ చేసి సోషల్ మీడియా లో షేర్ చేసి ఆకట్టుకున్నారు.
'ఢిల్లీ క్రైమ్' టీం కి మహేష్ అభినందనలు
ఢీల్లీ లో జరిగిన నిర్భయ అత్యాచార ఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఘటన అది. ఇక ఈ ఘటన ఆధారంగా..దర్శకుడు రిచీ మెహతా దర్శకత్వంలో 'ఢిల్లీ క్రైమ్' అనే టైటిల్ తో వెబ్ సిరీస్ ను తెరకెక్కించారు. ఈ సిరీస్ విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు అరుదైన ఘనత దక్కింది. 48వ అంతర్జాతీయ ఎమ్మీ అవార్డుకు ఎంపికైంది. అంతరర్జాతీయ వేదిక వద్ద భారతీయ వెబ్ సిరీస్‌కు అరుదైన గౌరవం దక్కడంతో అందరూ సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతున్నారు.
బిగ్ బాస్ 4 - బంపర్ ఆఫర్ కొట్టేసిన అవినాష్
బిగ్ బాస్ 4 - నిన్న హాట్ హాట్ గా నామినేషన్స్ ప్రక్రియ జరగడంతో ఇంకా అదే హీట్ తో ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది. నామినేషన్ లోకి వెళ్లినందుకు అరియానా కన్నీళ్లు పెట్టుకుంటుంది. దానితో అవినాష్ ఏడవొద్దని ఏడిస్తే ఏం అవ్వదని కాస్త అసహనం వ్యక్తం చేసాడు. మరోవైపు మోనాల్ ఒంటరిగా ఏడుస్తుంటే ఆమెను నామినేట్ చేసి హారిక వెళ్లి ఓదార్చింది. కరెక్ట్ పర్సన్‌తో స్వాప్ చేయమని చెప్పింది అఖిల్ గురించి అని చెప్పడంతో షాకైన హారిక సారీ చెప్పింది. మరోవైపు ఒకరిని తొక్కి ముందుకు వెళ్లడం ఇష్టం లేదన్న అభి.. మోనాల్‌తో స్వాప్‌కు ఎలా ఒప్పుకున్నాడని అఖిల్ సోహెల్ తో అంటాడు.
యాక్షన్ థ్రిల్లర్ "గద్దలకొండ గణేష్ "
14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్, పూజాహెగ్డే జంటగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ "గద్దలకొండ గణేష్ " మూవీ ఘనవిజయం సాధించింది. సూపర్ హిట్ తమిళ మూవీ "జిగర్తాండ " కు తెలుగు రీమేక్ గా రూపొందిన ఈ మూవీ లో అథర్వ , మృణాళిని రవి ముఖ్య పాత్రలలో నటించారు. డింపుల్ హాయతి ఒక స్పెషల్ సాంగ్ లో నటించగా , దర్శకుడు సుకుమార్ , హీరో నితిన్ , స్టార్ కమెడియన్ బ్రహ్మానందం అతిథి పాత్రలలో నటించారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు.

6 మిలియన్స్ క్లబ్ లోకి మహేష్
సెలెబ్రటీస్ అందరూ సోషల్ మీడియాలో బాగానే యాక్టీవ్ గానే ఉంటారు. ఒకప్పుడు అంటే ఏదో కొంతమంది మాత్రమే సోషల్ మీడియాల్లో యాక్టీవ్ గా ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో తమ అప్ డేట్స్ ఇస్తూ.. ఫ్యాన్స్ కు అందుబాటులో ఉంటూ ఫాలోవర్స్ ను పెంచుకుంటున్నారు. ఇక టీజర్, ట్రైలర్స్ రికార్డ్స్ క్రియేట్ చేయడం కోసం హీరోస్ ఎంత ఎదురుచూస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ను సంపాదించుకోవడం కూడా వారికి రికార్డ్స్ క్రియేట్ చేయడంతోనే సమానం. ఇక ఇప్పుడు అలాంటి ఒక రికార్డునే సొంతం చేసుకున్నాడు మహేష్.
