అల్లు అర్జున్ సినీకెరీర్ లో 17 సంవత్సరాలు పూర్తి

Stylish Star Allu Arjun Completes 17 Years In Tollywood

సూపర్ హిట్ “విజేత “, “స్వాతిముత్యం ” మూవీస్ లో బాలనటుడిగా నటించిన అల్లుఅర్జున్ “డాడీ ” మూవీ లో అతిథి పాత్రలో నటించారు. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు 100వ సినిమా గా రూపొందిన “గంగోత్రి ” మూవీ తో టాలీవుడ్ కు అల్లు అర్జున్ హీరోగా పరిచయం అయ్యారు. ఆ మూవీ 2003 సంవత్సరం మార్చి 28 వ తేదీ రిలీజ్ అయ్యి మ్యూజికల్ హిట్ గా నిలిచింది. ఈ రోజు తో అల్లు అర్జున్ తన సినీకెరీర్ లో 17 సంవత్సరాలు దిగ్విజయంగా కంప్లీట్ చేసుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రూపొందిన బ్లాక్ బస్టర్ మూవీ “ఆర్య”మలయాళ డబ్బింగ్ వెర్షన్ ఘనవిజయం సాధించి కేరళ రాష్ట్రంలో అల్లు అర్జున్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అల్లు అర్జున్ హీరోగా నటించిన బన్నీ, దేశముదురు, పరుగు, ఆర్య2, వేదం, జులాయి, ఇద్దరు అమ్మాయిలతో, రేసుగుర్రం, S/O సత్యమూర్తి, రుద్రమదేవి, సరైనోడు, DJ, అల …వైకుంఠపురములో .. మూవీస్ ఘనవిజయం సాధించాయి. తన పెర్ఫార్మెన్స్, డాన్స్ లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న అల్లు అర్జున్ కు దక్షిణాది తో పాటు హిందీ డబ్బింగ్ వెర్షన్స్ ద్వారా ఉత్తరాది లో కూడా క్రేజ్ పెరిగింది. తమ అభిమాన హీరో అల్లు అర్జున్ తన 17 సంవత్సరాల సినీకెరీర్ విజయవంతంగా కంప్లీట్ చేసుకున్నందుకు అభిమానులు ట్విట్టర్ ద్వారా తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న AA 20 మూవీ లో నటిస్తున్న విషయం తెల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − fifteen =