ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు విజయ్ ఆంటోనీ “మహాత్మ “, “దరువు ” వంటి మూవీస్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. క్రైమ్ థ్రిల్లర్ “నాన్ ” తమిళ మూవీ తో విజయ్ హీరోగా మారారు. సూపర్ హిట్ “బిచ్చగాడు “మూవీ తో తెలుగు ప్రేక్షకులను విజయ్ ఆకట్టుకున్నారు. విజయ్ హీరోగా రూపొందిన తమిళ మూవీస్ తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ “యమన్ “, “భేతాళుడు “, “ఇంద్ర సేన “, “రోషగాడు “, “కాశి “, “కిల్లర్ ” మూవీస్ ప్రేక్షకులను అలరించాయి. విజయ్ ప్రస్తుతం 4 తమిళ మూవీస్ లో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అమ్మ క్రియేషన్స్ బ్యానర్ పై నవీన్ దర్శకత్వంలో విజయ్ ఆంటోనీ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ “అగ్ని సిరగుగళ్” తమిళ మూవీ షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంది. అక్షర హాసన్ , అరుణ్ విజయ్ , ప్రకాష్ రాజ్ , రీమాసేన్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. శర్వంత రామ్ క్రియేషన్స్ , షిర్డీ సాయి క్రియేషన్స్ బ్యానర్స్ పై “అగ్ని సిరగుగళ్” మూవీ తెలుగు వెర్షన్ రూపొందుతుంది. ఈ మూవీ కి చిరంజీవి హిట్ మూవీ “జ్వాల “ను టైటిల్ గా ఫిక్స్ చేశారు. హీరో విజయ్ ఆంటోనీ కెరీర్ లో భారీ బడ్జెట్ తో “అగ్ని సిరగుగళ్”మూవీ రూపొందింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: