భార్య కు నాని బర్త్ డే విషెస్ – గుడ్ కంపెనీ

Natural Star Nani Shares A Throwback Picture On Twitter To Wish His Wife On Her Birthday

సోష‌ల్ మీడియాలో నాని ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటాడు. సినిమాల‌కు సంబంధించిన విష‌యాలే కాదు వ్య‌క్తిగ‌త విష‌యాలు కూడా అభిమానులతో షేర్ చేసుకుంటాడు. ఇక ఇదిలా ఉండగా ఈ రోజు నాని సతీమణి అంజనా పుట్టినరోజు. ఈ సందర్భంగా నాని అంజనాకు సోషల్ మీడియా ద్వారా బర్త్ డే విషెస్ తెలియచేసాడు. ఫ్లయిట్ లో ఉన్న తమ ఫ్యామిలీ ఫొటోను పోస్ట్ చేస్తూ.. హ్యాపీ బర్త్ డే అంజనా.. లాంగ్ ఫ్లయిట్ కానీ నువ్వు ఇద్దరికీ మంచి కంపెనీ ఇచ్చావు అంటూ పోస్ట్ లో పేర్కొన్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

View this post on Instagram

 

A post shared by Nani (@nameisnani)

ఇక నాని చేస్తున్న సినిమాల విష‌యానికి వ‌స్తే ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో నాని హీరోగా ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా “టక్ జగదీష్” సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రీతువర్మ, ఐశ్వర్యా రాజేష్ కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాను… సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. ఈ మూవీ తరువాత రాహుల్‌ సంక్రీత్యన్‌ దర్శకత్వంలో శ్యామ్ సింగరాయ్‌లో నటించనున్నారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మిస్తోన్న ఈ మూవీలో సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్లుగా నటించనున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించనున్న ఈ మూవీ డిసెంబర్‌ నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది.

వీటితో పాటు బ్రోచేవారెవరురా ఫేం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్. ఈ సినిమాకు ‘అంటే సుందరానికి’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. రొమాంటిక్ ప్రేమ కథగా ఈ మూవీ తెరకెక్కనుందని తెలుస్తోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − three =