
ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 153


అనిల్ తో బాలయ్య - క్రేజీ కాంబినేషన్

అదిరిపోయిన ఎన్టీఆర్ సర్ ప్రైజ్ వీడియో

బాల వాక్కు బ్రహ్మ వాక్కు

"RRR" లో అతిథి పాత్రలో విజయ్ ?

అల్లు అర్జున్ భారీ విరాళం... కేరళకు కూడా

ఒకే రోజు చిరు, బాలయ్య చిత్రాలు?

`అయ్యప్పనుమ్ కోషియుమ్`రీమేక్‌లో రానా?

అదే నాకు బెస్ట్ గిఫ్ట్ - రామ్ చరణ్

‘ఆర్ ఆర్ ఆర్’లో మోహన్ లాల్?

"సాహో రే" ప్రభాస్

చిరంజీవి `ఆరాధన`కి 33 ఏళ్ళు

రామరాజు కోసం భీమ్ సర్ ప్రైజ్ వీడియో

ఎన్టీఆర్ కూడా ఆ లిస్ట్ లో..!

ప్రభాస్-నాగ్ అశ్విన్ సినిమా ఇప్పట్లో లేనట్టే..

సినీ కార్మికులను కోటి విరాళం

ఎవరికీ తెలియని నిజం ?

అల్లు అర్జున్ సినీకెరీర్ లో 17 సంవత్సరాలు పూర్తి
సూపర్ హిట్ "విజేత ", "స్వాతిముత్యం " మూవీస్ లో బాలనటుడిగా నటించిన అల్లుఅర్జున్ "డాడీ " మూవీ లో అతిథి పాత్రలో నటించారు. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు 100వ సినిమా గా రూపొందిన "గంగోత్రి " మూవీ తో టాలీవుడ్ కు అల్లు అర్జున్ హీరోగా పరిచయం అయ్యారు. ఆ మూవీ 2003 సంవత్సరం మార్చి 28 వ తేదీ రిలీజ్ అయ్యి మ్యూజికల్ హిట్ గా నిలిచింది. ఈ రోజు తో అల్లు అర్జున్ తన సినీకెరీర్ లో 17 సంవత్సరాలు దిగ్విజయంగా కంప్లీట్ చేసుకున్నారు.

అనిల్ తో బాలయ్య - క్రేజీ కాంబినేషన్
తెలుగు సినీ పరిశ్రమలో అప్పుడప్పుడు క్రేజీ కాంబినేషన్స్ వస్తూనే ఉంటాయి. అలా వచ్చిన క్రేజీ కాంబినేషన్ లో ఒకటే పూరీ-బాలయ్య సినిమా. ఈ సినిమాలో పూరీ బాలయ్యను మాములు హైపర్ గా చూపించలేదు. ఇక ఇప్పుడు బాలయ్య మరో డైరెక్టర్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. ఆ డైరెక్టర్ ఎవరో కాదు అనిల్ రావిపూడి. ప్రస్తుతం అనిల్ రావిపూడి సూపర్ హిట్స్ తో మంచి ఫామ్ లో ఉన్నాడు. గత ఏడాది ఎఫ్2 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అనిల్ రావిపూడి... ఈ ఏడాది సంక్రాంతికి మహేష్ తో సరిలేరు మూవీ తో సూపర్ హిట్ కొట్టాడు. దీనితో అనిల్ తో సినిమాలు చేయడానికి హీరోలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

"RRR" తమిళ, హిందీ డబ్బింగ్ వెర్షన్స్ కు స్వంత వాయిస్
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న మల్టీ స్టారర్ "రౌద్రం రణం రుధిరం" మూవీ 2021 సంవత్సరం జనవరి 8వ తేదీ సుమారు 10 భాషలలో రిలీజ్ కానుందని సమాచారం. అలియా భట్, ఒలీవియా హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీ లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.