సితార తో మహేష్ షాపింగ్
సూపర్‌స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారనే సంగతి తెలిసిందే. మహేష్ గురించి కానీ, పిల్లలు సితార-గౌతమ్ లకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు పలు ఆసక్తికర విషయాలగురించి ఏదో ఒకటి తన సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూనే ఉంటారు. ఇప్పుడు రోజుకో పోస్ట్ అయినా అభిమానులతో పంచుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వలయం చిత్రం చూడడానికి 5 కారణాలు
ఈ సినిమాకు కథే ప్రధాన హీరో అని చెప్పుకోవచ్చు. కథ విషయానికొస్తే అరవింద్ (లక్ష్), దిశా (దిగంగన) పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకొని సంతోషకరమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు. అలా ఆనందంగా సాగిపోతున్న అరవింద్ జీవితంలో భార్య దిశా కనిపించకుండాపోవడం కలకలం రేపుతుంది. అసలు దిశా ఏమైంది? తనకు తానే వెళ్లిపోయిందా? ఎవరైనా ఎత్తుకుపోయారా? దిశా మిస్సింగ్ మిస్టరీలో భర్త అరవింద్ పాత్ర ఏమైనా ఉందా? చివరకి దిశా దొరికిందా? లేదా? అనే సస్పెన్స్ విషయాలే ఈ చిత్ర కథ.
గ్యాప్ రాలేదు.. తీసుకున్నా అంటున్న శృతి
అనగనగా ఓ ధీరుడు అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శృతిహాసన్ ఆ తరువాత తక్కువ కాలంలోనే తెలుగులో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. ఇక కెరీర్ మంచి పీక్స్ లో వున్నప్పుడే సినిమాలకు దూరమైంది. దాదాపు రెండేళ్లు గ్యాప్ తీసుకున్న తర్వాత మళ్లీ కెరీర్ పై దృష్టి పెట్టింది. ప్రస్తుతం తెలుగు, తమిళ్ సినిమాలతో బిజీ గా ఉంది.
మేఘా ఆకాష్ స్టైలిష్ లుక్
యాక్షన్ థ్రిల్లర్ "లై " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన మేఘా ఆకాష్ , ఆ మూవీ లో తన అందం , హుషారైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. "ఛల్ మోహన్ రంగ "మూవీ తో ప్రేక్షకులను అలరించారు. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా రూపొందిన "పేట్ట "మూవీ తో మేఘా ఆకాష్ కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. తమిళ మూవీస్ లో బిజీగా మారారు. మేఘా ఆకాష్ ప్రస్తుతం "మను చరిత్ర "తెలుగు మూవీ , విజయ్ సేతుపతి హీరోగా రూపొందుతున్న తమిళ మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు.
ప్రభాస్ న్యూ లీన్ లుక్.. ఏ సినిమా కోసం..!
ప్రస్తుతం ప్రభాస్ భారీ బడ్జెట్ సినిమాలే లైన్ లో పెట్టాడు. ఇక ప్రస్తుతం అయితే రాధా కృష్ణ దర్శకత్వంలో రాధే శ్యామ్ సినిమా చేస్తున్నాడు. రీసెంట్ గానే ఇటలీలో షెడ్యూల్ ను పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్లో షూటింగ్ జరుపుకోనుంది చిత్రయూనిట్. ఇప్పటికే షూటింగ్ కోసం డైరెక్టర్ ఇంకా క్రూ సభ్యులు సెట్ మొత్తం బ్లూ స్క్రీన్స్ వేసి అంతా రెడీ గా ఉంచారు. ఇంకా ప్రభాస్, పూజా హెగ్డే షూట్ లో పాల్గొనడమే ఉంది. ఈ షూటింగ్ తో దాదాపు షూటింగ్ పూర్తయినట్టే.
