శింబు ‘మానాడు’ ఫస్ట్ లుక్ రిలీజ్

Simbu Maanadu First Look Is Out

ప్రస్తుతం శింబు వెంకట్ ప్రభు డైరెక్షన్లో ‘మానాడు’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పవర్ ఫుల్ పొలిటికల్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో వుంది.ఇక తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. నిజానికి ఈ సినిమాను గత ఏడాదే ప్రకటించినా కరోనా వల్ల ఆలస్యమైంది. ఇప్పుడు శరవేగంగా షూటింగ్ జరుపుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఫస్ట్ లుక్ ను చూస్తుంటే.. ఈ సినిమాలో శింబు ఓ ముస్లిం యువకుడి పాత్రలో కనిపించనున్నట్టు అర్ధమవుతుంది. ముస్లిం టోపీ పెట్టి నమాజ్ చేస్తున్న లుక్‌తో సరికొత్తగా కనిపిస్తున్నాడు శింబు. అతడి నుదుటి మీద బుల్లెట్ దిగినట్లు.. పైనుంచి రక్తం కారుతున్నట్లు కూడా ఫస్ట్ లుక్ డిజైన్ చేశారు.

ఈ సినిమాలో శింబుకు జోడిగా కళ్యాణీ ప్రియదర్శన్‌ నటిస్తుండగా ఎస్‌ఏ చంద్రశేఖర్‌, భారతీరాజా, ప్రేమ్‌జీ అమరన్‌, కరుణాకరన్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సురేష్ కామాక్షి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

దీనితోపాటు నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ సుశీంద్రన్ దర్శకత్వంలో ‘ఈశ్వరుడు’ సినిమా చేస్తున్నాడు. లాక్‌డౌన్ తరవాత షూటింగ్ ప్రారంభించి చకచకా సినిమాను పూర్తి చేశారు. ఈ షెడ్యూల్ కోసం 25 రోజులు కేటాయించిన శింబు.. 22 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసినట్టు తెలుస్తుంది. కాగా, నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన ‘ఈశ్వరుడు’ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం సమకూరుస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + five =