అదిరిపోయిన ఎన్టీఆర్ సర్ ప్రైజ్ వీడియో
ఫైనల్ గా రామ్ చరణ్ పుట్టిన రోజుకు ఎన్టీఆర్ ఇస్తానన్న సర్ ప్రైజ్ వీడియో వచ్చేసింది. నిజానికి ఈ రోజు 10 గంటలకే ఈ వీడియో రిలీజ్ అవ్వాలి. కానీ ఎందుకు లేట్ అయిందో తెలుసుగా. ఉదయం నుండి ట్విట్టర్ లో ఈ హడావుడే నడుస్తుంది. తాను పంపిస్తానన్న వీడియో నిట రాజమౌళి కి పంపించానని.. నీకు తెలుసుగా చరణ్ రాజమౌళి తో ఎలా ఉంటుందో.. సారి అంటూ ట్వీట్ చేయగా దానికి చరణ్ కూడా ఆయనకు పంపావా.. ఎప్పుడొస్తుంది అంటూ సెటైర్లు వేశారు. ఇక చిరు కూడా వీడియో కోసం ఎదురుచూస్తున్నాను అని ట్వీట్ చేయగా దానికి రాజమౌళి... 'సా..ర్.. అంటే.. అది.. కొంచం.. కొంచమే.. ప్లీజ్.. సర్' అని ట్వీట్ చేశారు. కొంచం ఆలస్యం అవుతుందని చెప్పారు. దీనిపై…

కరోనా కోసం ముందుకొచ్చిన టాలీవుడ్ దాతలకు పవన్ కళ్యాణ్ థ్యాంక్స్
టాలీవుడ్ సినీ తారలు 'కరోనా' కట్టడి కోసం విరాళాలు ఇవ్వడానికి ఒకరి తర్వాత ఒకరు ముందుకొస్తున్న సంగతి తెలిసిందే. ఒకరోజు అటు ఇటుగా అందరూ విరాళాలు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకి తమ వంతు సాయం అందించారు. ఇంకా విరాళాలు ఇవ్వడానికి ముందుకొస్తునే ఉన్నారు. ఈ నేపథ్యంలో పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విరాళాలు ఇచ్చి ప్రజలకు అండగా నిలిచినందుకు... పేరు పేరునా హీరోలకు కృతజ్ఞతలు తెలిపాడు.

బాల వాక్కు బ్రహ్మ వాక్కు
సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితార సోషల్ మీడియా లో కొత్త కొత్త వీడియోస్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పుడు కరోనా వైరస్ పై అవగాహన పెంచేలా ఒక వీడియో రూపొందించింది. దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోలేకపోవడం కరోనా లక్షణాలు గా చెబుతూ, అటువంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్ ను సంప్రదించండని, 5 సూచనలు అందరూ తప్పక పాటించాలని సితార చెప్పింది.

"RRR" లో అతిథి పాత్రలో విజయ్ ?
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రూపొందుతున్న మల్టీ స్టారర్ "రౌద్రం రణం రుధిరం "మూవీ సంక్రాంతి కానుకగా 2021సంవత్సరం జనవరి 8వ తేదీ రిలీజ్ కానుంది. అలియా భట్, ఒలీవియా మోరిస్ కథానాయికలు కాగా అజయ్ దేవగన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందించారు.

అల్లు అర్జున్ భారీ విరాళం... కేరళకు కూడా
కరోనా ను అరికట్టేందుకు గానూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. ఇళ్లల్లో నుండి బయటకు రావొద్దని చెపుతూనే... ప్రజలకు ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకుంటున్నారు. ఇంకా వేడి నీళ్లకు చన్నీళ్ళు అన్నట్టు మన టాలీవుడ్ హీరోలు కూడా తమ వంతు సాయం చేయడానికి ముందుకొస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, నితిన్త, పలువురు డైరెక్టర్స్ విరాళాలు ప్రకటించగా.... ఇప్పుడు వీరి ఖాతాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా చేరారు. తనవంతుగా మొత్తం రూ.1.25 కోట్ల సాయాన్ని విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించాడు.

మేటినటుల అపూర్వకలయిక ‘మాయాబజార్’కు 63 ఏళ్ళు
తెలుగునాట చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రాల్లో `మాయాబజార్` ఒకటి. యన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, యస్.వి.రంగారావు, సావిత్రి, సంధ్య, గుమ్మడి, ముక్కామల, సి.యస్.ఆర్., రమణారెడ్డి, రేలంగి, ఛాయాదేవి, సూర్యకాంతం, ఋష్యేంద్రమణి వంటి దిగ్గజ నటుల మేలికలయికలో లెజెండరీ డైరెక్టర్ కేవీ రెడ్డి రూపొందించిన ఈ చిత్రాన్ని బి.నాగిరెడ్డి, చక్రపాణి సంయుక్తంగా నిర్మించారు.