అఖిల్ అక్కినేని వీకెండ్ హార్స్ రైడింగ్
యంగ్ హీరో అఖిల్ అక్కినేని ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం లో రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్" మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. పూజాహెగ్డే కథానాయిక. ఈ మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. భారీ అంచనాలు ఉన్న "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్" మూవీని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. ఈ మూవీ తరువాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో భారీబడ్జెట్ తో రూపొందనున్న యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ కి అఖిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
"సీటీమార్" షూటింగ్ పునః ప్రారంభం
శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై సంపత్ నంది దర్శకత్వంలో యాక్షన్ చిత్ర హీరో గోపీచంద్ , తమన్నా జంటగా కబడ్డీ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామా "సీటిమార్ "మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. హీరో ను ప్రేమించే అమ్మాయి పాత్రలో "హిప్పీ"మూవీ ఫేమ్ దిగాంగన నటిస్తుండగా రావు రమేష్ పోసాని , భూమిక , రెహమాన్ , తరుణ్ అరోరా ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీ లో గోపీచంద్ , తమన్నా లు కబడ్డీ టీమ్ కోచ్ లుగా నటిస్తున్నారు.
మరో తమిళ మూవీలో రష్మిక ?
తెలుగు , తమిళ బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని రష్మిక సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్నారు. రీసెంట్ గా "సుల్తాన్ "తమిళ మూవీ షూటింగ్ ను కంప్లీట్ చేసిన రష్మిక ఇప్పుడు మరో తమిళ మూవీ లో కథానాయికగా ఎంపిక అయ్యారని సమాచారం. హీరోయిన్ రష్మిక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న "పుష్ప "మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. శర్వానంద్ హీరోగా రూపొందే "ఆడాళ్ళూ మీకు జోహార్లు " మూవీ లో రష్మిక కథానాయికగా ఎంపిక అయ్యారని సమాచారం.
'స్పీడున్నోడు' నుండి శ్యామల కామెడీ
'అల్లుడు శ్రీను' సినిమా తర్వాత ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు సాయి శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన రెండో సినిమా 'స్పీడున్నోడు' భీమనేని శ్రీనివాస్‌రావు దర్శకత్వంలో సాయి శ్రీనివాస్ హీరోగా ఈ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే కదా. 2012లో కోలీవుడ్‌లో హిట్ అయిన 'సుందర పాండ్యన్' అనే తమిళ సినిమాకి తెలుగు రీమేక్ ఇది. ఈ సినిమాతో కుటుంబ ప్రేక్షకులను మెప్పించాడు సాయి శ్రీనివాస్. సోనారిక హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రావు రమేష్, శ్రీనివాస్ రెడ్డి, పృథ్వీ, శకలక శంకర్ల పోసాని మురళీ కృష్ణ, పృథ్వీ, మధు నందన్, శ్యామల తదితరులు నటించారు. ఇక ఈ సినిమానుండి శ్యామల కామెడీ సీన్ మీకోసం చూసి ఎంజాయ్…
ఢీ అండ్ ఢీ.. ఢీ సీక్వెల్ కాదు
విష్ణు బర్త్‌డే సందర్భంగా ఢీ సీక్వెల్‌పై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఈ సారి "డబుల్ డోస్"(ఢీఢీ) తో వస్తున్నట్టు ప్రకటించారు. ఇక ఈ సినిమా ఢీ కి సీక్వెల్ అని.. ఆ రేంజ్ లో ఉంటుందా అన్న వార్తలు అప్పుడే మొదలయ్యాయి. ఈ వార్తలపై స్పందించిన శ్రీనువైట్ల క్లారిటీ ఇచ్చాడు.
శర్వా ద్విభాషా చిత్రం.. షూటింగ్ పూర్తి
టాలీవుడ్ హీరోలందరూ ఒక్కొక్కరుగా షూటింగ్ లు మొదలుపెట్టిన సంగతి తెలిసిందే కదా. అంతేకాదు చాలామంది షూటింగ్ కూడా పూర్తిచేసుకున్నారు. ఇప్పుడు శర్వానంద్ కూడా తన సినిమా షూటింగ్ ను పూర్తిచేసుకున్నాడు. నూతన దర్శకుడు శ్రీకార్తీక్ దర్శకత్వంలో శర్వానంద్ తమిళ్, తెలుగులో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేశారు చిత్రయూనిట్. గతకొద్ది రోజులుగా చెన్నైలో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుండగా.. అయితే ఇప్పుడు తాజాగా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇక ఈ విషయాన్ని శర్వానంద్ తన ట్విట్టర్ ద్వారా తెలియచేశాడు. ఈ సందర్భంగా శర్వా ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా తెలియచేసాడు.