అనిల్ తో బాలయ్య – క్రేజీ కాంబినేషన్

This Crazy Actor Director Combo Soars Expectations Among Telugu Audience

తెలుగు సినీ పరిశ్రమలో అప్పుడప్పుడు క్రేజీ కాంబినేషన్స్ వస్తూనే ఉంటాయి. అలా వచ్చిన క్రేజీ కాంబినేషన్ లో ఒకటే పూరీ-బాలయ్య సినిమా. ఈ సినిమాలో పూరీ బాలయ్యను మాములు హైపర్ గా చూపించలేదు. ఇక ఇప్పుడు బాలయ్య మరో డైరెక్టర్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. ఆ డైరెక్టర్ ఎవరో కాదు అనిల్ రావిపూడి. ప్రస్తుతం అనిల్ రావిపూడి సూపర్ హిట్స్ తో మంచి ఫామ్ లో ఉన్నాడు. గత ఏడాది ఎఫ్2 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అనిల్ రావిపూడి… ఈ ఏడాది సంక్రాంతికి మహేష్ తో సరిలేరు మూవీ తో సూపర్ హిట్ కొట్టాడు. దీనితో అనిల్ తో సినిమాలు చేయడానికి హీరోలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కామెడీతో పాటు ఫ్యామిలీ డ్రామాని కూడా తెరకెక్కించడంలో సిద్ధ హస్తుడు అనిల్ రావిపూడి. ఇటీవల దర్శకుడు అనిల్ ను పిలిచి తనకోసం ఓ మంచి వినోదాత్మక చిత్రాన్ని రూపొందించాల్సిందిగా బాలకృష్ణ అడిగినట్టు సమాచారం. దీనికి అనిల్ కూడా ఓకే అన్నట్టు తెలుస్తుంది. మరి కరెక్ట్ కథ దొరికితే వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా త్వరలోనే వస్తదేమో.. చూద్దాం అసలు ఏం జరుగుతుందో.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × three =