ఒకే రోజు చిరు, బాలయ్య చిత్రాలు?
మెగాస్టార్ చిరంజీవి, నటసింహ బాలకృష్ణ... తెలుగునాట ఈ ఇద్దరు అగ్ర కథానాయకులకు ఉన్న క్రేజే వేరు. వీరు నటించిన సినిమాలు విడుదలవుతున్నాయంటే అభిమానులకు మాత్రమే కాదు బాక్సాఫీస్ కి కూడా పండగే. అంతటి క్రేజ్ ఉన్న ఈ ఇద్దరు అగ్ర కథానాయకులు... తమ తమ అప్‌కమింగ్ మూవీస్‌తో ఒకే రోజున బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్నారని టాక్.

`అయ్యప్పనుమ్ కోషియుమ్`రీమేక్‌లో రానా?
మలయాళంలో ఘనవిజయం సాధించిన `అయ్యప్పనుమ్ కోషియుమ్` చిత్రం... తెలుగులో రీమేక్ కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ అధినేత సూర్యదేవర నాగవంశీ ఈ మల్టీస్టారర్ మూవీని తెలుగులో నిర్మించనున్నాడని సమాచారం.

అదే నాకు బెస్ట్ గిఫ్ట్ - రామ్ చరణ్
స్టార్ హీరోగా, సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా టాలీవుడ్ లో కొనసాగుతున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈరోజు తన 35 పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. మామూలు రోజుల్లో అయితే అభిమానుల కోలాహలానికి హద్దే ఉండదు. కరోనా వైరస్ కారణంగా ఇళ్ళకే పరిమితం అయిన అభిమానులు తమ అభిమాన హీరో రామ్ చరణ్ ను పుట్టిన రోజు శుభాకాంక్షలతో ముంచెత్తారు.

‘ఆర్ ఆర్ ఆర్’లో మోహన్ లాల్?
మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. `గాండీవం` (స్పెషల్ సాంగ్), ‘మనమంతా’, ‘జనతా గ్యారెజ్’ వంటి స్ట్రెయిట్ ఫిల్మ్స్‌తో తెలుగునాట కూడా సందడి చేసిన ఈ కంప్లీట్ యాక్టర్... త్వరలో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి సిధ్ధపడుతున్నాడట.

"సాహో రే" ప్రభాస్
ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి ఇప్పుడిప్పుడే ఇండియా లో తన ప్రతాపం చూపుతుంది. కరోనా వైరస్ కారణంగా ప్రజల దైనందిక కార్యక్రమాలపై ఎఫెక్ట్ పడింది. ప్రాణాలు హరిస్తున్న కరోనా కారణం గా జన జీవనం అల్లకల్లోలమయింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలతో ప్రజలు అప్రమత్తం తో ప్రజలు ఇళ్ళకే పరిమితం అవుతున్నారు. కరోనా కట్టడి కై కేంద్ర, తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు విశేషంగా కృషి చేస్తున్నాయి. మార్చి 22 వ తేదీ కర్ఫ్యూ ప్రకటించిన ప్రధాని మోదీ ప్రజా శ్రేయస్సు కై 21 రోజులపాటు లాక్ డౌన్ విధించారు.

చిరంజీవి `ఆరాధన`కి 33 ఏళ్ళు
మెగాస్టార్ చిరంజీవి నటనావైభవానికి ప్రతీకగా నిలిచిన చిత్రాలలో `ఆరాధన` ఒకటి. చిరంజీవిలోని నటుణ్ణి మరో స్థాయికి తీసుకువెళ్ళిన ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ లో సుహాసిని, రాధిక కథానాయికలుగా నటించారు. రాజశేఖర్, పి.యల్.నారాయణ, ప్రసాద్, కృష్ణమూర్తి, జానకి, అనూరాధ వాసుదేవ్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. తమిళ చిత్రం `కడలోర కవితైగళ్` ఆధారంగా ‘ఆరాధన’ను రూపొందించారు దర్శకుడు భారతీరాజా.

రామరాజు కోసం భీమ్ సర్ ప్రైజ్ వీడియో
మొత్తానికి ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న ఆర్ఆర్ఆర్ టీమ్ ఎలాంటి హడావుడి లేకుండా ఇప్పుడు వరుస పెట్టి సర్ ప్రయిజ్ లు ఇస్తుంది. నిన్న ఉగాది పండుగకు టైటిల్ ను ప్రకటించి అందరికీ షాకిచ్చారు. ఆ ఎప్పటినుండో వింటున్నాం.. ఇప్పుడు మాత్రం ఏం రిలీజ్ చేస్తారో అనుకున్నారు అందరు. కానీ అందరికీ షాకిస్తూ టైటిల్ ను రిలీజ్ చేశారు. ఇక రేపు మరో సర్ ప్రైజ్ ఇవ్వనున్నట్టు ప్రకటించారు. రేపు చరణ్ పుట్టిన రోజు కావడంతో జూనియర్ రామ్ చరణ్ కు స్పెషల్ వీడియోతో సర్ ప్రైజ్ ఇవ్వనున్నాడు. అంతే కాదు ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. రేపు ఉదయం 10 గంటలకు రామ్ చరణ్ స్పెషల్ వీడియోను జూనియర్ ఎన్టీఆర్ లాంచ్ చేస్తున్నాడు. చూద్దాం…

