బిగ్ బాస్ 4 – షాకింగ్ ఎలిమినేషన్.. లాస్య ఔట్

Bigg Boss Telugu 4 Day"77" Highlights: Anchor Lasya Gets Eliminated From The House

బిగ్ బాస్4 – ఊహించని విధంగా లాస్య హౌస్ నుండి బయటకి వచ్చేసింది. మరి నిన్నటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఇక వీకెండ్ అందులో సండే కాబట్టి నాగ్ ఫుల్ జోష్ లో ఎంట్రీ ఇచ్చేసాడు. ఇక అదే జోష్ తో ఇంటి సభ్యులతో కూడా గేమ్స్ ఆడించాడు. ఇందులో మొదటగా.. ఏ టీం. బీ టీం అని రెండు టీం లగ విడగొట్టి అవినాష్‌, అరియానా, సోహైల్‌, మోనాల్ ఏ టీమ్‌గా మిగిలిన‌వారు బీ టీమ్‌గా ఏర్పడ్డారు. ఇక గేమ్ ఏంటంటే స్క్రీన్ పై కొన్ని ఫొటోల‌ను చూపించి దాని ఆధారంగా పాట‌ల పేర్లు చెప్పడం. ఈ గేమ్ లో హారిక టీం లీడర్ గా ఉన్న జట్టుగెలిచింది. ఈ గేమ్ అయిపోయిన తర్వాత హారిక సేఫ్‌ అయిన‌ట్లు నాగ్ ప్ర‌క‌టించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక గత మూడు వారాలుగా హౌస్ మేట్స్ కు బయటినుండి ప్రశ్నలు వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో ఓ ప్రేక్ష‌కురాలు సేఫ్‌గా ఆడ‌టం మీ గేమ్ స్ట్రాట‌జీనా అని లాస్య‌ను అడ‌గ్గా తాను సేఫ్ గేమ్ ఆడ‌టం లేద‌ని ఆమె స్ప‌ష్టం చేసింది. త‌ర్వాత మోనాల్ సేఫ్ అయిన‌ట్లు చెప్పారు.

ఆ తర్వాత ఇంటిస‌భ్యుల‌తో లూడో గేమ్ ఆడించారు. ఇందులో సోహైల్‌, అవినాష్ ఉన్న‌ అరియానా టీమ్‌లో మోనాల్‌, మిగిలిన స‌భ్యులు ఉన్న‌ హారిక టీమ్‌లో అభిజిత్ డైస్ రోల్ చేశారు. మిగిలిన వాళ్లు పడిన నెంబర్ ఆధారంగా ఒక్కో గ‌డిని దాటుకుంటూ ముందుకు వెళ్లారు. ఇక్కడకూడా కొన్ని టాస్క్ లు చేయాల్సి ఉంటుంది. ఇందులో సోహైల్ నోటితో నెయిల్ పాలిష్‌ను అవినాష్ వేళ్ల‌కు అందంగా రుద్దాడు. అటు అఖిల్ రొమాంటిక్ సాంగ్‌ను ఏడుస్తూ, ఫాస్ట్ ఫార్వ‌ర్డ్‌లో, స్లో మోష‌న్‌లో పాడి మెప్పించాడు. త‌ర్వాత లాస్య నాలుక బ‌య‌ట‌పెట్టి డైలాగులు చెప్ప‌డం అంద‌రికీ న‌వ్వు తెప్పించింది. అవినాష్ ఒక్క నిమిషంలో చీర క‌ట్టుకున్నాడు.. టాస్కులో భాగంగా నిమ్మ‌కాయ‌ను న‌మిలిపారేశాడు. మొత్తానికి లూడో గేమ్‌లో అరియానా టీమ్ గెల‌వ‌గా హారిక టీమ్ ఓడిపోయింది. త‌ర్వాత అభిజిత్ సేఫ్ అయినట్లు తెలిపారు. ఇక అందరూ అనుకున్నట్టే ఫైనల్ గా అరియానా, లాస్య మధ్య సస్పెన్స్ క్రియేట్ చేశారు. ఫైనల్ గా అరియానా సేఫ్ అయిన‌ట్లు ప్ర‌క‌టించ‌గా లాస్య ఎలిమినేట్ అయిన‌ట్లు వెల్ల‌డించారు.

