సినీ కార్మికులను కోటి విరాళం

One Crore Rupees Donation To Support Tollywood Film Artists and Workers

నిన్న మొన్నటి వరకూ టాలీవుడ్ హీరోలు ఏమయ్యారు… అందరూ విరాళాలు ఇస్తుంటే మన హీరోలు ఏం చేస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో తెగ కామెంట్లు వినిపించాయి. అయితే ఈ రోజు ఒక్కొక్కరుగా తమ వంతు సాయం చేయడానికి ముందుకొస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్ చరణ్, అనిల్ రావిపూడి, త్రివిక్రమ్ ఇలా పలువురు తమకు తోచినంత సాయం చేశారు. ఇప్పుడు తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా కోటి రూపాయలు విరాళం చేసారు. సినీ కార్మికులకు కోటి రూపాయలు విరాళం ఇస్తున్నట్టు ట్విట్టర్ లో పేర్కొన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇండస్ట్రీలో ఉన్న రోజువారి కూలీలకు, అలాగే తక్కువ సంపాదన ఉన్న వాళ్లకు తన వంతు సాయంగా ఈ చిన్న సాయం చేస్తున్నట్లు ట్వీట్ చేశారు చిరంజీవి. ఈ వైరస్ అరికట్టడానికి ప్రభుత్వాలు చేస్తున్న కార్యక్రమాలపై చిరు ప్రశంసలు కురిపించాడు. దయచేసి అంతా ఇంట్లోనే ఉండి ఈ 21 రోజుల యుద్ధంలో గెలుద్దామని ట్వీట్ చేసాడు చిరు.

 

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + 13 =