ఎన్టీఆర్ కూడా ఆ లిస్ట్ లో..!
కరోనా వైరస్ ను అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 21 రోజుల పాటు లాక్‌డౌన్ విధించడంతో ప్రజలందరూ ఇళ్ల నుండి బయటకు వచ్చే పరిస్థితి లేదు. కరోనాపై పోరాటానికి, ఈ లాక్‌డౌన్ సమయంలో ప్రజల సహాయార్థం నిధులు అవసరం ఎంతో ఉంది. అందుకే, టాలీవుడ్‌కి చెందిన పలువురు ప్రముఖులు తమ వంతు సాయంగా ప్రభుత్వాలకు విరాళాలను ప్రకటించారు.

ప్రభాస్-నాగ్ అశ్విన్ సినిమా ఇప్పట్లో లేనట్టే..
నాగ్ అశ్విన్ తో ప్రభాస్ సినిమా ఉంటుందని మనకు తెలిసిందే కదా. అత్యంత భారీ బడ్జెట్‌తో సైన్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ చిత్రం షూటింగ్‌ను ఈ ఏడాది చివర్లో ప్రారంభించాలని అనుకున్నారు. కానీ కరోనా ఎఫెక్ట్ ఈ సినిమాపై కూడా పడింది. ప్రస్తుతం కరోనా కారణంగా దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమ లాక్‌డౌన్ అయింది. ఎక్కడి షూటింగ్ అక్కడే ఆగిపోయాయి. మళ్లీ షూటింగ్‌లు ఎప్పుడు ప్రారంభమవుతాయో కూడా తెలీదు. ఒక వేళ అయినా ప్రభాస్ ముందు రాధా కృష్ణ సినిమాలో జాయిన్ అవ్వాలి.ఇక ఈ సినిమా అయిపోతేకానీ ప్రభాస్ నాగ్ అశ్విన్ సినిమా ప్రారంభించాడు. అలా ఈ ఏడాది చివరిలో ప్రారంభించాలన్న ఈ సినిమా కాస్త వచ్చే ఏడాదికి వెళ్ళిపోయింది. మరి…

సినీ కార్మికులను కోటి విరాళం
నిన్న మొన్నటి వరకూ టాలీవుడ్ హీరోలు ఏమయ్యారు... అందరూ విరాళాలు ఇస్తుంటే మన హీరోలు ఏం చేస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో తెగ కామెంట్లు వినిపించాయి. అయితే ఈ రోజు ఒక్కొక్కరుగా తమ వంతు సాయం చేయడానికి ముందుకొస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్ చరణ్, అనిల్ రావిపూడి, త్రివిక్రమ్ ఇలా పలువురు తమకు తోచినంత సాయం చేశారు. ఇప్పుడు తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా కోటి రూపాయలు విరాళం చేసారు. సినీ కార్మికులకు కోటి రూపాయలు విరాళం ఇస్తున్నట్టు ట్విట్టర్ లో పేర్కొన్నారు.

ఎవరికీ తెలియని నిజం ?
స్టార్ రైటర్ , నిర్మాత, యాక్టర్, గీత రచయిత, డైలాగ్ రైటర్ , దర్శకుడు కోన వెంకట్ సక్సెస్ ఫుల్ గా టాలీవుడ్ లో కొనసాగుతున్నారు. 1997 సంవత్సరంలో "తోక లేని పిట్ట " మూవీ తో కోన వెంకట్ టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఆ మూవీ దారుణంగా పరాజయం పొందింది. సత్య, దిల్ సే , కౌన్, మస్త్ , జంగిల్, కంపెనీ వంటి హిందీ మూవీస్ కు తెలుగు డబ్బింగ్ రైటర్ గా పనిచేసిన కోన వెంకట్ "ఒకరికి ఒకరు " సక్సెస్ ఫుల్ మూవీ తో టాలీవుడ్ లో రైటర్ గా మారారు.