అనంతరం స్టేజీ మీద‌కు వ‌చ్చిన లాస్య ముందుగా త‌న‌ న‌వ్వు జెన్యూన్ అని నాగ్ కు చెప్పింది.ఆ త‌ర్వాత టాప్ 1,2 లో ఎవరు ఉంటారని లాస్య ని చెప్పమని నాగ్ అడుగగా ఎలాంటి తడబాటు లేకుండా.. సోహైల్‌, అభిజిత్ టాప్ 2లో ఉంటార‌ని చెప్పేసింది. దీంతో సోహైల్‌.. అంద‌రిక‌న్నా వీక్ అనుకున్నా కానీ అక్క‌ టాప్ 2లో ఉంటానని చెప్ప‌గానే ఈ మాట చాలు అనిపించిందని చెప్పుకొచ్చాడు. ఇక ఒక్కో హౌస్ మేట్ గురించి ఓపెన్ గా చెప్పమని నాగ్ అడుగగా.. అవినాష్‌.. ఎంట‌ర్‌టైన‌ర్ కానీ నామినేష‌న్‌ను తీసుకోలేడ‌‌ని చెప్పింది. మోనాల్ బాగా ఆడుతుంది కానీ క‌న్ఫ్యూజ‌న్‌లో ఉంటుంద‌ని పేర్కొంది. అరియానా బోల్డ్‌గా మాట్లాడుతుంది, కానీ కొన్నిసార్లు త‌ప్పును కూడా ఒప్పుకోవాల‌ని స‌ల‌హా ఇచ్చింది. సోహైల్‌కు ఎంత కోపం వ‌స్తుందో అంత త్వ‌ర‌గా క‌రిగిపోతుంది అని.. అఖిల్ బాగా ఆడ‌తాడు. కానీ కోపం ఎక్కువ‌. ఎదుటివాళ్ల‌కు మాట్లాడే అవ‌కాశం ఇవ్వడ‌ని, అది మార్చుకోమ‌ని.. అభి నాకు చాలా ఇష్టం. అంద‌రినీ ఒకేలా ట్రీట్ చేస్తాడు. హారిక‌ అల్ల‌రి పిల్ల. త‌న‌కు అన్యాయం జ‌రిగింద‌ని అనిపిస్తే వాదించి సాధిస్తుంది. ఫైనల్ గా బిగ్ బాంబ్ అభి కి వేసింది. ఈ వారం కింగ్ ఆఫ్ ద కిచెన్ అభి.

మరి నిజంగా చెప్పాలంటే లాస్య లాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్ వెళ్లడం అనేది అందరికీ కాస్త షాకింగ్ కలిగించే విషయమే. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే హౌస్ లో ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్ లో అభి కంటే కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు లాస్యకు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కు లాస్య అంటే అదో అటాచ్ మెంట్. ఫైనల్ విన్నర్ కూడా లాస్య అయ్యే ఛాన్స్ ఉందన్న అభిప్రాయాలు కూడా ఏర్పడ్డాయి. కానీ 11 వారంలోనే హౌస్ నుండి బయటకు వచ్చేసింది. ఒక రకంగా లాస్య కు కూడా బయటకు రావడం హ్యాపీ గానే ఉన్నట్టుంది దానికి కారణం తన కొడుకు జున్ను. అంత చిన్న పిల్లాడికి వదిలి ఉండటం అంటే తనకి కూడా చాలా కష్టమే. అయినా కూడా ఇన్ని రోజులు వదిలిపెట్టి ఉంది. అందుకే వెల్లేముందు చాలా సంతోషంగా వెళ్ళింది. హౌస్ లోపలికి స్మైల్ తో ఎంట్రీ ఇచ్చి అదే స్మైల్ తో హౌస్ నుండి వెళ్లిన కంటెస్టెంట్ లాస్య. మరి హౌస్ నుండి అవుట్ అయినా.. తన వీడియోస్ తో అభిమానులకు దగ్గరగానే ఉంటుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.